Bheema త్వరలో ప్రభాస్‌తో మూవీ.. సలార్‌లో ఎందుకు నటించలేదంటే? గోపిచంద్‌ క్లారిటీ

మాచో హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం భీమా. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ భారీగా నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మహా శివరాత్రి పర్వదినం మార్చి 8వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. ఈ సినిమా గురించి హీరో గోపిచద్ మాట్లాడుతూ..

కోవిడ్ సమయంలో నాకు దర్శకుడు భీమా కథ చెప్పారు. కథతోపాటు క్యారెక్టర్ నచ్చడం, అలాగే సెమీ ఫాంటసీ పాయింట్ నచ్చడంతో ఈ సినిమాను ఒకే చేశాను. పక్కా కమర్షియల్, యాక్షన్ ఉంటుంది. మంచి రొమాన్స్ ఉంటుంది. ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా భీమా క్యారెక్టరైజన్ బాగా నచ్చడంతో ఈ సినిమాకు బాగా నచ్చింది. పరుశురాముడి క్షేత్రంలో ఈ కథ జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్‌ను తీసుకొన్నాం అని హీరో గోపిచంద్ అన్నారు.

Hero Gopichand opened about Movie with Prabhas at Bheema Movie Promotions

ప్యాన్ ఇండియా కోసం సినిమా చేస్తే కుదరదు. ప్యాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు వర్క్ కాలేదు. కేవలం ప్రభాస్‌కు మాత్రమే వర్కవుట్ అయ్యాయి. అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావు. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఆడియెన్స్‌కు ఓ టేస్ట్ ఉంటుంది. కథ బాగా ఉండి.. యూనివర్సల్ పాయింట్ ఉంటే అది పాన్ ఇండియా కావడానికి అవకాశం ఉంటుంది అని హీరో గోపిచంద్ చెప్పారు.

సలార్‌ ఇద్దరు స్నేహితుల కథ నిజమే. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో నేను చూసి ఉంటే బాగుండేదేమో చెప్పలేను. ఎందుకంటే మా మధ్య ఆ బాండింగ్ ఉంది. కానీ ఆ సినిమాలో ఫ్రెండ్ ప్రభాస్‌తో సినిమా చేయడమనేది డైరెక్టర్ ఛాయిస్. పృథ్వీరాజ్ సుకుమార్ కూడా బాగా చేశారు అని హీరో గోపిచంద్ చెప్పారు.

Hero Gopichand opened about Movie with Prabhas at Bheema Movie Promotions

ప్రభాస్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకొంటున్నాం. కానీ ఆ సినిమా చేయాలంటే కాలం కలిసి రావాలి. కానీ ప్రభాస్‌తో తప్పకుండా మూవీ చేస్తాను. అది ఎప్పుడనేది వేచి చూడాల్సిందే. కానీ తప్పకుండా ప్రభాస్‌తో సినిమా ఉంటుంది అని గోపిచంద్ తెలిపారు.

Hero Gopichand opened about Movie with Prabhas at Bheema Movie Promotions

ప్రస్తుతం శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నాను. ఈ సినిమా సుమారుగా 30 శాతం షూటింగ్ పూర్తయింది. యాక్షన్, కామెడీ మూవీగా రూపొందుతున్నది. ఈ సినిమా మాత్రం ఆయన స్టైల్‌లో ఉంటుంది. మళ్లీ ఈ సినిమా కమ్ బ్యాక్ అవుతుంది. మంచి కసితో ఆయన సినిమా తీస్తున్నాడు అని గోపిచంద్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X