Amigos ఆ తప్పుతో సినిమాకు అన్యాయం చేయలేను.. అమిగోస్‌పై కల్యాణ్ రామ్ కామెంట్ (ఇంటర్వ్యూ)
బింబిసార భారీ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన విభిన్నమైన చిత్రం అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి రూపొందించిన ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ నటించింది. నవీన్ ఎర్నేని, రవి ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అమిగోస్‌పై భారీ క్రేజ్ పెరిగింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..

మంచి కథలు దొరికినప్పుడు గ్యాప్ ఇవ్వలేను
సక్సెస్ లభించిన తర్వాత, మంచి కథలు ఉన్నప్పుడు వరుసగా సినిమాలు చేయాల్సిందే. బింబిసార సినిమా సక్సెస్ బాధ్యత పెంచింది. అందుకే మంచి కథలపై దృష్టిపెడుతూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాను. బింబిసార చేస్తున్న సమయంలో అమిగోస్, డెవిల్ సినిమాలను ఒకే చేశాను. బింబిసార కథ విన్న తర్వాత ఈ రెండు కథలు వచ్చాయి అని కల్యాణ్ రామ్ చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్‌తో అలా
మైత్రీ మూవీ మేకర్స్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. జనతా గ్యారేజ్ సినిమా నుంచి వారితో ట్రావెల్ అవుతున్నాను. వారితో ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాను. ఆ క్రమంలో ఒక కథను వారి వద్దకు పంపించాను. వారికి అది నచ్చలేదు. దాంతో మా వద్ద ఓ కథ ఉంది.. వింటారా అని రాజేంద్రరెడ్డిని పంపించారు. ఆ కథ నచ్చడంతో అమిగోస్ సినిమా చేశాను అని నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు.

అమిగోస్ సినిమా ఎందుకు చేశానంటే?
త్రిపాత్రాభినయం చేయాలనే ఉద్దేశంతో అమిగోస్ చేయలేదు. కథ, కాన్సెప్ట్ నచ్చడంతో ఈ సినిమా చేశాను. మనిషిని పోలిన మనిషి అనే కథ నాకు బాగా నచ్చింది. మూడు పాత్రల్లో విలన్ పాత్ర బాగా నచ్చింది. హీరోయిన్ ఉండదు. హీరోనే విలన్ అనే కాన్సెప్ట్ బాగా రాశారు. మూడు పాత్రలకు సమానంగా బలంగా ఉంటాయి. రెండున్నర గంటల్లో తెర మీద కల్యాణ్ రామ్ మాత్రమే కనిపిస్తాడు అని కల్యాణ్ రామ్ తెలిపారు.

మూడు పాత్రలు నాకు ఇష్టమే
అమిగోస్ చిత్రంలో మంజునాథ, సిద్దార్థ్, మైఖేల్ పాత్రలు వేటికి అవే బాగుంటాయి. ఒక్కో పాత్ర ఒక్కో రకంగా బిహేవ్ చేస్తుంటాయి. మూడు పాత్రలు నాకు నచ్చాయి. అమిగోస్ ఏ సినిమా నుంచి ఇన్స్‌పైర్ అయి చేసింది లేదు. ఇది డిఫరెంట్ మూవీ. కామెడీ మూవీ కాదు. ఫుల్లుగా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ లేదు అని కల్యాణ్ రామ్ చెప్పారు.

టైటిల్ ఇంపార్టెంట్ కాదు..
అమిగోస్ అనే టైటిల్ పెట్టడానికి చాలా ఆలోచించాం. అమిగోస్ అంటే స్పానిష్‌లో ఫ్రెండ్స్ అని అర్థం. ఈ సినిమాకు యాప్ట్ ఈ టైటిల్. ఇటీవల హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నారు. సినిమాకు టైటిల్ అంత ముఖ్యం కాదు. ఒకవేళ తప్పు టైటిల్ సినిమాకు అన్యాయం చేశానంటే నేను ఎక్కువగా ఫీలవుతాను. ఈ కథకు అమిగోస్ టైటిల్ కరెక్ట్ అని భావిస్తున్నాను.

బింబిసారతో ప్రయోగం చేయలేదు
నేను ప్రయోగాలు పెద్దగా చేయలేదు. కమర్షియల్ సినిమాలను కొత్తగా చెప్పాలని ట్రై చేశాను. బింబిసార సినిమా ప్రయోగం కాదు. బింబిసార కథ కొత్తేమీ కాదు. పాతాళభైరవి, టైమ్ ట్రావెల్ కథను కొత్తగా చేశాను. నా కెరీర్‌లో ఒకట్రెండు సినిమాలు ఎక్స్‌పరిమెంట్ చేశాను. అంతేగానీ.. కొత్తగా కథలు ఏమీ చేయలేదు.
పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాను. అమిగోస్‌లో విలన్ పాత్ర నాకు కొత్తది. ఇప్పటి వరకు విలన్ పాత్రలు చేయలేదు. బింబిసార తర్వాత మారిపోలేదు. అమిగోస్, డేవిడ్ సినిమాలు బింబిసార రిలీజ్‌కు ముందే ఒకే చేశాను అని కల్యాణ్ రామ్ చెప్పారు.

కోవిడ్ పరిస్థితులు నాలో మార్పు తెచ్చాయి
కోవిడ్ పరిస్థితులు నాలో చాలా ఆలోచనలు, మార్పులు వచ్చాయి. నేను చేసిన సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యానని ఆలోచించాను. కథను నేనే ఒప్పుకొన్నాను కదా. ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని ఆలోచించాను. దాని వల్ల కొత్తగా కథలు ఎంపిక చేసుకొనే విషయాన్ని సీరియస్‌గా తీసుకొన్నాను అని కల్యాణ్ రామ్ అన్నారు.


Click it and Unblock the Notifications











