రెమ్యునరేషన్ విషయంలో సూర్య, జ్యోతిక అలాంటి షాక్.. కార్తీ (ఇంటర్వ్యూ)

దక్షిణాదిలో టాప్ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం సత్యం సుందరం. హోల్సమ్ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు 96 మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో హీరో కార్తి తెలుగు ఫిలింబీట్‌తో మాట్లాడుతూ..

96 మూవీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్న దర్శకుడు ప్రేమ్ కుమార్ వద్ద మంచి స్క్రిప్టు ఉందని నా స్నేహితుడు చెప్పాడు. మీకు ఇవ్వడానికి భయపడుతున్నాడు. దాంతో నేను మెసేజ్ పంపించాను. నాకు స్క్రిప్టు ఎందుకివ్వలేదని అడిగితే.. వెంటనే స్క్రిప్టు ఇది. కానీ నేను నేరేట్ చేయలేను. మీరు చదవండి అని అన్నాడు. దాంతో నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత రెండు, మూడు చోట్ల ఆనందం, భావోద్వేగంతో కంటతడి పెట్టుకొన్నాను. హృదయాన్ని తట్టిపడేసేలా రాశాడు.అది సినిమా స్క్రిప్టు కాదు. ఓ నవల అని కార్తీ చెప్పాడు.

Hero Karthi interview about Satya Sundaram Suriya Arvind Swamy

విశ్వనాథ్, పెద్ద వంశీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వారితో సినిమా చేయలేకపోయాననే ఓ బాధ ఉండేది. కానీ ఈ సినిమా స్క్రిప్టు చదివిన తర్వాత నాకు అలాంటి సినిమా అనిపించింది. వెంటనే ఈ సినిమాను మిస్ చేసుకోవవద్దని అనుకొన్నాను. ఇలాంటి కథ ఎలా రాయగలిగాడు అనే ఫీలింగ్ కలిగింది. జీవితంలో విలువలకు కొన్ని సమాధానాలు చెప్పే విధంగా ఉంటుంది. ఈ నవల చదివిన తర్వాత అన్నయ్య సూర్యకు చెప్పాను. ఇది అందరూ నిర్మాతలు తీసే సినిమా కాదు అని చెప్పాను.

అయితే సూర్యకు చెబితే వెంటనే చేద్దామని అన్నాడు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో ఉండే ఇద్దరు వ్యక్తుల మద్య కెమిస్ట్రీ. అలాంటి క్యారెక్టర్‌కు ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించినప్పుడు నాకు అరవింద్ స్వామి గుర్తుకు వచ్చారు. ఆయనకు స్క్రిప్టు ఇచ్చిన తర్వాత వెంటనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత స్క్రిప్టు బాగుందని అన్నాడు. అలా ఈ సినిమా మొదలైంది అని చెప్పారు.

Hero Karthi interview about Satya Sundaram Suriya Arvind Swamy

సత్యం సుందరం సినిమాలో కీలకమైన పాయింట్ ఎలాంటి షరతులు లేని ప్రేమ. తల్లి కొడుకుల మధ్య అనుబంధం, ఫ్యామిలీ మధ్య అన్ కండిషనల్ లవ్‌తో సినిమా రూపొందింది. కుటుంబ సభ్యులే కాకుండా నీ చుట్టూ ఉండే వ్యక్తుల మధ్య ప్రేమ. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో ఉండే భావోద్వేగాలు కనిపిస్తాయి. ఇలాంటి కథకు హ్యుమర్ జోడించి సినిమా చేశాం అని కార్తీ చెప్పారు.

అయితే ఈ సినిమాలో నటించినందుకు నిర్మాతలు సూర్య, జ్యోతిక రెమ్యునరేషన్ విషయంలో పరిమితులు విధించారు. మా సినిమా కాబట్టి తగ్గించుకోమని చెప్పారు. అయితే నాకు, సూర్యకు చిన్నప్పటి నుంచి తగాదానే ఉంటుంది. నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంటాడు. మీరు ఇప్పుడు రోలెక్స్‌ను చూస్తున్నారు. కానీ నేను ఆయనలో చిన్నప్పటి నుంచి నేను రోలెక్స్‌ను చూస్తున్నాను అంటూ సరదాగా సెటైర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X