Nani: జెర్సీ, శ్యామ్ సింగరాయ్ నిర్మాతలకు నష్టాలా? నాని దిమ్మతిరిగే సమాధానం
Hero Nani: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శౌర్యువ్ కాంబోలో వస్తున్న ఫీల్‌గుడ్ మూవీ హాయ్ నాన్న. ప్రిపోన్డ్ అయి డిసెంబర్ 7వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా.. నాని పాల్గొన్నారు. డిసెంబర్ 21వ తేదీ లేదా 22వ తేదీన హాయ్ నాన్న మూవీని రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు. కానీ మరింత ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
టీజర్ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడిన నాని.. హాయ్ నాన్న సినిమా గురించి చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఇదో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ వీడియోలు రిలీజ్ అయ్యా ఈ విషయం మీకే అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి సినిమా కథ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేస్తుందని అన్నారు. ఇలాంటి మూవీలో నటించడం తన అదృష్టమని నాని చెప్పారు. అభిమానులు, సినీ ప్రియుల ఊహలకు మించి ఈ సినిమా ఉంటుందని ఈ సినిమాతో తాను ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్లు నాని తెలిపారు. పెళ్లి కాకముందు ఆడపిల్లకు తండ్రిని కావాలని కలలు కనేవాడినని, హాయ్ నాన్నతో తన కలలో జీవించే అవకాశం తనకు ఈ సినిమాతో దొరికిందని చెప్పారు.

ఇలాంటి కథతో చాలానే సినిమాలు వచ్చాయి కదా.. ఈ మూవీ ఎలా భిన్నంగా ఉండనుందన్న రిపోర్టర్ల ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారు. ట్రైలర్, ఇతర ప్రమోషనల్ వీడియోలు రిలీజ్ అయ్యాక హాయ్ నాన్న సినిమాపై ఓ క్లారిటీ వస్తుందన్నారు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని చెప్పారు. ప్రతి సినిమాలో ఏదో ఒక సాహసం చేస్తుంటారని, అది కష్టంగా అనిపించడం లేదా అని అడిగిన ప్రశ్నకు.. నచ్చిన పని చేయడం కష్టంగా అనిపించదని నాని బదులిచ్చారు. కమర్షియల్ రన్ కు ఉపయోగపడే కంటెంట్ హాయ్ నాన్న సినిమాలో ఉందా అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అన్ని వయస్సుల వారిని అలరించేదే కమర్షియల్ మూవీ అని, కాబట్టి, హాయ్ నాన్న సినిమా మోస్ట్ కమర్షియల్ చిత్రం అవుతుందని నాని ధీమాగా చెప్పుకొచ్చారు. కమర్షియల్ సినిమా అంటే యాక్షనే అన్నట్లుగా మారిందని అది పూర్తిగా తప్పు అని అన్నారు నాని.
పాన్ ఇండియా అని చెప్పి తెలుగు నటీనటులను తీసుకోవడం లేదని, హాయ్ నాన్న మూవీలో ఎవరూ తెలుగు నటులు లేరన్న ప్రశ్నపై నాని స్పందించారు. పాత్రలకు సూట్ అవుతారని భావించిన వాళ్లనే తీసుకున్నామని, ఒక మంచి సినిమా అందించాలన్న ఉద్దేశంతోనే అలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే సినిమాను ముందుగా తీసుకురావడం గురించి నాని వివరించారు. అన్నయ్య (సలార్) కోసం తమ్ముడు డేట్ మార్చుకుంటాడని అన్నారు. దాని వల్ల ఎలాంటి సమస్య లేదని, ఒక మంచి లవ్ స్టోరీ, యాక్షన్ కథలతో డిసెంబర్ నెల ఉర్రూతలూగిపోతుందని చెప్పారు.

జెర్సీ, శ్యామ్ సింగరామ్ సినిమాలు మంచి టాక్ అందుకున్నప్పటికీ.. ప్రొడ్యూసర్లకు మిగిలిందేం లేదని, ఆశించిన మేర డబ్బులు రాలేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. దానిపై నాని కొంత అసహనంతో సమాధానం ఇచ్చారు. డబ్బులు రాలేదని ఎవరు చెప్పారో చెప్పాలని అన్నారు. గత చిత్రాల కలెక్షన్స్ గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదు అంటూనే.. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ అన్ని విధాలుగా మంచిగానే వసూళ్లు రాబట్టినట్లు చెప్పారు. జెర్సీని ఉదారహణగా చూపించడం తప్పని, కావాలంటే అలా సుందరానికీ సినిమాను ఉదాహరణగా చూపించవచ్చని నాని అసహనం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై జెర్సీ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్విట్టర్ లో స్పందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వచ్చిన జెర్సీ మూవీ మంచి లాభాలు తెచ్చిపెట్టినట్లు చెప్పారు. ఈ సినిమాతోనే సితార బ్యానర్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లు చెప్పారు. క్రియేటివ్ గా, ఆర్థికంగా కూడా ఈ సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు నాగవంశీ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











