ఆ సెంటిమెంట్ ఫాలో అయితే.. రాజమౌళికి తప్ప ఎవరికి సినిమాలు ఉండవు.. నాని (ఇంటర్వ్యూ)

సినిమా పరిశ్రమలో ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయాలని దాదాపు ఎవరు కోరుకోరు. అలాంటి సెంటిమెంట్ ఫాలో అయితే ఏ హీరోకు, ఏ డైరెక్టర్‌కు, ఎవరికీ సినిమాలు ఉండవు. ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ హీరోలకు, డైరెక్టర్లకు ఫ్లాపు ఉన్నాయి. అలా చూస్తే రాజమౌళికి తప్పా మరెవరికి సినిమాలు ఉండకూడదనే నా అభిప్రాయం అని నాని అన్నారు.

జీవితంలో కానీ, సినిమా కెరీర్‌లో గానీ.. ఫెయిల్యూర్ లేకపోతే మనిషి ఎదగడు. పరాజయాలతోనే మనిషి చాలా మానసికంగా ధృఢంగా మారుతాడు. వరుసగా సక్సెస్ వస్తే లేజీగా తయారు అవుతాడు. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ టచ్ చేసినప్పుడే వాస్తవాన్ని తెలుసుకొంటాడు. కాబట్టి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే కసి పెరుగుతుంది అని నాని అన్నారు.

Hero Nani Reacted quoting SS Rajamouli on Ante Sundaraniki Flop before Saripodhaa Sanivaaram releaase

అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ గురించి ఎక్కువ మాట్లాడారు. నా హిట్ సినిమాల కంటే ఆ సినిమా గురించే రకరకాల చర్చ జరిగింది. ఆ విషయంలో నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే సుందరానికి ఫ్లాప్ తర్వాత సరిపోదా శనివారం అనే సినిమా పాయింట్ చాలా ఎగ్జైట్ చేసింది. అందుకే హిట్, ఫ్లాప్ అనే విషయాన్ని పట్టించుకోకుండా ఈ సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం అని నాని అన్నారు.

సినిమా పరిశ్రమలో మంచి సినిమాలన్నీ ఆడాయి. చెడ్డ సినిమాలన్నీ ఆడలేదనే ఫ్రూఫ్ లేదు. మనం ఒక బ్యాడ్ అటెంప్ట్ చేసి సక్సెస్ కొట్టలేదనిపించినప్పుడు మరో మంచి సినిమా చేద్దామని అనుకొంన్నాం. అంటే సుందరానికి బ్యాడ్ సినిమా కాదు. లెంగ్త్ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపించాయి. చాలా మంది ఆ సినిమా ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయవద్దని అన్నారు. సినిమా ఆడకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి అని నాని తెలిపారు.

అంటే సుందరానికి సినిమాను అందర్నీ దృష్టిలో పెట్టుకోని చేసిన సినిమా కాదు. అలాంటి బ్యాడ్ టాక్‌లో కూడా ఆ సినిమా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ జోనర్ అంత కలెక్షన్లు రాబట్టడం అద్బుతమే. ప్రతీ సినిమాకు ఓ డెస్టినీ ఉంటుంది. లెంగ్త్ విషయంలో సరిపోదా శనివారం సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ సినిమా నిడివి 2.50 గంటలు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నాని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X