Sai Pallavi నేను కలిసి నటించొద్దని అనుకొన్నాం.. అదృష్టం కొద్ది శ్యామ్ సింగరాయ్ వల్లే.. నాని హాట్ కామెంట్స్

సాయిపల్లవితో కలిసి నాని నటించిన ఎంసీఏ చిత్రం ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయం దక్కింది. అయితే సాయిపల్లవి పాత్రపై కొంత అసంతృప్తి ప్రేక్షకుల్లో వ్యక్తమైంది. అయితే తన పాత్ర గురించి సాయిపల్లవి కూడా నిరాశ పడ్డారనే విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అలాంటి నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ సినిమాతో మళ్లీ సాయిపల్లవి, నాని నటించారు. అయితే సాయిపల్లవి గురించి, ఆమె పాత్ర గురించి నాని మాట్లాడుతూ..

ఎంసీఏ సినిమా తర్వాత

ఎంసీఏ సినిమా తర్వాత

ఎంసీఏ సినిమా తర్వాత సాయిపల్లవిలో ఎలాంటి మార్పులు లేవు. తను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఎంసీఏ సినిమాలో నాతో సాయిపల్లవికి కేవలం నాలుగు సీన్లు మాత్రమే ఉంటాయి. కానీ ఆ నాలుగు సీన్లు మాత్రం సూపర్. సినిమాలో కొన్ని సీన్లు బాగాలేదని ఎవరైనా అనోచ్చేమో కానీ.. మా ఇద్దరి సీన్ల విషయంలో ఎలాంటి కంప్లయింట్స్ లేవు. మా ఇద్దరి కాంబినేషన్ జనం మెచ్చారు కాబట్టి మేమిద్దరం కలిసి నటించిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి అని నాని చెప్పారు.

ఛాలెంజ్ విసిరే రోల్ వస్తే..

ఛాలెంజ్ విసిరే రోల్ వస్తే..

ఎంసీఏ సినిమా చేస్తున్నప్పుడు యాక్టింగ్ విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. ఆ సినిమాలో నా పేరు నాని, ఆమె పేరు చిన్ని. పల్లవి బయట ఉంటుందో అలాంటి రోల్‌లో ఆమె కనిపించారు. అయితే ఆ సమయంలో మన ఇద్దరికి ఓ ఛాలెంజ్ విసిరే రోల్ వస్తే తప్ప మళ్లి కలిసి సినిమాలో నటించకూడదనే నిర్ణయానికి వచ్చాం. అదృష్టం కొద్ది మేము ఏమని అనుకొన్నామో అలాంటి కథ శ్యామ్ సింగరాయ్ రూపంలో వచ్చింది అని నాని తెలిపారు.

 శ్యామ్ సింగరాయ్ తర్వాత భారీగా అంచనాలు

శ్యామ్ సింగరాయ్ తర్వాత భారీగా అంచనాలు

శ్యామ్ సింగరాయ్ తర్వాత మేమిద్దరం కలిసి నటించాలంటే మరో అద్భుతమైన కథ లభించాల్సిందే. అదే మాకు ముందు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. మాపై భారీ అంచనాలు పెరిగిపోతాయి. మేమిద్దరం కలిసి నటిస్తున్నామంటే.. మా నుంచి అంతకుమించి ఆశిస్తారు. ఎంసీఏ సినిమాలో ఆమెకు అంతగా రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ శ్యామ్ సింగరాయ్ సినిమా బరువును సాయిపల్లవి మోస్తున్నది అని నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కృతిశెట్టి గురించి నాని

కృతిశెట్టి గురించి నాని

కృతి శెట్టి ఒక్క సినిమాలో నటించినా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. శ్యామ్ సింగరాయ్ సినిమా సెట్లో సినిమా మేకింగ్ విషయంలో కొత్త అమ్మాయిలో ఉండే ఆసక్తి, క్యూరియాసిటీ కనిపించింది. చాలా క్యూట్‌గా సినిమాలో కనిపిస్తుంది. కృతిశెట్టి టాలెంటెడ్ నటి. ఈ సినిమాతో మరింత గుర్తింపు లభిస్తుంది అని నాని అన్నారు.

Recommended Video

Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
శ్యామ్ సింగరాయ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

శ్యామ్ సింగరాయ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబస్టియన్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమటం, మనీష్ వాద్వా, లీలా సామ్సన్ తదితరులు
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
కథ: సత్యదేవ్ జంగా
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సినిమాటోగ్రఫి: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: నవీన్ నూలి
మ్యూజిక్: మికీ జే మేయర్
బడ్జెట్: 50 కోట్లు
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2021-12-24

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X