For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాబోయే భార్యతో ఎలా ప్రేమలో పడ్డానంటే.. పెళ్లి ఎక్కడ.. ఎప్పుడంటే.. సీక్రెట్ చెప్పిన నితిన్!

  |

  యువ హీరో నితిన్‌ భీష్మ చిత్రంతో ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్నతో జతకట్టిన నితిన్.. సేంద్రియ వ్యవసాయం కథా నేపథ్యంగా భీష్మగా మారారు. అయితే ఈ సినిమాతోపాటు నితిన్ ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు. ఈక్రమంలో భీష్మ సినిమా గురించి, తనకు కాబోయే సతీమణి శాలిని గురించి సీక్రెట్‌ను వెల్లడించారు. నితిన్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  15న నిశ్చితార్థం.. 16న పెళ్లి

  15న నిశ్చితార్థం.. 16న పెళ్లి

  శాలినితో నాకు దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం జరుగుతుంది, 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నాం. 21న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం. 2012లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శాలిని పరిచయమయ్యింది. అది స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. నేనే తనకు తొలిసారి నా ప్రేమను వ్యక్తం చేశా. తనూ యాక్సెప్ట్ చేసింది అని నితిన్ తెలిపారు.

  Nithiin Shalini Engagement Pictures | Nithiin Shalini Marriage In April | Filmibeat Telugu
  గతేడాది ఇంట్లో వాళ్లకు చెప్పాం..

  గతేడాది ఇంట్లో వాళ్లకు చెప్పాం..

  గత సంవత్సరం ఇద్దరం ఇట్లోవాళ్లకు ఈ విషయం చెప్పాం. అప్పటి దాకా వాళ్లకూ ఈ విషయం తెలీదు. నిజానికి మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ మ్యారేజ్ అనేది జీవితంలో పెద్ద అడుగు కాబట్టి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకొన్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. రెండు వైపులు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి అని నితిన్ పేర్కొన్నారు.

  ఓ ప్లాన్ ప్రకారమే లవ్‌ను బయటపెట్టలే

  ఓ ప్లాన్ ప్రకారమే లవ్‌ను బయటపెట్టలే

  ఒక ప్లాన్ ప్రకారమే మేం ఎక్కడా మా ప్రేమను బయట వ్యక్తం చెయ్యకుండా ఉంచగలిగాం. మీడియా అటెన్షన్ వద్దనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది నా ఆలోచన కాదు. శాలిని, ఆమె తల్లిదండ్రులు, మా అమ్మానాన్నల ఆలోచన. బ్యాచిలర్ లైఫ్ ముగిసిపోతోందంటే ...నాకంటే నా తోటి హీరోలు చాలా ఆనందపడుతున్నారు. నాని 'దా దా' అంటున్నాడు. రానా, వరుణ్ తేజ్ కూడా కామెట్ చేస్తున్నారు. నాకైతే ఇప్పటికే పెళ్లి చాలా ఆలస్యం అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతున్నది అని నితిన్ అన్నారు.

   భీష్మ సినిమా గురించి

  భీష్మ సినిమా గురించి

  ఇక భీష్మ సినిమా గురించి చెబుతూ.. శ్రీనివాస కల్యాణం మూవీ చేసేటప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ కథ చెప్పారు. వెంకీ చెప్పినటప్పుడే నాకు బాగా నచ్చింది. ఆ స్టోరి లైన్‌ను పూర్తిగా తయారు చేయడానికి ఏడాది సమయం తీసుకొన్నాడు. గతేదాడి నా మూడు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈసారి స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే మొదలు పెడదామని అనుకున్నాను అని నితిన్ తెలిపారు.

  రాబోయే ప్రాజెక్టు ఇవే..

  రాబోయే ప్రాజెక్టు ఇవే..

  ఇక ఇదే సమయంలోనే 'రంగ్ దే' స్క్రిప్ట్, చంద్రశేఖర్ ఏలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలుపెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన 'పవర్ పేట' స్క్రిప్ట్, హిందీ సినిమా 'అంధాధున్' రీమేక్ కూడా ఓకే చేశాను. ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి అని అన్నారు.

  English summary
  Tollywood Hero Nithiin is getting with ready with Bheeshma which is directed by Venki Kudumula.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X