నాపై లేనిపోని పుకార్లు.. ఎవరు చేస్తున్నారో వాళ్ల భరతం పడుతా.. రాజశేఖర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ పిక్చర్స్' వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 28న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తో ఇంటర్వ్యూ...

ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే

ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే

నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్... అన్ని బాగున్నాయని అంటున్నారు. మరోసారి పోలీస్ యూనిఫాం వేసుకోన్నాను. అందుకోసం డైటింగ్ చేయడం, వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టాను. ఇన్‌ష‌ర్ట్‌ చేసుకుంటే పొట్ట కనిపించకూడదు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ కావడంతో కాస్త ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. మా కష్టానికి ప్రతిఫలం లభించింది. కల్కి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడనేది నా ఫీలింగ్.

 డామినేట్ చేశానా?.. అండర్ ప్లే చేశానా అనేది

డామినేట్ చేశానా?.. అండర్ ప్లే చేశానా అనేది

క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే... ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు. 'సార్... ఇప్పుడే రెండోసారి సినిమా చూసాం మళ్లీ వెళుతున్నాం‌', సార్... ‌ ఫ్యామిలీతో కలిసి మళ్లీ సినిమాకి వెళ్తున్నాం' అని ఫోనులు చేస్తుంటే... నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది.

ఏం సెప్తిరి ఏం సెప్తిరి' అనే డైలాగ్ గురించి

ఏం సెప్తిరి ఏం సెప్తిరి' అనే డైలాగ్ గురించి

కల్కి సినిమాలో రెండుసార్లు 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. 'ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే' అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. 'ఇది మీ డైలాగే కదా!' అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రశాంత్ శర్మ.. భలే రాశారే అని

ప్రశాంత్ శర్మ.. భలే రాశారే అని

సినిమాలో రెండుసార్లు 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. 'ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే' అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. 'ఇది మీ డైలాగే కదా!' అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం

రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం

స్క్రీన్‌ప్లేలో అదొక స్టైల్‌. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తే రొటీన్ అవుతుందని ఇలా ప్రయత్నించాం. రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం వల్ల క్లైమాక్స్‌కు అంత పేరు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు అలా చెప్పడం వల్ల థ్రిల్ ఫీలవుతున్నారు. సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏమిటంటే చెప్పడం కష్టం. నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా.

 బాలకృష్ణతో కలిసి సినిమా

బాలకృష్ణతో కలిసి సినిమా

నేను, బాలకృష్ణగారు కలిసి సినిమా చేస్తారనే వార్త నా దృష్టికి కూడా వచ్చింది. చిరంజీవిగారు, నేను చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. ఇటీవల కాలంలో నాకు ధృవలో అరవింద్ స్వామి, అరవింద సమేతలో జగపతి బాబు లాంటి పాత్రలు నచ్చాయి అని రాజశేఖర్ అన్నారు.

విల‌న్‌ పాత్రలో చేయ‌డానికి

విల‌న్‌ పాత్రలో చేయ‌డానికి

నేను రెడీ. (నవ్వుతూ) నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు... 'ధృవ'లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. 'అరవింద సమేత వీరరాఘవ', 'శ్రీమంతుడు' చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X