twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిట్ట కథ హీరో వెనుక పెద్ద స్టోరీనే ఉందట.. బయటి వాళ్లకు తెలియని కష్టమిది.. సంజయ్ కామెంట్స్

    |

    నటుడు బ్రహ్మాజీ వారసుడు సంజయ్ రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఓ పిట్ట కథ. కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ పోస్టర్‌ను త్రివిక్రమ్‌తో రిలీజ్ చేయించి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈ మూవీకి చాలా పెద్ద స్టార్స్, డైరెక్టర్స్ చేతనైనా సాయం చేసి ప్రమోషన్స్ పెంచుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్ లాంచ్ చేయగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాబోతోన్నాడు. ఈ రేంజ్‌లో ప్రమోట్ చేస్తుండగా.. హీరో సంజయ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

    వారంతా అడిగేవారు..

    వారంతా అడిగేవారు..

    కృష్ణ వంశీ గారు.. రవితేజ గారు.. నటనలోకి రావచ్చు కదా అని అడిగేవారని తెలిపాడు. 12వ తరగతి తర్వాత వాడే నిర్ణయించుకుంటాడని నాన్న అనుకునేవారని అన్నాడు. అయితే విదేశాల్లో ఆరేళ్ల అనుభవం తర్వాత క్రియేటివ్ సైడ్ వచ్చేస్తానంటే నాన్న గారు ఓకే అన్నారని తన సినీ ప్రస్థానం గురించి వివరించసాగాడు.

    బాంబేలోనూ శిక్షణ..

    బాంబేలోనూ శిక్షణ..

    నటన.. దర్శకత్వం డీవోపీ ఏదీ అనుకోలేదని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాల్లోకి వస్తానని అనగానే బాంబే పంపించారని తెలిపాడు. మనోజ్ బాజ్ పాయ్.. ఆషిశ్ గాంధీ వంటి ప్రముఖుల్ని ట్రైన్ చేసిన శిక్షకుడి వద్దనే నటన నేర్చుకున్నానని పేర్కొన్నాడు. ఏడాదిన్నర శిక్షణ తర్వాత తెలుగు పరిశ్రమ ప్రభావం శైలి ఉండాలని దేవదాస్ కనకాల వద్ద 6నెలల కోర్స్ చేశానని తెలిపాడు.

    బయటి వాళ్లకు తెలియని కష్టమిది..

    బయటి వాళ్లకు తెలియని కష్టమిది..

    బ్యాక్ గ్రౌండ్ ఉంటే అన్నీ ఈజీ అనుకుంటారని. కానీ అది అలా కుదరదని అన్నాడు. అలా అనుకోవడం తక్కువ ఆలోచన అని చెప్పుకొచ్చాడు. ప్లస్ 2 నుంచి సాయి ధరమ్ తేజ్ పరిచయమని, తను చాలా కష్టపడ్డాడడని తెలిపాడు. అంత సులువేమీ కాదు ఇక్కడ అని.. తనకు కూడా అనుభవం అయ్యిందని అన్నాడు. నాలుగేళ్లు ఈ సినిమా కోసం వేచి చూశానని, బయటవాళ్లకు తెలీని కష్టమిదని పేర్కొన్నాడు.

    గ్రాండ్ ఈవెంట్..

    గ్రాండ్ ఈవెంట్..

    మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగబోతోంది. చిరు రాకతో ఈ మూవీపై అంచనాలు అమాంతం రెట్టింపు అవుతాయి. భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్ నిర్మించగా... విశ్వంత్ దుద్దుంపూడి నిత్యాశెట్టి ముఖ్య పాత్రలను పోషించారు.

    English summary
    Hero Sanjay In o pitta katha Promotions. He Says That Background Is Not Enough To eneter Into Movie Indusrty. These Struggles are Nevee Known. This Movie Is Going To release On 6th March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X