twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా అభిమాని మరణంతో విషాదం... ప్రాణాంతక వ్యాధి గురించి.. హీరో సప్తగిరి ఆవేదన

    |

    Recommended Video

    Sapatagiri Emotional Words About His Fan | Vajra Kavachadhara Govinda | Filmibeat Telugu

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి కమెడియన్ హీరో సప్తగిరి సిద్ధమయ్యారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా సప్తగిరి నటించిన వజ్రకవచధర గోవిందా చిత్రం మే 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రెస్‌మీట్‌లో హీరో సప్తగిరి, నిర్మాతలు నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి, దర్శకుడు అరుణ్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన అభిమాని మరణం గురించి చెబుతూ సప్తగిరి ఎమోషనల్ అయ్యారు. అసలేం జరిగిందంటే...

    సామాజిక సందేశంతో మూడో సినిమా

    సామాజిక సందేశంతో మూడో సినిమా

    నా సినిమాలు కామెడీతోపాటు ప్రేక్షకుడు ఆలోచించే విధంగా సామాజిక అంశం ఉంటుంది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాల మాదిరిగానే వజ్ర కవచధర గోవింద చిత్రంలో సోషల్ ఎలిమింట్‌ను తీసుకొంటున్నాం. క్యాన్సర్ వ్యాధి వల్ల మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎలా చితికిపోతున్నారనే విషయాన్ని చెబుతున్నాం అని అన్నారు.

    నా అభిమాని మరణంతో

    నా అభిమాని మరణంతో

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్ నుంచి నాకు అభిమానులు పెరిగారు. ఇటీవల నా అభిమానికి జరిగిన విషాదం నన్ను కలిచివేసింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ జర్నలిస్టు కుమార్తెకు చికిత్సలో భాగంగా చేతిని తీసివేశారు. ఆ క్రమంలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించింది నా అభిమాని. నా అభిమాని కుటుంబాన్ని ఇటీవల స్వయంగా వెళ్లి పరామర్శించాను.

     క్యాన్సర్ వ్యాధితో చిన్నాభిన్నం

    క్యాన్సర్ వ్యాధితో చిన్నాభిన్నం

    క్యాన్సర్ ఎంత భయంకరమైన వ్యాధితో నాకు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. టైఫాయిడ్, ఇతర వ్యాధులు వస్తే చిన్నమొత్తం ఖర్చు అవుతుంది. కానీ ఓ సారి క్యాన్సర్ వస్తే వారి పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది. ప్రతీ మండలానికి ఓ క్యాన్సర్ హాస్పిటల్ కట్టిస్తే తప్పా ప్రజలు బతికే పరిస్థితి కనిపించడం లేదు. ఆ విషయాన్ని నా వజ్రకవచధర గోవింద చిత్రంలో చర్చించాం అని సప్తగిరి అన్నారు.

     నా పేరు అలా మారిందని

    నా పేరు అలా మారిందని

    నా సినిమా పేర్లు గోవింద నామ స్మరణతోనే ముడిపడి ఉండటం భగవంతుడి అనుగ్రహం మాత్రమే. నా అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. కానీ ఓ స్వామి... నన్ను సప్తగిరి అంటూ సంబంధించి పక్కకు జరుగమని అనడంతో ఆ పేరును నేను పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ తర్వాత వెంకట ప్రభు ప్రసాద్.. సప్తగిరి జీవితానికి చాలా తేడా కనిపించింది. నేను మధ్య తరగతి నుంచి వచ్చాను. ఆర్థికంగా పైకి ఎదిగాను అని సప్తగిరి తెలిపారు.

    మే 17న వజ్రకవచధర గోవిందా రిలీజ్

    మే 17న వజ్రకవచధర గోవిందా రిలీజ్

    ఇండస్ట్రీలో నాకు ఎలాంటి అండలేకున్నా ప్రేక్షకలు బలంతోనే హీరోగా మూడో సినిమా చేస్తున్నాను. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్సాన్‌తోనే ముందుకెళ్తున్నాను. వజ్రకవచ ధర గోవింద చిత్రం మే 17న రిలీజ్ అవుతుంది. గత రెండు చిత్రాల మాదిరిగానే హీరోగా నా మూడో సినిమా ఆకట్టుకుంటుంది అని సప్తగిరి ధీమా వ్యక్తం చేశారు.

    English summary
    Saptagiri's latest movie Vajra Kavachadhara Govinda. Vaibhavi joshi is the lead heroine in this movie. Produced bY Narendra Edala, GVN Reddy. Directed by Arun Pawar. Music by Bulganian. This movie set to release in May. In this occassion, Sapatagiri speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X