సురేఖ ఆంటీ కాంప్లిమెంట్‌ మరిచిపోలేనిది.. చిరంజీవిని చూసే అలా.. శర్వానంద్

Recommended Video

Sharwanand About Surekha Konidela Compliments || Filmibeat Telugu

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవ్వడం పక్కన పెడితే.. పలు సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా విజయం పథంలో ముందుకెళ్తున్న సందర్భంలో శర్వానంద్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలో శర్వానంద్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 ఇంకా బెటర్‌గా ఆలోచించా

ఇంకా బెటర్‌గా ఆలోచించా

రణరంగం సినిమా ఫలితాన్ని బెటర్‌గా అంచనా వేశాం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఒకేగా ఉంది. యావరేజ్‌ను మించిన టాక్ వస్తున్నది. కానీ చూసిన వాళ్లందరూ బాగుందని అంటున్నారు. టాక్‌కు సంబంధం లేకుండా కలెక్షన్లు ఉండటం సంతోషంగా ఉంది. రివ్యూలు కూడా కనికరం చూపిస్తే ఇంకా బెటర్‌గా ఉండేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది అని శర్వానంద్ అన్నారు.

రూటు మార్చి సినిమా చేశా

రూటు మార్చి సినిమా చేశా

తొలుత రణరంగం సినిమా కథను రవితేజ కోసం దర్శకుడు సుధీర్ వర్మ రాసుకొన్నారు. అయితే నాకు ఫ్యామిలీ, కామెడీ సినిమాలు ఎక్కువై పోతున్నాయనే ఫీలింగ్‌తో కొంత రూట్ మార్చి ఈ సినిమా చేశాను. బేసిక్‌గా నాకు స్క్రీన్ ప్లే నచ్చి ఈ సినిమాను చేయాలనే ఫీలింగ్ కలిగింది. రెండు రకాల వేరియేషన్స్ ఉండటం నన్ను మరింత ఆకర్షించింది. యాక్టర్‌గా నేను చాలా హ్యాపీ. చూసిన వాళ్లందరూ అప్రిసియేట్ చేస్తున్నారు అని శర్వానంద్ తెలిపారు.

విభిన్నమైన పాత్రలతో డాన్‌గా

విభిన్నమైన పాత్రలతో డాన్‌గా

గ్యాంగ్‌స్టర్ సినిమా చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు. ప్రధానంగా జోనర్ మార్చి చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమా చేశాం. అంతకంటే మరో విషయం లేదు. నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించాలనే ఏకైక కారణంతోనే రణరంగం సినిమా చేశాను. నాకు వచ్చిన ప్రశంసల్లో సురేఖా ఆంటీ (మెగాస్టార్ చిరంజీవి సతీమణి) చాలా అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చింది. నాకు యంగ్‌గా ఉన్న పాత్ర అంటే ఇష్టం అని శర్వానంద్ పేర్కొన్నారు.

చిరంజీవిని అనుకరించా

చిరంజీవిని అనుకరించా

గ్యాంగ్‌స్టర్ పాత్ర కోసం ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోలేదు. ఎవరి నుంచి ప్రేరణ పొందలేదు. కాకపోతే 80వ దశకంలో చేసిన నేపథ్యం కోసం చిరంజీవిని అనుకరించాలని అనిపించింది. అప్పట్లో వచ్చిన అల్లుడా మజాకా, ఘరానా మొగుడు సినిమాల్లోని చిరంజీవి బాడీ లాగ్వేంజ్‌ను పట్టుకొనే ప్రయత్నం చేశాను. నా ఫెర్ఫార్మెన్స్‌కు మంచి పేరు వచ్చింది. కానీ కథపరంగా నిరాశ పడ్డారనే మాట వినిపిస్తున్నది.

 సందేశం ఇవ్వాలని చేయలే

సందేశం ఇవ్వాలని చేయలే

రణరంగం సినిమా కథ ద్వారా సందేశం ఇవ్వాలని మేము సినిమా చేయలేదు. ఓ డిఫరెంట్ సినిమా, స్టైలిష్ పరంగా కొత్తగా చేయాలనే లక్ష్యంతో రణరంగం సినిమాను చేశాం. అయితే ఫలితం విషయంలో ఎక్కడ దెబ్బ పడిందనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. హింస ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎక్కడా ఇబ్బంది అనిపించదు అని శర్వానంద్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X