బోల్డ్ సీన్లలో సహజంగా నటించాం.. సిగ్గు లేకుండా అలా కనెక్ట్ అయ్యాం.. డర్టీ హరి హీరో శ్రవణ్ రెడ్డి

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు తన అభిరుచికి భిన్నంగా, యూత్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం డర్టీ హరి. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే డర్టీ హరి టాలీవుడ్‌లో ఓ రకమైన ఆసక్తిని రేపింది. బోల్డు కంటెంట్‌తో రిలీజైన టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మరింత జోష్ పెంచారు. ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్‌కు అనుకూలంగా లేని కారణంగా డర్టీ హరి ఫ్రైడే మూవీస్ అనే యాప్ ద్వారా డిసెంబర్ 18వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా హీరో శ్రవణ్ రెడ్డి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, ప్రొఫెషన్ విషయాలతోపాటు సినిమా గురించి చెప్పారు. శ్రవణ్ రెడ్డి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా..

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా..

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకొన్నాను. 13 ఏళ్ల నుంచి ముంబైలో ఉంటున్నాను. హిందీలో జీ, స్టార్, మ్యాక్స్ ప్లేయర్‌లో కొన్ని షోలు చేశాను. హిందీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. ఎఫ్‌టీఐఐలో యాక్టింగ్ కోర్సు చేశాను. 2019లో థింకిస్థాన్ అనే షో చేసినప్పుడు నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు చూశాడు. అప్పుడు నేను తెలుగు అబ్బాయిని అని తెలియదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా గురించి చదివిన తర్వాత నాలో హరిని చూసి డర్టీ హరి సినిమా ఆఫర్ ఇచ్చాడు అని శ్రవణ్ రెడ్డి తెలిపారు.

ఎంఎస్ రాజు తీసిన సినిమాలు చూసి..

ఎంఎస్ రాజు తీసిన సినిమాలు చూసి..

ఎంఎస్ రాజు తీసిన సినిమాలు చూసి పెరిగాను. వర్షం, నువ్వొస్తానంటే వద్దొంటానా, ఒక్కడు లాంటి సినిమాలు తీసిన ఆయన ప్రస్తుత జనరేషన్‌కు తగినట్టు ఓ యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో కథ నాకు చెప్పినప్పుడు థ్రిల్‌గా ఫీలయ్యాను. ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్ ఉమెన్ సెంటిమెంట్ ఉంది. అలాంటి కథకు నేను చాలా కనెక్ట్ అయ్యాను అని శ్రవణ్ రెడ్డి తెలిపారు.

ఈ చిత్రంలో బోల్డ్ అనేది చాలా చిన్న విషయం

ఈ చిత్రంలో బోల్డ్ అనేది చాలా చిన్న విషయం

బోల్డ్ కంటెంట్ అనేది కేవలం ఓ చిన్నది. కానీ కథలో ఉండే ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. మార్కెటింగ్ స్ట్రాటేజీలో భాగంగా ఈ సినిమాను అలా ప్రమోట్ చేస్తున్నాం. హీరో అంటే రాముడిలానే కాకుండా, రావణుడిలాగా కాకుండా మధ్యలో ఒక్క పాయింట్ వద్ద హరి పాత్ర ఉంటుంది అని డర్టీ హరి హీరో శ్రవణ్ రెడ్డి పేర్కొన్నారు.

 తెలియని కోణం, బయటకు కనిపించని..

తెలియని కోణం, బయటకు కనిపించని..

ప్రతీ ఒక్కరిలో కూడా ఒక తెలియని కోణం ఉంటుంది. బయటకు కనిపించని ఆలోచనలు ఉంటాయి. అలాంటి వాటిని హరి పాత్రలో చూస్తాం. ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా దర్శకులు ఎంఎస్ రాజు తెరపైన గొప్ప ఎమోషన్స్‌తో తెరకెక్కించారు. డర్టీ హరి సినిమా చూస్తే.. మీకు ఎలాంటి బూతు, బోల్డ్ కంటెంట్ మీకు కనిపించదు. హరి క్యారెక్టర్‌ 40 ఏళ్లలోపు ఆడియెన్స్‌ డెఫినెట్‌గా కనెక్ట్ అవుతారు. మీకు బోల్డ్ కంటెంట్ అసభ్యంగా అనిపించదు అని శ్రవణ్ రెడ్డి తెలిపారు.

Recommended Video

Dirty Hari OTT Release On December 18
బోల్డ్ సీన్లలో నటించేటప్పుడు...

బోల్డ్ సీన్లలో నటించేటప్పుడు...

డర్టీ హరి సినిమా కథలో ఉండే బోల్డ్ సీన్లలో నటించేటప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. సినిమా షూటింగ్ మూడు వంతులు పూర్తైన తర్వాత హీరోయిన్లతో కెమిస్ట్రీ, వారితో బెరుకుతనం తగ్గిన తర్వాత బోల్డ్ సీన్లు షూట్ చేశారు. క్యారెక్టర్లను అర్ధం చేసుకొన్న తర్వాత బోల్డ్ సీన్లను షూట్ చేయడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చాలా సహజంగా నటించాం. ఎలాంటి బెరుకు కనపించలేదు అంటూ శ్రవణ్ రెడ్డి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X