SS Rajamouli, నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్లే అలాంటి పరిస్థితి..ప్లస్సా? మైనాసా? అంటే..శ్రీ సింహా (ఇంటర్వ్యూ)

పెళ్లిచూపులు నిర్మాత యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల సంయుక్తంగా అర్జున్ దాస్యన్ సహకారంతో ప్రణిత్ బ్రహ్మండపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం భాగ్ సాలే. యువ హీరో శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. క్రైమ్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ చిత్రం జూలై 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా హీరో శ్రీ సింహా కోడూరి మీడియాతో మాట్లాడుతూ..

తెలుగు సినిమా అభిమానులకు మంచి అనుభూతిని అందించే క్రైమ్ కామెడీ చిత్రం భాగ్ సాలే. ఈ చిత్రంలో టాలెంటెడ్ నటులు, సాంకేతిక నిపుణుల పనితనం అత్యంత బలమని చెప్పగలను ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి రెస్సాన్స్ రావడంత చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఎలాంటి సందేశాలు లేవు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందించి నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా చేశాం అని శ్రీ సింహా కోడూరి చెప్పారు.

Hero Sri Simha interview about Bhaag Saale movie, SS Rajamouli, Kala Bhairava, Yash Rangineni

దర్శకుడు ప్రణీత్ బ్రహ్మండపల్లి చాలా కాలం క్రితం కథ చెప్పారు. నాకు వేరే కమిట్‌మెంట్స్ ఉండటం వల్ల సినిమా లేటు అయింది. ఉస్తాద్, దొంగలున్నారు జాగ్రత్త సినిమాల బిజీతో ఈ సినిమాను లేటుగా మొదలుపెట్టాం. ఉస్తాద్, ఈ సినిమా కథను కరోనా సమయంలో విన్నాను. ఈ రెండు సినిమాలు కూడా నెల గ్యాప్‌లో రిలీజ్ అవుతున్నాయి. భాగ్ సాలే సినిమాను దర్శకుడు అద్బుతంగా రూపొందించాడు అని శ్రీ సింహా చెప్పారు.

దర్శకుడు ప్రణీత్ కథ చెప్పినప్పుడే నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కథ విన్న తర్వాత వెంటనే ఈ సినిమా చేస్తానని మాటిచ్చా. నాకు కొత్త కాన్సెప్టులు, విభిన్నమైన కథలు చేయాలనే కోరిక ఉంది. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే సినిమా భాగ్ సాలే అవుతుంది అని శ్రీ సింహా చెప్పారు.

భాగ్ సాలే సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు. మా బ్రదర్‌తో పనిచేయాలని లేదు. కానీ దర్శకుడే కాలభైరవను సెలెక్ట్ చేసుకొన్నాడు. ఈ సినిమాను ముందుగా కాలబైరవ సెలెక్ట్ చేసుకొన్నాడు. ఆ తర్వాతే నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌గా ఉంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని శ్రీ సింహా చెప్పారు.

Hero Sri Simha interview about Bhaag Saale movie, SS Rajamouli, Kala Bhairava, Yash Rangineni

నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విసయానికి వస్తే.. ఒకవైపు ప్లస్.. మరోవైపు మైనస్. అలాగే నాకు కొంత గుర్తింపును ఇచ్చే అంశం. సాంకేతిక అంశాలు, కథలు, సినిమా గురించిన విషయాలు నా కుటుంబ వల్ల తెలియడం నాకు నటుడిగా సపోర్టుగా ఉంటాయి. కథల ఎంపికలో నాకు ఏదైనా అనుమానం వస్తే రాజమౌళి సలహాలు తీసుకొంటాను. కానీ ఏ సినిమా చేయాలనేది నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. భాగ్ సాలే టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుందని మెచ్చుకొన్నారు అని శ్రీ సింహా చెప్పారు.

దేశానికి ఆస్కార్ అందించిన ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయాలన్నది నా కోరిక. అందరి మాదిరిగానే నేను ఆ కోరికతో ఎదురు చూస్తున్నాను. రాజమౌళి సినిమాలో చిన్న రోల్ లభించినా చాలా హ్యాపీగా ఫీలవుతుంటాను. నాకు బంధుత్వం ఉందని ఛాన్స్ అడుగను. నేను నటుడిగా ప్రూవ్ చేసుకోవలి. ఆ తర్వాత ఆయన సినిమాలు చేయడానికి ఇష్టపడుతాను అని శ్రీ సింహా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X