సక్సెస్‌లు లేవు కాబట్టే.. ఇలాంటి సినిమాలు చేస్తున్నా.. శ్రీకాంత్

అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పించు టి. అలివేలు నిర్మించిన కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆపరేషన్ 2019. శ్రీకాంత్, మంచుమనోజ్ నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ హాజరయ్యారు.

ఆపరేషన్ 2019 గురించి

ఆపరేషన్ 2019 గురించి

పాత్రికేయుల సమావేశలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...ఈ కథ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ప్రత్యేకించి ఏ పార్టీని బేస్ చేసుకుని కాదు. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజల్లో ఎవేర్నెస్ పెంచడం కోసం చేసిన మూవీ. ఒక సామాన్య వ్యక్తి పొలిటీషియన్ అయితే అతను ఎద్దుర్కొనే పరిణామాలు ఎలా ఉంటాయి. ఏ విధంగా ప్రజలు అటు పొలిటీషిన్స్ చేసే పొరపాట్ల గురించి ఉంటుంది కథ. ఇందులో నేను పక్కా పొలిటీషియన్ క్యారెక్టర్లో కనిపిస్తాను అని పేర్కొన్నారు.

ఎలక్షన్స్ కాబట్టి ప్లాన్

ఎలక్షన్స్ కాబట్టి ప్లాన్

ప్రస్తుతం ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ ప్లాన్ చేశాము. అటు పొలిటికల్ లీడర్స్ని, ఇటు ప్రజల్ని ఇద్దర్నీ టార్గెట్ చేసి చేసిన మూవీ ఇది. ప్రత్యేకించి ఇది ఏ పార్టపార్టీకి సంబంధం ఉండదు. కాని కొన్ని కొన్ని సీన్స్ మాత్రం కనెక్ట్ అవుతుంది. గతంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన మూవీకి దీనికి సీక్వెల్ కాదు కాని కొన్ని సీన్సు అలా అనిపిస్తాయి అని శ్రీకాంత్ వెల్లడించారు.

ఆ సినిమా ఆగిపోవడంతో

ఆ సినిమా ఆగిపోవడంతో

గతంలో బాబ్జి దర్శకత్వంలో నేను మెంటల్ అనే చిత్రం చేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఈ చిత్రం ఆపరేషన్ 2019తో మీ ముందుకు వస్తున్నాం. బాబ్లికి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. సినిమా అంటే చాలా ప్యాషన్. ప్రొడ్యూసర్ కూడా చాలా మంచివారు సినిమాకి ఏం కావాలన్నా అన్నీ సమకూర్చారు అని శ్రీకాంత్ తెలిపారు.

ఇతర భాషల్లో నటిస్తున్నా

ఇతర భాషల్లో నటిస్తున్నా

ఇటీవల కన్నడలో ఒక సినిమా చేశాను. అందులో నెగిటివ్ క్యారెక్టర్లో చేశాను. అక్కడ ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. మలయాళంలో కూడా ఒక సినిమా చేశాను. తెలుగులో మార్షల్ అనే ఒక చిత్రం చేస్తున్నాను షూటింగ్ అవుతుంది. ఆ చిత్రానికి జయరాజ్గారు దర్శకత్వం వహిస్తున్నారు.

మంచు మనోజ్‌తో కలిసి

మంచు మనోజ్‌తో కలిసి

ఆపరేషన్ 2019 చిత్రంలో మంచు మనోజ్ కూడా నటించారు. మనోజ్ చాలా డెడికేటెడ్ పర్సన్. మా బాబు యాక్టింగ్ కోర్స్ అయిపోయింది. వచ్చే ఏడాదిలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. మంచి కథలను బట్టి ముందడుగు వేస్తాను. ఇంకా ఎవరు లాంచ్ చెయ్యాలి ఏంటి అని ప్రత్యేకించి ఏమీ అనుకోలేదు అని చెప్పారు.

ఎన్నారై పొలిటిషన్‌గా

ఎన్నారై పొలిటిషన్‌గా

ఆపరేషన్ 2019 సినిమాకి ఓపెన్సింగ్స్ రాగలిగితే ఆడియన్స్ ఆదరిస్తారు. ఆపరేషన్ దుర్యోధన అలానే అయింది ఓపెనింగ్స్ బావుండడంతో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ చిత్రంలోని డైలాగ్స్ చాలా నార్మ్గా ఉంటాయి నేచరల్ పొలిటీషన్ డైలాగ్స్ లాగానే ఉంటాయి. షూటింగ్ మొత్తం అమెరికాలో చేశాం. ఎన్ ఆర్ ఐ పొలిటీషియన్గా మారితే ఎలా అన్నది అంటే అలా అని భరత్ అను నేను టైపులో ఉండదు.

కేసీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నా

కేసీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నా

ప్రస్తుతం డిఫరెంట్ స్టోరీస్ అన్నీ చేసుకుంటూ వెళుతున్నాను నేను జగపతిబాబుగారి విలన్ క్యారెక్టర్స్ చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ దేవుడు అని సినిమాలో నటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ అన్నట్లు ఆయన చిన్నప్పటి నుంచి తీసుకుని జీవిత చరిత్ర చేస్తున్నాను. ఆ చిత్రానికి హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఉద్యమానికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఉంటాయి.

మిగితా సినిమాల గురించి

మిగితా సినిమాల గురించి

కోతల రాయుడు అన్న చిత్రం కూడా చేస్తున్నాను. పొలిటికల్ స్టోరీలు వస్తున్నాయి కాబట్టి సబ్జెక్ట్ నచ్చి సినిమాలు చేస్తున్నాను తప్ప నాకు ప్రత్యేకించి పాలిటిక్స్లోకి రావాలని చేయడం లేదు. నాకెరీర్ సక్సెస్‌లో ఉండి ఉంటే పక్కాగా ప్లాన్ చేసుకునేవాడిని. కాని సక్సెస్ లేనప్పుడు వచ్చినవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఒక నటుడిగా చేసుకుంటూ వెళ్ళడమే.

మా అబ్బాయిని హీరోగా పెట్టి

మా అబ్బాయిని హీరోగా పెట్టి

మా అబ్బాయి యాక్టింగ్ కోర్స్ పూర్తయింది. వచ్చే ఏడాదిలో హీరోగా పరిచయం చేద్దామని అనుకొంటున్నాను. మంచి కథలను బట్టి ముందడుగు వేస్తాను. ఇంకా ఎవరు లాంచ్ చెయ్యాలి ఏంటి అని ప్రత్యేకించి ఏమీ అనుకోలేదు. ఒకవేళ కథ నచ్చితే వివరాలను మీడియాకు ప్రకటిస్తా అని శ్రీకాంత్ చెప్పారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఆపరేషన్ 2019 చిత్రంలో సునీల్, యజ్ఞశెట్టి, దీక్షాపంత్, హరిత, సలోని, సుమన్, కోటాశ్రీనివాసరావు, నెక్కంటి వంశీ, వినీత్కుమార్, పోసానికృష్ణమురళి, జీవ, రామరాజు, శివకృష్ణ, రామ్జగన్, సమీర్ నవీన్, ఆర్.పి(జబర్దస్త్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ః ర్యాప్రాక్ షకీల, ప్రొడ్యూసర్ః టి.అలివేలు, రైటర్మరియు డైరెక్టర్ః కరణం బాబ్జీ, డి.ఓ.పి.వెంకట్ప్రసాద్, ఎడిటర్ఃఎస్.బి. ఉద్ధవ్,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X