Thalapathy Vijay సెట్లో ఎలా ఉంటారంటే? యాటిట్యూడ్, బిహేవియర్‌పై శ్రీకాంత్ కామెంట్స్

నా కెరీర్‌లో 100కుపైగా సినిమాలు, చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం ఇదే తొలిసారి. అలాగే శంకర్ గారి సినిమాలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఫిలిం మేకింగ్ లో చాలా పెర్ఫెక్షన్ వుంటుంది. ఎక్కడా రాజీపడకుండా తీస్తారు అని శ్రీకాంత్ తెలిపారు.

వారసుడు (వారిసు) సినిమాకు తమన్ స్పెషల్ ఎట్రాక్షన్. రంజితమే పాట, ఇంకా కొన్ని పాటలు వైరల్ అయ్యాయి. శింబు పాడిన పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రిరికార్డింగ్ అద్భుతంగా చేశాడు అని శ్రీకాంత్ చెప్పారు.

Hero Srikanth reveals about Vijays attitude and behaviour in Dil Rajus Varisu Sets

నేను 100 సినిమాలకుపైగా నటించాను. హీరో, క్యారెక్టర్లు చేశాను. అయితే హీరో పాత్రనే చేయాలనే రూల్ పెట్టుకోలేదు. కాబట్టి నేను ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు అంగీకరిస్తారు. నాలో ఉండే హీరోను బయటకు రాకుండా కట్టడి చేశాను. ఆన్ స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా నేను హీరో అని ఫీల్ కాను. నాకు నేను అలవాటు పడ్డాను. కాబట్టే హీరో, క్యారెక్టర్ అనేది తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాను అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

బాలకృష్ణతో అఖండ మూవీ తర్వాత డిఫరెంట్‌గా ఉండాలని వారసుడు చిత్రంలో పాత్ర చేశాను. అలాగే శంకర్, రాంచరణ్ సినిమా చేస్తున్నాను. అందులో మరో డిఫరెంట్ క్యారెక్టర్. విభిన్నమైన క్యారెక్టర్ చేయాలనే ఆలోచన ఉంది. కథ, క్యారెక్టర్ నచ్చితే ఏ భాషలోనైనా ఖచ్చితంగా చేస్తాను అని శ్రీకాంత్ ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.

తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో నాకు పరిచయం ఉంది. ఒకట్రెండు సార్లు ఫంక్షన్లలో కలిశాను. వారసుడు సెట్లో మా మధ్య చాలా సంభాషణ జరిగింది. ఆయన సెట్లో చాలా సైలెంట్‌గా ఉంటాడు. కార్ వ్యాన్ ఉపయోగించడు. సెట్లో మొబైల్ ఫోన్ వాడరు. ఎప్పుడూ సెట్లోనే కూర్చుని ఉంటాడు. హార్డ్ వర్క్, డెడికేషన్ ఎక్కువ. ఆయన ఎప్పుడూ సెట్లో ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను.

వారసుడు సినిమా విషయానికి వస్తే ఆయనకు బ్రదర్‌గా నటిస్తున్నాను. మా మధ్య చాలా సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి. అన్నాదమ్ముల మధ్య సన్నివేశాలు, గొడవలు ఫీల్‌గుడ్‌ సన్నివేశాలు ఉంటాయి. పాటలు, ఫైట్స్‌లో క్యారెక్టర్ పరంగా ఉంటాం. కానీ మేము యాక్షన్ సీన్లలో యాక్టివ్‌గా ఉండను అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X