నాగచైతన్య కోసం నన్ను తొక్కేశారు.. హీరో శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్
ఒకరికొకరం, రోజాపూలు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులో సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన శ్రీరామ్ (శ్రీకాంత్) తాజాగా పిండం సినిమాలో ఎమోషనల్ పాత్రతో ముందుకొస్తున్నారు. హారర్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మల్టీ స్టారర్ సినిమాల గురించి ఆయన మాట్లాడుతూ..
మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాలని నాకు ఉంటుంది. కానీ సినిమా స్టార్ట్ అయ్యే ముందు చెప్పేది ఒకటి.. సినిమా చేసిన తర్వాత వారు చేసే ఒకటి ఉంటుంది. నాగచైతన్యతో దడ సినిమా చేసేటప్పుడు ఇద్దరు అన్నాదమ్ములు కథ అని చెప్పారు. ఆ సినిమాకు సపోర్టివ్‌గా ఉండాలని అడిగారు. ఆ సినిమా కోసం నేను థాయ్‌లాండ్‌లో 2.3 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ చేశాను. ఆ ఫైట్‌ను మూడు కెమెరాలతో షూట్ చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ సందర్భంగా కాలు విరిగి 8 నెలలు నేను బెడ్ రెస్ట్ తీసుకొన్నాను అని శ్రీరాం అన్నారు.

అయితే సినిమా రిలీజ్ తర్వాత తీరా చూస్తే.. ఆ ఫైట్ సీక్వెన్స్ తీసేశారు. చాలా రిస్క్ చేసి ఫైట్ చేస్తే తీసేశారు. ఆ ఫైట్ ఎందుకు తీశారో దర్శకుడు అజయ్ బోయానే మీరు అడగండి. ఒక సినిమా చేసేటప్పుడు మేము బానిసలం. చెప్పిన దానికి ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకొని దానికి కట్టుబడి ఉంటాం. దాని తర్వాత దర్శకులు, నిర్మాతలకు వదిలేస్తాం. అలాంటి నమ్మకంతోనే నేను సినిమా చేస్తాం అని శ్రీరామ్ అన్నారు.
సినిమా పరిశ్రమలో అందరూ శంకర్ లాంటి దర్శకులు ఉండరు. నేను రోజాపూలు మల్టీస్టారర్. సినిమా చేసేటప్పుడు అప్పటికే జై, ఆకాశ్ నాకు సీనియర్స్. నా కంటే ఎక్కువ సినిమాలు చేసి ఉన్నారు. ఆ సినిమా కథలోని పాత్రలకు ఆ డైరెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే సినిమా బాగా వచ్చింది అని శ్రీరామ్ అన్నారు.
3 ఇడియెట్ మూవీని తీసుకొంటే.. రాజ్ కుమార్ హిరానీ రాసిన కథ చూడండి.. అందులో అమీర్ ఖాన్, షర్మాన్ జోషి, మాధవన్ ఉంటారు. అందులో ఇద్దరు హీరోల కంటే మాధవన్‌కు ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఆ సినిమా తమిళంలో తీస్తే.. విజయ్ కంటే నాకు ఎక్కువ డైలాగ్స్ పెట్టారు అని చెప్పారు.

కానీ దడ సినిమాలో నాకు అన్యాయం జరిగింది. ఆ సినిమాలో యాక్షన్ సీన్‌ను ఉదయం నుంచి 1.30 వరకు 28 టేక్స్ చేశాను. అందులో 6 టేక్స్ 40 అడుగుల ఎత్తులో 6వ ఫ్లోర్ నుంచి ఒక భవనం నుంచి మరో భవనంలోకి దూకుతున్నాను. కింద వెహికిల్స్ వెళ్తున్నాయి. జారిపడితే నేను నుజ్జు నుజ్జు అవ్వడం ఖాయం. ఎలాంటి బెడ్స్, వైర్స్ లేకుండా రిస్క్ చేశాను. తీరా చూస్తే ఆ ఫైట్‌ను తీసేశారు అని శ్రీరామ్ ఆవేదన చెందారు.
ఇలా చాలా మల్టీ స్టారర్ సినిమాల్లో నా రోల్‌ను కట్ చేసి పడేశారు. ముందు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటుంది. అందుకే నేను మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నాను. మంచి సినిమాలు వస్తే.. సింగిల్ హీరో సినిమాలే ఎంచుకొంటున్నాను. ఇది నా కంప్లయింట్ కాదు. నేను కష్టపడితే ఆ సీన్లు లేకుండా చేస్తే వచ్చే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఇన్నాళ్లు నేను ఒపిక పట్టాను. టైమ్ వచ్చిందని దడ సినిమా గురించి చెబుతున్నాను అని శ్రీరామ్ తెలిపారు. ఓక హీరో కోసం మరో హీరో క్యారెక్టర్‌ను కట్ చేయడం సరికాదు అని డైరెక్టర్ అజయ్ బోయాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











