twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధోని కూడా ఫాంలో లేడు... అయితేంటి? ఆమె నా రాఖీ సిస్టర్.. NGK గురించి సూర్య (ఇంటర్వ్యూ)

    |

    'గజిని', 'యముడు', 'సింగం' లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మించిన చిత్రం 'ఎన్‌.జి.కె (నంద గోపాల కృష్ణ)'. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో 'ఏమైంది ఈవేళ', అధినేత, 'బెంగాల్‌ టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31 న ప్రపంచవ్యాప్తంగా విడదలవుతున్న సందర్భంగా హీరో సూర్య ఇంటర్వ్యూ..

    యువ తర్వాత పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో

    యువ తర్వాత పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో

    'యువ' అనేది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో పాటు అన్నీ ఇంగ్రీడియంట్స్‌ ఉంటాయి. కానీ ఇప్పుడు 'ఎన్‌జికె' మనం అందరం ఇప్పటివరకూ చూసిన పొలిటికల్‌ సినిమాలకు విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు పొలిటికల్‌ సినారియోను పూర్తిగా ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. ఈ సినిమా ద్వారా శ్రీరాఘవ పొలిటికల్‌ సినిమాల్లో ఒక డిఫరెంట్‌ లేయర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.

     ఎన్‌జికె మూవీ ఎలా ఉంటుందంటే

    ఎన్‌జికె మూవీ ఎలా ఉంటుందంటే

    ఎలాంటి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఒక సాధారణ వ్యక్తి తనకు తెలియకుండానే అతన్ని పొలిటికల్‌ సిస్టమ్‌లోకి కొన్ని శక్తులు లాగితే.. ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఎలాంటి మంచి జరిగింది? అనేది కథాంశం. ఇది గ్రాస్‌ రూట్‌ పొలిటికల్‌ ఫిల్మ్‌. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక జెన్యూన్‌ పర్సన్‌ ఈ సమాజాన్ని ఎలా మార్చాడు అనే అంశం మీదే సినిమా ఉంటుంది. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో మేము ఏ రాజకీయపార్టీ కి విమర్శించలేదు.

    శ్రీరాఘవతో కాంబినేషన్‌ కోసం

    శ్రీరాఘవతో కాంబినేషన్‌ కోసం

    ఆడియన్స్‌తో పాటు నేను కూడా 2001 నుండి ఆయన డైరెక్షన్‌లో వర్క్‌ చేయడానికి వెయిట్‌ చేస్తున్నాను. ఒక శ్రీరాఘవ ఫ్యాన్‌గా ఆయన సినిమాలో నటించడానికి నాకు 19 సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్‌ డ్రీమ్‌ వారియర్స్‌ కూడా విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. వారితో కలిసి వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీ.

    శ్రీరాఘవగారితో వర్క్‌ చేయడం గురించి

    శ్రీరాఘవగారితో వర్క్‌ చేయడం గురించి

    ఎన్‌జీకే సినిమా కథ రాయడానికి శ్రీరాఘవగారికి సంవత్సరంన్నర కాలం పట్టింది. ఆయన ఒక్కరే కూర్చుని ఈ కథను రాసుకున్నారు. స్క్రీన్‌ప్లే కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకున్నారు. ప్రతి సీన్‌ని ఆయన ఎలా విజువలైజ్‌ చేయాలనుకుంటున్నారో మనకి ముందే తెలిసేలా చేస్తారు. ఆయన మంచి నటుడు కాబట్టే ఇప్పటివరకూ మనకి అన్ని యూనిక్‌ ఫిలింస్‌ ఇవ్వగలిగారు.

    దర్శకుడు సెల్వరాఘవన్ ఫాంలో లేడు కదా?

    దర్శకుడు సెల్వరాఘవన్ ఫాంలో లేడు కదా?

    ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్కరూ అలాంటి ఫేజ్‌ను ఫేస్‌ చేస్తూనే వస్తారు. ధోని కూడా ఒక సందర్భంలో ఫేస్‌ చేశారు. కొంతమంది పీపుల్‌ వెరీ యూనిక్‌గా ఉంటారు. వారిని ఇంకొకరితో రీప్లేస్‌ చెయ్యలేం. శ్రీ రాఘవ లాంటి టాలెంటెడ్‌ ఫిల్మ్‌ మేకర్‌. ఇంతవరకూ ఏ దర్శకుడు కూడా ఆయనలాంటి సినిమా చేయలేదు. యాక్టింగ్‌ తెలియని వారితో కూడా యాక్టింగ్‌ చేయించగలరు. ఆయన సాంగ్స్‌ సీక్వెన్స్‌ కూడా రెగ్యులర్‌ ఫార్మాట్లో ఉండదు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఒక డిఫరెంట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్‌కి ఇవ్వడానికి తానెప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు.

     తమిళ రాజకీయాలకి సంబంధం ఉందా

    తమిళ రాజకీయాలకి సంబంధం ఉందా

    ఇది ఏ రీజన్‌ బేస్డ్‌ ఫిల్మ్‌ కాదు అలాగని ఏ లొకాలిటీ తో సంభందం లేదు. ఇది జనరల్‌ పాలిటిక్స్‌కి సంబంధించిన అంశం మాత్రమే. ఇక నేను శూర‌రై పోట్రు అనే బయోపిక్‌లో నటిస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా బయోపిక్‌లా ఉండదు. కొంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోవడం జరిగింది. కానీ మేం ఎవ్వరి బయోపిక్‌ అయితే తీస్తున్నామో, వారి పట్ల పూర్తి గౌరవంగా ఉన్నాం. కానీ.. ఆడియన్స్‌కి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడం కోసం అలా చేశాం. సుధ చాలాకాలంగా నా రాఖీ సిస్టర్‌. మేమిద్దరం 'యువ' మూవీ దగ్గర నుండి చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. తను చెప్పిన స్క్రిప్ట్‌ నాకు నచ్చింది. అలాగే తను కూడా ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు చాలా పేషెన్స్‌గా వెయిట్‌ చేసి ఈ స్క్రిప్ట్ రాసింది. ఈ సినిమాను మా యూనిట్ అందరూ చాలా ఎంజాయ్‌ చేస్తూ చేస్తున్నాం.

    నిర్మాత రాధామోహన్‌ గురించి

    నిర్మాత రాధామోహన్‌ గురించి

    రాధామోహన్‌గారి కన్విక్షన్‌ చాలా గొప్పది. ఆయన ఇంతవరకు సినిమాని చూడకుండా తెలుగులో రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారు. అందులోనూ హోల్‌ హార్టెడ్‌గా మా సినిమాకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. మా అందరి సపోర్ట్‌ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది.

    English summary
    Hero Singam Suriya who earns a unique image with different kind of films like Ghajini, Yamudu, Singam is coming with a political thriller 'NGK' (Nandha Gopala Krishna) '7G Brundavana Colony', 'Aadavari Matalaku Ardhale Verule' fame Sri Raghava has Directed the film Produced by Dream Warrior Pictures and Reliance Entertainment. Popular Producer KK Radhamohan who produced Superhit films like 'Emaindi Ee Vela', 'Adhinetha', 'Bengal Tiger' in his Sri SathyaSai Arts banner is releasing 'NGK' in Telangana, Andhra Pradesh states. 'NGK' is releasing worldwide on May 31st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X