Bhola Shankar నేను కారులో నుంచి దిగుతుంటే.. మెగాస్టార్ చిరంజీవి డోర్ తీయగానే.. సుశాంత్ ఎమోషనల్ ఇంటర్వ్యూ

మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా తదితరులు నటించిన భోళా శంకర్ మూవీ విడుదలకు ముస్తాబవుతున్నది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యువ హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ పక్కన ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకొన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సుశాంత్ మీడియాతో మాట్లాడుతూ...

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయనకు అభిమానులుగా మారిపోయాను. ఆయన చేసే డ్యాన్సులంటే పిచ్చి. ఆయన పాటలకు డ్యాన్సులను ప్రాక్టీస్ చేసే వాడిని. ఆయన సాంగ్ షూటింగుకు వెళ్లి చాలా సార్లు చూశాను. ఆయనతో కలిసి సినిమాల్లో నటించాలని ఆలోచనే చాలా ఉత్సాహాన్ని, కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి ఫీలింగ్‌తో ఉన్న నాకు డైరెక్టర్ మెహర్ రమేష్ ఫోన్ చేసి భోళా శంకర్ మూవీలో ఆఫర్ గురించి చెప్పడంతో చాలా హ్యపీగా ఫీలయ్యాను అని సుశాంత్ అన్నారు.

Hero Sushanth Anumolu

భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం రావడం అదృష్టంగా భావించాను. ఆయనతో కలిసి పాటలకు స్టెప్పులేసే ఛాన్స్ ఎంత మందికి దక్కుతుంది. ఈ సినిమాలో ఆఫర్ గురించి చెప్పగానే.. చిరంజీవితో కలిపి నాతో స్టెప్పులేయించాలని మెహర్ రమేష్ నుంచి మాట తీసుకొన్నాను. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం గొప్ప అనుభూతి అని సుశాంత్ చెప్పారు.

భోళా శంకర్ సినిమాలో నాది గెస్ట్ రోల్. నా రోల్ సినిమాలో కీలకంగా ఉంటుంది. చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియాతో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. హీరోగా నా మొదటి సినిమాలో తమన్నా హీరోయిన్. భోళా శంకర్ మూవీలో నేను, తమన్నా మాత్రం అక్కా, తమ్ముళ్లుగా నటించాం. చిరంజీవి, కీర్తి సురేష్‌తో సన్నివేశాల్లో నటించినప్పుడు చెప్పలేని అనుభూతి కలిగింది అని సుశాంత్ తెలిపారు.

చిరంజీవి మెగాస్టార్ అయినప్పటికీ ఆయన తోటి నటీనటులకు కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఓ సీన్‌లో ఆయన ట్యాక్సీ డ్రైవర్.. నేను కారులో నుంచి దిగుతుంటే.. ఆయన కారు డోర్ తీయాలి. ఆయన డోర్ తీస్తుంటే నాకు గిల్టీగా అనిపించింది. దాంతో నేనే కారు డోర్ తీసుకొని వస్తుంటే.. ఆయన వారించారు. నేనే కారు డోర్ తీయాలి.. లేకపోతే మీ క్యారెక్టర్‌కు ఉండే రెస్పెక్ట్ పోతుందని చిరంజీవి గారు చెప్పగానే.. ఆయన మెగాస్టార్ ఎందుకయ్యాడో నాకు అర్ధమైంది. ఆ వెంటనే సీన్ షూట్ సందర్భంగా నేను పూర్తిగా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లాను అని సుశాంత్ చెప్పారు.

వేదాళం సినిమాను ఇప్పటి వరకు చూడలేదు. మెహర్ రమేష్ ఆఫర్ చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమాలో నా రోల్ పెంచామని, నా పాత్రకు చాలా మార్పులు చేశామని చెప్పడంతో ఎక్సైట్ అయ్యాను. నా పాత్రను చాలా మంచిగా డిజైన్ చేశారు. కొన్ని సీన్లు చాలా హై ఎనర్జీని ఇస్తాయి. నా లుక్, నా క్యారెక్టర్‌ను బాగా చూపించారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని సుశాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X