‘‘ నా కెరీర్ నాశనానికి కారణం అదే ’’

తరుణ్, ఉదయ్ కిరణ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు వరుణ్ సందేశ్. కర్లీ హెయిర్, హస్కీ వాయిస్, అందమైన చిరునవ్వుతో చూడటానికి పక్కింటి కుర్రాడిలా కనిపించే వరుణ్.. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించారు. వరుస హిట్లతో యూత్‌లో వరుణ్ సందేశ్ క్రేజ్ పెరిగిపోయింది.. ఇతను స్టార్ హీరో అవ్వడం పక్కా అని అంతా భావించారు. కానీ తర్వాతి రోజుల్లో వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొత్తగా ఛాన్స్ ఇచ్చే వారు లేక.. ఒకానొక దశలో వరుణ్ సందేశ్ అనే హీరో ఉంటాడనే విషయాన్ని కూడా తెలుగు జనం మరిచిపోయారు కూడా.

అయితే రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించారు వరుణ్ సందేశ్. తన భార్య వితికా షేరుతో కలిసి అద్భుతంగా పార్టిసిపేట్ చేశాడు. దాదాపు 105 రోజుల పాటు హౌస్‌లోనే గడిపి టైటిల్ రేసులో నిలిచాడు. అయినప్పటికీ ఆయనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో వరుణ్ ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన చిత్రం 'నింద'. వాస్తవ ఘటనల ఆధారంగా రాజేశ్ జగన్నాథం ఈ మూవీని తెరకెక్కించారు. ఈ శుక్రవారం నింద ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.

hero Varun Sandesh made sensational comments on his script selection and downfall

ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గన్న వరుణ్ సందేశ్..మీడియా అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ.. తానింకా పాత మనిషినేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్ డౌన్‌ఫాల్ అవ్వడానికి కారణమేంటీ అని యాంకర్ అడగ్గా.. దానికి వరుణ్ సందేశ్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. హ్యాపీడేస్ రిలీజైనప్పుడు తనకు 18 సంవత్సరాలని, ఆ ఏజ్‌లో కథల ఎంపిక, స్క్రిప్ట్ వర్క్ అంటే ఏంటో కూడా తనకు తెలియదన్నారు.

కొందరు సన్నిహితులు, ఫ్రెండ్స్ గైడెన్స్ తీసుకుని ముందడుగు వేశానని అందుకే హిట్స్ వచ్చాయని వరుణ్ తెలిపారు. వచ్చిన కథల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకునే అగ్రిమెంట్ చేసుకునేవాడినని.. ఇండస్ట్రీలో స్క్రిప్ట్‌లు చక్కర్లు కొడుతూ ఉంటుందని, తన వద్దకు వచ్చే సరికి ఆల్రెడీ కొంతమంది విని ఉంటారని ఆయన అన్నారు. కొందరు రిజెక్ట్ చేశాకా.. వరుణ్ అయితే ఈ కథకు సూట్ అవుతారని తన వద్దకు వచ్చేవాళ్లని, వాటిలోనే మంచివి ఎంచుకుని సినిమాలు చేసేవాడినని వరుణ్ సందేశ్ చెప్పారు.

hero Varun Sandesh made sensational comments on his script selection and downfall

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా , నేను హ్యాపీగానే ఉన్నానని.. ఒక మూవీ ఎందుకు ఆడలేదు అనడానికి బోల్డెన్నీ రీజన్స్ ఉంటాయన్నారు. హ్యాపీహ్యాపీగా సినిమా ఎంతోమందికి ఇష్టమని, కానీ ఆ సమయంలో ఆ మూవీ ఆడలేదన్నారు. హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం హిట్లు కావడంతో తన తదుపరి సినిమాలపై భారీ అంచనాలున్నాయని.. ఆ మైండ్ సెట్‌తో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఆ స్థాయిలో ఎక్కలేదని వరుణ్ సందేశ్ చెప్పారు.

కాలం మరో పదేళ్లు వెనక్కి వెళితే.. స్క్రిప్ట్ , ఇతర విషయాల్లో మరింత కేర్ తీసుకునేవాడినని సరదాగా అన్నారు. అన్నింటిలోకి ఆ సమయంలో మొహమాట పడకుండా ఉండాల్సిందని, స్క్రిప్ట్, క్యాస్టింగ్ విషయంలో ముందు ఒక మాట చెప్పి.. తర్వాత మార్చేసినా పర్లేదులే అనేవాడినని వరుణ్ సందేశ్ అన్నారు. అయ్యో పాపం అని ఎవరి విషయంలోనూ అనుకోకూడదని.. మన గురించి మనం ఆలోచించాలని ఈ జర్నీలో బాగా తెలిసొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. సో.. మొత్తం మీద వరుణ్ సందేశ్‌కి జీవితం బాగానే గుణపాఠం నేర్పిందని ఆయన మాటలను బట్టి చెప్పొచ్చు. ఇకనైనా జాగ్రత్తగా కథలను ఎంచుకుని ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X