twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నీచుడి నుంచి అమలాపాల్‌ను అలా కాపాడాం.. శ్రీరెడ్డి, మీటూపై విశాల్.. లవర్‌ను ఇరికించిన వరలక్ష్మీ!

    |

    Recommended Video

    Hero Vishal Press Meet విశాల్‌ ప్రెస్ మీట్

    తమిళ చిత్ర పరిశ్రమను ప్రస్తుతం మీటూ ఉద్యమం కుదిపేస్తున్నది. కోలీవుడ్‌ను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై విశాల్ స్పందించారు. తమిళ నిర్మాతల మండలి సెక్రెటరీగా సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులను కట్టడి చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీరెడ్డి విషయం నుంచి శృతిహరిహరన్ వరకు చేసిన ఆరోపణలపై, శ్రీరెడ్డి వ్యవహారంపై, పందెంకోడి2 సినిమా గురించి విశాల్ పలు విషయాలు వెల్లడించారు. అవేమిటంటే..

    పందెంకోడి2 విజయంపై

    పందెంకోడి2 విజయంపై

    ఏ సినిమానైనా విజయం సాధించాలంటే బీ, సీ సెంటర్లలో బలంగా ఆడాలి. డిటెక్టివ్, అభిమన్యుడు విషయాలకు వస్తే ఆ రెండు సినిమాలు ఏ, బీ సెంటర్లలో బాగా ఆడాయి. కానీ సీ సెంటర్లలో ఆ రెండు సినిమాలు ఆడలేదు. కానీ పందెంకోడి2 సినిమా బీ, సీ సెంటర్లలో బాగా ఆడింది. అందుకే నా సినిమా 60 కోట్ల కలెక్షన్లు సాధించాయి. నా సినిమా గతంలో కేవలం 30 కోట్లు మాత్రమే వసూలు చేశాయి.

    పందెంకోడి కోసం విశాల్‌ తల్లి

    పందెంకోడి కోసం విశాల్‌ తల్లి

    నా తల్లి స్వస్థలం పాలకొల్లుకు సమీపంలోని ఆచంట గ్రామం. ఎప్పుడైనా నా సినిమా రిలీజ్ అయితే నా తల్లి ఆచంట థియేటర్‌కు ఫోన్ చేసి సినిమా ఎలా ఆడుతుందని తెలుసుకొంటుంది. ఎన్ని వారాలు ఆడుతుందని కనుక్కుటుంది. నా తల్లి ఎన్నడూ మల్టీప్లెక్స్‌లకు ఫోన్ చేసి ఎన్నడూ సినిమా ఎలా ఉందని అడుగదు. ఆచంట థియేటర్‌కు ఫోన్ చేసి నా తల్లి తెలుసుకొన్నది. అప్పు నా సినిమా బాగా ఆడుతుందనే విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

    టెంపర్‌ సినిమాలో మీ టూ

    టెంపర్‌ సినిమాలో మీ టూ

    అన్ని సినిమా రంగాలను మీటూ ఉద్యమం కుదిపేస్తున్నది. లైంగిక దాడుల నేపథ్యంగా టెంపర్ సినిమా కథ సాగుతుంది. తెలుగులో టెంపర్‌కు, తమిళంలో టెంపర్‌కు చాలా మార్పులు చేశాం. లైంగిక దాడికి గురైన ఓ యువతి కథను బలంగా చూపించబోతున్నాం. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుంది.

    మీటూ అంశంపై విశాల్

    మీటూ అంశంపై విశాల్

    తమిళంలో శ్రీరెడ్డి తర్వాత చిన్మయి సినీ రచయితపై ఆరోపణలు రావడం జరిగింది. సినీ పరిశ్రమలో లైంగిక ఆరోపణలపై మహిళలతో కూడిన కమిటి వేశాం. బాధితులను, కొత్త నటీనటుల సమస్యలను పరిష్కరిస్తాం. వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. మహిళా నటుల మనోభావాలను గౌరవించేలా చర్యలు తీసుకొంటాం.

     అమలపాల్‌ను అలా రక్షించాం

    అమలపాల్‌ను అలా రక్షించాం

    గతంలో అమలాపాల్ విషయంలో తగిన న్యాయం జరిగింది. లైంగిక దాడిని గుర్తించిన ఆమె నాకు ఫోన్ చేసింది. వెంటనే నేను కార్తీకి ఫోన్ చేశాను. అమలాపాల్‌ను వేధించిన వ్యక్తిని పట్టుకొని ప్రమాదం జరుగకుండా స్పందించాం. ఏదైనా కచ్చితమైన సమాచారం లభిస్తే తప్ప సహాయం చేయలేను అని విశాల్ పేర్కొన్నారు.

    వీ టూ అంటూ హీరోయిన్ వరలక్ష్మీ

    వీ టూ అంటూ హీరోయిన్ వరలక్ష్మీ

    నేను తమిళంలో నేను సైతం అనే టెలివిజన్ షో చేస్తున్నాను. ఆ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా చితికిపోయిన వారికి సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ షోలో తాజాగా హీరోయిన్, విశాల్ ప్రేయసి వరలక్ష్మీ పాల్గొన్నారు. వరలక్ష్మీని ఓ ప్రేక్షకుడు.. అమ్మాయిలకు మీటూ ఉంది. అబ్బాయిలకు అన్యాయం జరిగితే ఏలాంటి సహాయం అందిస్తారు అని ప్రశ్న అడుగగా.. మగవాళ్లకు వీ టూ ఉంది. అదే విశాల్ వారికి న్యాయం చేస్తారని చెప్పిందనే విషయాన్ని విశాల్ పేర్కొన్నారు.

    English summary
    Actor Vishal starrer 'Ayogya', remake of Tollywood superstar Jr NTR’s 2015 blockbuster film ‘Temper’, had its shooting commenced this morning in Chennai. Raashi Khanna is playing the female lead role in the film. The first leg of shooting will be held in ECR Chennai with a huge set work erected.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X