మిర్చి, అత్తారింటికి రిజెక్ట్ చేశా.. అందుకే టెంపర్ చేస్తున్నా.. జూ.ఎన్టీఆర్ నటిస్తే.. విశాల్

Recommended Video

Hero Vishal Press Meet విశాల్‌ ప్రెస్ మీట్

నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త విశాల్ నటించిన తాజా చిత్రం పందెంకోడి2. 13 ఏళ్ల క్రితం విడుదలైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తుండగా విశాల్ మీడియాతో సంతృప్తిని వ్యక్తం చేశారు. తన సినిమా సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా టెంపర్ రీమేక్ గురించి, పందెంకోడి2 సీక్వెల్ గురించి పలు విషయాలు వెల్లడించారు. విశాల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

పందెంకోడి2 ఫలితంతో

పందెంకోడి2 ఫలితంతో

పందెంకోడి2 రిజల్ట్ విషయంలో నాకు చాలా సంతృప్తి లభించింది. సీక్వెల్ అంటే.. లేదా పార్ట్2 అంటే చాలా కష్టంగా ఉంటుంది. కథ దొరకాలి. అంచనాలు మించాలి లాంటి అంశాలు సక్సెస్‌కు ఛాలెంజ్‌గా నిలుస్తాయి. కానీ పందెంకోడి2 విషయంలో అంతా సవ్యంగా సాగిపోయింది.

బీ, సీ సెంటర్లలో కూడా

బీ, సీ సెంటర్లలో కూడా

పందెంకోడి సినిమాతో రూరల్ ఆడియెన్స్‌కు చేరువయ్యా. బీ, సీ సెంటర్లలోను, రూరల్ మార్కెట్‌లో నాకు ప్లేస్ లభించింది. పందెంకోడి2 విషయంలో అదే జరిగింది. నాకు మళ్లీ బీ, సీ సెంటర్లలో మంచి విజయం లభించింది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా బాగా ఆడుతున్నది. దీపావళికి కూడా ఈ సినిమా కలెక్షన్లు, థియేటర్లు పెరిగే అవకాశం ఉంది.

అందుకే పందెంకోడి3 తీస్తున్నాం

అందుకే పందెంకోడి3 తీస్తున్నాం

పందెంకోడి2 అందించిన విజయంతో పందెంకోడి3 మూవీని రూపొందించే పనిలో పడ్డాం. లింగుస్వామికి మంచి ఐడియా తట్టింది. పార్ట్3 కోసం మరో 13 ఏళ్లు ఆగే కూడదనే విషయాన్ని లింగుస్వామి చెప్పాడు. దాంతో పందెంకోడి3 సినిమాకు సిద్ధమయ్యాం.

అభిమన్యుడు2 అంటే ఇష్టం

అభిమన్యుడు2 అంటే ఇష్టం

పందెంకోడి2 తర్వాత డిటెక్టివ్2, అభిమన్యుడు2, పందెంకోడి3 సినిమాలు చేయాలని అనుకొంటున్నాం. డిటెక్టివ్2 సినిమా షూట్ అంతా ఫారిన్‌లో జరుగుతుంది. ఓ పరాయి దేశంలో కేసును ఎలా పరిష్కారించారనే కథాంశంతో రూపొందుతున్నది. నాకు వ్యక్తిగతం బాగా నచ్చేది అభిమన్యుడు2 సినిమా.

టెంపర్ నాకు తొలి రీమేక్ చిత్రం

టెంపర్ నాకు తొలి రీమేక్ చిత్రం

టెంపర్ సినిమా నాకు తొలి రీమేక్ చిత్రం. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. నటన విషయంలో తారక్‌ను మించి చేయలేను. తారక్ సినిమా చేశారంటే 12 ఏళ్లు గుర్తుంటుంది. టెంపర్ సినిమా తెలుగులో రీలీజ్ చేయం. ఎందుకంటే సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు జూనియర్ ఎన్టీఆర్‌తో నన్ను పోల్చి చూస్తాడు. అది నాకు నచ్చదు అని విశాల్ పేర్కొన్నారు.

అత్తారింటికి దారేది, మిర్చి రిజెక్ట్ చేశా

అత్తారింటికి దారేది, మిర్చి రిజెక్ట్ చేశా

టెంపర్‌కు ముందు తెలుగులో విజయం సాధించిన చాలా చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అందులో మిర్చి, అత్తారింటికి దారేది సినిమాల్లో నటించమని కోరారు. కానీ తెలుగులో మార్కెట్ ఉండదనే ఓకే ఒక బిజినెస్ కారణంతో ఆ సినిమాలు చేయలేదు. కానీ టెంపర్‌లో ఉండే ఓ సామాజిక కారణం బాగా నచ్చి ఆ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X