Anjali: నా పెళ్లికి తొందరేమీ లేదు.. మ్యారేజ్ రూమర్లపై అంజలి క్లారిటీ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ రావడం మూవీపై అంచనాలు పెంచింది. మే 31వ తేదీన రిలీజ్‌కు సిద్దమైన ఈ చిత్రం ప్రమోషనల్‌లో భాగంగా అంజలి మాట్లాడుతూ..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో చేసిన పాత్రను ఇప్పటి వరకు నా కెరీర్‌లో చేయలేదు. ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ కూడా మొదటిసారి. షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పేటప్పుడు అసలు సినిమాలో ఉంచుతారా? అనే అనుమానం కలిగేది. సెట్స్‌లో, డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను పాత్ర పరంగా కొత్త అనుభూతిని పొందాను. పాత్రను దర్శకుడు మలిచిన తీరు బాగుంటుంది అని అంజలి అన్నారు.

ఈ సినిమాలోని రత్నమాల క్యారెక్టర్, కథను గురించి చెప్పినప్పుడు.. ఈ రోల్‌కు నన్నే ఎందుకు ఎంపిక చేయాలని అనుకొన్నారు అనే ప్రశ్నను కృష్ణ చైతన్యకు వేశాను. అందుకు నాకు అద్బుతంగా నటించే యాక్టర్ కావాలి. అంుదకే మీ దగ్గరకు వచ్చాను. మీరు మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఆయనకు నాపై ఉన్న నమ్మకాన్ని పక్కన పెడితే.. ఓ మంచి పాత్రను చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది అని అన్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో క్యారెక్టర్ల మధ్య రిలేషన్ చాలా స్వీట్‌గా ఉంటుంది. విశ్వక్ సేన్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన క్యారెక్టర్ పేరు రత్నాకర్, నా పేరు రత్నమాల. ఇద్దరిని రత్న అని పిలుస్తారు. నా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రగా నా పాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రత్న, రత్నమాల రెండు పాత్రలు పోటీ పడినట్టు ఉంటాయి.విశ్వక్ సేన్ ఎంత లౌడ్‌గా మాట్లాడుతారో.. అంతకంటే గట్టిగా నా క్యారెక్టర్ మాట్లడుతుంది. అన్ని పాత్రలు బలంగా ఉంటాయి. ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ కాదు. ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నాను. నేను ప్రధాన పాత్ర పోషించిన చిత్రమని బలంగా చెబతుాను అని అంజలి అన్నారు.

నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. నా పెళ్లిపై కొంతకాలంగా వస్తున్న న్యూస్ అన్నీ పుకార్లే. నేను పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుుడు తప్పుకుండా మీకు అఫీషియల్‌గా చెబుతాను. అప్పటి వరకు ఎలాంటి వార్త వచ్చినా గాసిప్‌గానే భావించండి అని అంజలి చెప్పిది.


Click it and Unblock the Notifications











