Happy Ending గూగుల్ నన్ను హీరోయిన్ చేసింది.. ఆ కుర్ర హీరోలంటే ఇష్టం.. అపూర్వ రావ్

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల జోరు కొనసాగుతున్నది. ఒకప్పుడు ఉత్తరాది భామలతో కళకళలాడే చిత్ర పరిశ్రమ.. ప్రస్తుతం అచ్చ తెలుగు అమ్మాయిల ప్రతిభ అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ కానున్నది హ్యాపీ ఎండింగ్ సినిమాతో అపూర్వ రావ్ తెలుగు సినిమాకు పరిచయం కానున్నది. హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. యువ హీరో యష్ పూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కౌశిక్ భీమిడి దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి వివరాలు అందిస్తూ..

మా సొంతూరు ఒంగోలు. మా నాన్న ఉద్యోగ రీత్యా గుజరాత్‌లో పనిచేయడం వల్ల నేను అక్కడే పుట్టాను. నా బాల్యం గుజరాత్‌లో, అనంతరం కువైట్‌లో సాగింది. ఇండియాకు తిరిగి వచ్చి బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత కొన్ని జాబ్స్ చేసిన తర్వాత నా డెస్టినేషన్ వేరే ఉందని భావించాను అని అపూర్వరావ్ చెప్పారు.

Heroine Apoorva Rao reveals facts about Happy Ending movie and Sai Pallavi

క్రియేటివ్ ఫీల్డ్‌లోకి రావాలని ఓ రోజు గూగుల్ సర్చ్ చేస్తే.. డైరెక్షన్, యాక్టింగ్ లాంటి అంశాలు సజెస్ట్ చేసింది. దాంతో గూగుల్‌ సలహాతో యాక్టింగ్ రంగాన్ని ఎంచుకొన్నాను. దాదా సాహెబ్ ఫాల్కే ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకొన్నాను. చాలా ఆడిషన్స్ తర్వాత నాకు హ్యాపీ ఎండింగ్ అవకాశం వచ్చింది అని అపూర్వ రావ్ తెలిపారు.

Heroine Apoorva Rao reveals facts about Happy Ending movie and Sai Pallavi

హ్యాపీ ఎండింగ్ సినిమాలో హీరోకు ఓ శాపం ఉంటుంది. తన జీవితంలో చేయాలనుకొన్న పనులు చేయలేకపోతాడు. ఆయనకు నా అవసరం ఏర్పడుతుంది. తన జీవితంలో హీరో సమస్యలను ఎదుర్కొన్నాడు. నేను ఎలాంటి సహాయం చేశాను అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో నేను యోగా టీచర్‌గా నటిస్తున్నాను. చాలా ఫన్, ఎలిమెంట్స్ ఉంటాయి అని అపూర్వ రావు అన్నారు.

హ్యాపీ ఎండింగ్ టైటిల్‌లో డబుల్ మీనింగ్ అంశాలు ఉన్నా.. ఈ సినిమా పక్కాగా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. రోజువారి జీవితంలో ఒత్తిడికి ఫీలయ్యే వారు ఈ మూవీ చేస్తే కూల్, చిల్ అవుతారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, వికీ డోనర్ లాంటి సినిమా. హీరో యష్ పూరి బాగా ఫెర్ఫార్మ్ చేశారు. చాలా కమిట్‌మెంట్ ఉన్న హీరో. ఈ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు అని అన్నారు.

Heroine Apoorva Rao reveals facts about Happy Ending movie and Sai Pallavi

నాకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఉంది. సాయిపల్లవి అంటే నాకు చాలా ఇష్టం. నాకు డ్యాన్స్ చేయడం వచ్చు. పాటలు పాడటం కూడా వచ్చు. రానా దగ్గుబాటి, నవీన్ పొలిశెట్టి, అడివి శేష్ లాంటి హీరోలతో నటించాలని ఉంది అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X