Deepika Padukone: భర్తతోకంటే అతడితో రొమాన్స్ చేయడమే ఇష్టమట, అందరిముందు ఒప్పుకున్న దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు, భార్యాభర్తలు అయిన దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కెరియర్ పరంగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఓ వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే వీరిద్దరూ సెపరేట్ గా ఇంటర్య్వూలు ఇవ్వడం మన చాలా సార్లే చూశాం. కానీ వీరిద్దరూ కలిసి ఒకేసారి ఇంటర్వ్యూ ఇవ్వడం మాత్రం చాలా అరుదు. తొలిసారిగా వీరిద్దరూ కలిసి కాఫీ విత్ కరణ్ సీజన్ 8 షోకు వచ్చారు. ఇక్కడ తెగ సందడి చేశారు.
బాలీవుడ్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్.. హోస్టుగా చేస్తున్న షో కాఫీ విత్ కరణ్. ఎంతో మంది టాప్ సెలబ్రిటీలను తీసుకొచ్చి, స్పెషల్ ఇంటర్వూలు తీసుకునే ఈయనకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కేవలం బాలీవుడ్ కు చెందిన వారినే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేశాడు కరణ్ జోహార్. తాజాగా ఎనిమిదో సీజన్ ప్రారంభం అయింది. ఈ ఎనిమిదో సీజన్ లో మొదటి ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోహీరోయిన్లు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ లు వచ్చారు.

ఈ షోలో.. దీపికా చాలా హాట్ కామెంట్లు చేసింది. కేవలం ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుందీ జంట. అయితే తాము పెళ్లికి ముందే సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాతే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు వివరించారు. ఇక ఈ షోలో కరమ్ జోహాన్ ను రణ్ వీర్ సింగ్.. హాయ్ టర్కీ అంకుల్ అని పిలిచాడు. ఇందుకు దీపికా పదుకొణె చాలా గట్టిగా నవ్వింది. కరణ్ కూడా నవ్వుకున్నాడు.

షోలో భాగంగానే కరణ్ జోహార్.. దీపికను పలు షాకింగ్ ప్రశ్నలు అడిగాడు. అందుకు ఆమె కూడా చాలా కాజ్యువల్ గా సమాధానాలు చెప్పింది. ముఖ్యంగా భర్తతో కాకుండా బాలీవుడ్ వెండితెరపై ఎవరితో బెస్ట్ కెమిస్ట్రీ కుదురుతుంది మీకని అడగ్గా.. దీపికా పదుకొణె కాస్త కూడా తడుముకోకుండా.. హృతిక్ రోషన్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పింది. అందుకు రణ్‌వీర్ సింగ్ కూడా వాహ్ అంటూ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ చాలా బాగుంది. తనముందే భార్య.. వేరొకరితో రొమాన్స్ బాగుంటుందని చెప్పినా రణ్‌వీర్ ఫీల్ అవ్వకపోవడం, ముఖ్యంగా చాలా స్పోర్టివ్ గా తీసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది.
కాఫీ విత్ కరణ్ షోలో గతంలో దీపికా, రణ్‌వీర్ లు సెపరేట్ గా పాల్గొన్నారు. ముఖ్యంగా రణ్‌వీర్, అలియా భట్ తో రాగా, దీపికా పదుకొణె ఇతర నటులతో కలిసి పాల్గొంది. కానీ వీరిద్దరూ కలిసి తొలిసారిగా ఈ షోలో పాల్గొనడంతో అంతా ఆసక్తిగా ఈ షో చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నే ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో అందుబాటులో ఉంది. కావాలంటే మీరు కూడా వెళ్లి ఓ ఎపిసోడ్ ను పూర్తిగా చూడొచ్చు.



Click it and Unblock the Notifications











