Rama Baanam కిలాడీ ఎఫెక్ట్‌తో డైరెక్టర్ నన్ను రిజెక్ట్ చేశారు.. తర్వాత ఏం జరిగిందంటే?డింపుల్ హయతి (ఇంటర్వ్యూ)
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాతలు విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల రూపొందిస్తున్న చిత్రం రామబాణం. దర్శకుడు శ్రీవాసు రూపొందించిన ఈ చిత్రంలో మాచో స్టార్ గోపిచంద్, డింపుల్ హయతి జంటగా నటించారు. ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇలాంటి పాజిటివ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం మే 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
రామబాణం ఆఫర్ ఎలా వచ్చిందంటే?: కిలాడీ సినిమా రిలీజైన తర్వాత రామబాణం అవకాశం వచ్చింది. కిలాడీ మూవీలో నేను ఫుల్ గ్లామర్ పాత్రలో కనిపించాను. దాంతో రామబాణం సినిమాలోని పాత్ర భైరవి మాదిరిగా కనిపించడం లేదు. ఆ పాత్రకు సరిపోదనే అభిప్రాయంతో దర్శకుడు శ్రీవాసు ఉన్నారు. దాంతో మరోసారి ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ చేయమని అడిగాను. దాంతో రెండుసార్లు స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత మా ఫీలింగ్ తప్పు. భైరవి పాత్రకు మీరు సరిపోతారని చెప్పడంతో రామబాణం సినిమాలోకి వచ్చాను అని డింపుల్ హయతి చెప్పారు.

యూట్యూబర్ భైరవిగా: ఖిలాడీలో నేను రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రను చేశాను. ఒకటి లంగా ఓణి వేసుకొని ఒకటి, గ్లామర్ పాత్రలో మరొకటి చేశాను. దాంతో వాళ్లు జడ్జిమెంట్‌కు రాలేకపోయారు. యూట్యూబర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ పాత్రకు అర్బన్ లుక్ ఉండాలి. దాంతో కొంచెం అనుమానపడ్డారు. దాంతో స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనలైజ్ చేశారు అని డింపుల్ హయతి తెలిపారు.
డైరెక్టర్ శ్రీవాసు సపోర్టుతో :
నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. అలాంటి పరిస్థితుల్లో యూట్యూబర్ పాత్ర చేయాల్సి వచ్చింది. యాక్టర్లు సాధారణంగా రీల్స్, ఫోటోలు దాదాపు రెగ్యులర్‌గా చేస్తారు. యూట్యూబర్‌గా ఫిష్ మార్కెట్‌కు వెళ్లి ఎలా బిహేవ్ చేస్తావో అలా చేయమని డైరెక్టర్ చెప్పారు. నాకు కొత్తగా అనిపించడంతో జోష్‌తో సినిమా చేశాను. సీనియర్లతో కలిసి బ్లాగర్‌గా నటించడం కొత్త అనుభూతిని కలిగించింది అని డింపుల్ హయతి అన్నారు.

కల్తీ ఆహారం బ్యాక్ డ్రాప్‌తో: రామబాణం సినిమా కల్తీ ఆహారం అనే పాయింట్, బ్యాక్ డ్రాప్‌తో నడుస్తుంది. కథకు నేను డైరెక్ట్‌గా కనెక్షన్ లేదు. ఈ సినిమాలో హీరోతో కనెక్షన్ ఉంటుంది. ఒక ఫన్ జర్నీతో సీరియస్ సినిమాలోకి వెళ్తుంది. అంతకంటే సినిమా కథ చెప్పలేను. ఈ కార్యక్టర్ నాకు కొత్తగా ఉంది. బబ్లీ, అర్బన్ గర్ల్‌గా చేయడం ఛాలెంజింగ్ ఉంది. నా పాత్ర కోసం పెద్దగా హోంవర్క్ చేయలేదు. శ్రీవాసు చెప్పినట్టు చేసుకొంటూ వెళ్లిపోయాను అని డింపుల్ హయతి చెప్పారు.
నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ గురించి : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి డింపుల్ హయతి మాట్లాడుతూ.. కిలాడీ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ బ్యానర్‌లో రవితేజ ధమాకా సినిమా చేశారు. ఆ సమయంలో విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల లాంటి నిర్మాతలు నేను చూడలేదని చెప్పారు. ఆయన చెప్పినప్పుడు అవునా అని అన్నారు. కానీ రామబాణం సినిమా చేస్తున్నప్పుడు వారి బిహేవియర్, వారి సపోర్టు చూసి ఆశ్చర్యపోయాను. రీసెర్చ్ నుంచి డిజిటల్ ప్రమోషన్స్ వరకు అన్ని వాళ్లు చూసుకొంటారు. ఏదైనా అడిగితే క్షణాల్లో వెంటనే ఇచ్చారు. ఎవ్వరిని నొప్పించకుండా.. ఎవరిని హర్ట్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తారు. ఈ బ్యానర్‌లో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉంది అని డింపుల్ హయతి అన్నారు.
దర్శకుడు శ్రీవాసు నాటీ డైరెక్టర్ : దర్శకుడు శ్రీవాసు ఈజ్ వేరీ స్వీట్ అండ్ నాటీ డైరెక్టర్. సెట్లో చాలా అల్లరి చేస్తుంటారు. నేను ప్రతీ డైరెక్టర్ నుంచి చాలా నేర్చుకొన్నాను. డీటెయిలింగ్ విషయంలో శ్రీవాసు ఫర్‌ఫెక్షనిస్ట్. నాకు దగ్గర ఉండి చాలా నేర్పించారు. జగపతి బాబు, కుష్బూ లాంటి నటీనటులు ఫెర్ఫార్మ్ చేస్తే.. మానిటర్‌లో చూపించి యాక్టింగ్‌లో ట్రిక్స్ నేర్పించారు అని డింపుల్ హయతి తెలిపారు.


Click it and Unblock the Notifications











