Kajal Aggarwal: శ్రీలీలకు ఉన్నది నాకు లేదు.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్లు!
Kajal Aggarwal: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాబోతున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అనూహ్య స్పందన వచ్చింది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను దాటి సంచలనం రేపుతోంది. మరోవైపు సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో... సినీ బృందం ప్రమోషన్లు ప్రారంభించేసింది. అయితే తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో పాల్గొని శ్రీలీలపై అదిరిపోయే కామెంట్లు చేసింది.

అలాగే భగవంత్ కేసరి సినిమాలో తనతో పాటు పని చేసిన హీరోయిన్ శ్రీలీల గురించి కూడా కాజల్ కొన్ని విషయాలు తెలిపింది. శ్రీలీలకు చాలా పొటెన్షియల్ ఉందని.. ఆమె చాలా కష్టపడి పని చేస్తుందని పేర్కొంది. అందరితో చక్కగా ఉండడం, మర్యాద ఇవ్వడం.. ముఖ్యంగా వర్క్ విషయంలో ఫోకస్ గా ఉండడం చూస్తుంటే ఆమెకు చాలా మెచ్యూరిటీ ఉన్నట్లు అనిపిస్తుందని స్పష్టం చేసింది. శ్రీలీలకు ఏం కావాలో ఆమెకు బాగా తెలుసు అని కాజల్ అగర్వాల్ వివరించింది.
అలాగే నేటితరం హీరోయిన్లు అందరూ... శ్రీలీలగా ఉంటే చాలా బాగుంటుందని కాజల్ అగర్వాల్ తెలిపింది. ఒక్క శ్రీలేలే కాకుండా ఈ జనరేషన్ హీరోయిన్లలో చాలా మంది కూడా ఇలాగే ఉన్నారని... వారికేం కావాలో వారికి బాగా తెలుసని చెప్పింది. చాలా కష్టపడి తమ పనులు తాము చేసుకుంటూ ముందుకెళ్తున్నారని ఇది చాలా అద్భుతం అని భగవంత్ కేసరి ప్రమోషన్లలో భాగంగా కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది.

షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు తెరక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించారు. అలాగే అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఎమోషన్ బాండింగ్ తో ఈ సినిమా ఉండబోతుందని ఇటీవల రిజీల్ అయిన ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. విజయ దశమి కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











