ఆ ఫీలింగ్ ఉంటే ముద్దు పెట్టేస్తా.. గోపిచందా? మరో హీరోనా చూడను.. కావ్య థాపర్ (వీడియో)
గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంచలన విజయాలు అందించిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపిచంద్, కావ్య థాపర్ జంటగా రూపొందిన చిత్రం విశ్వమ్. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సంయుక్తంగా టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిలింబీట్ తెలుగుతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
విశ్వం సినిమాలో ఫన్, రొమాంటిక్ అంశాలకు చాలా చోటు ఉంది. స్వతహాగా నేను రొమాంటిక్ పర్సన్‌ను. అందుచేత ఈ సినిమాలో రొమాన్స్ కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదు. హీరో గొపిచంద్ చాలా సిగ్గుపడినట్టు కనిపిస్తాడు. అయినప్పటికీ రొమాంటిక్ సీన్లలో మా మధ్య కెమిస్ట్రీ బాగా పడింది. అందుకోసం మేము పెద్దగా ప్రిపరేషన్, రిహార్సల్స్ చేయలేదు అని అని కావ్య థాపర్ అన్నారు.

రొమాంటిక్ సీన్లు షూట్ చేసేటప్పుడు నా ఎదురుగా గోపిచంద్ ఉన్నాడా? మరో హీరో ఉన్నాడా? అనేది చూడను. ఆ సీన్‌కు తగిన ఫీలింగ్‌తో యాక్టింగ్ చేస్తాను. స్క్రిప్టులో ముద్దు పెట్టుకోవాలని ఉంటే.. కిస్ చేసుకొంటాను. కౌగిలించుకోవాలనుకొంటే.. హాగ్ చేసుకొంటాను అని కావ్య థాపర్ బోల్డుగా కామెంట్ చేశారు.
ఈ చిత్రంలో సమైరా అయే యువతి పాత్రను పోషిస్తున్నారు. పక్కింటి యువతిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాను. ఈ షూటింగ్‌లో ఫన్ క్రియేట్ చేశాను. ఒక దీవీలో పాటను షూట్ చేశాం. ఆ పాటను అద్బుతంగా చిత్రీకరించారు. అయితే ట్రైన్ ఎపిసోడ్‌కు ఎలాంటి కంపారిజన్ లేదు. ఆర్గానిక్‌గా వచ్చింది అని కావ్య థాపర్ అన్నారు.


Click it and Unblock the Notifications











