Pawan Kalyan పేరు చెప్పగానే.. ఆ విషయం అడగలేదు.. Bro హీరోయిన్ కేతిక శర్మ (ఇంటర్వ్యూ)
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రో 'Bro The Avatar'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కేతిక శర్మ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
వినోదయ సీతమ్ సినిమాలో హీరోయిన్ లేదా ఫీమేల్ క్యారెక్టర్లకు స్కోప్ లేదు. బ్రో సినిమా విషయానికి వస్తే.. హీరోయిన్స్ క్యారెక్టర్ల పరిధిని బాగా పెంచారు. అయితే పవన్ కల్యాణ్ గారితో నాకు కాంబినేషన్ సీన్లు లేవు. నాకు సాయిధరమ్ తేజ్‌తో మాత్రమే కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. ఈ సినిమాలో పాత్ర కోసం నా మేనేజర్‌ను మూవీ టీమ్ సంప్రదించింది. లుక్ టెస్ట్‌కు పిలిస్తే వెళ్లి వచ్చాను. ఆ తర్వాత నా రోల్‌ను కన్ఫర్మ్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ సినిమా అడగ్గానే నా పాత్ర గురించి నేను అడగలేదు. వెంటనే ఒప్పేకొన్నాను అని కేతికా శర్మ తెలిపింది.

పవన్ కల్యాణ్ గారిని ఇంతకు ముందు ఎప్పుడూ కలువలేదు. బ్రో సినిమా సెట్లో మాత్రమే కలిశాను. ఆయనను చూడగానే భయమేసింది. సాయిధరమ్ తేజ్‌ను అడిగితే పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశాడు. హాయ్ చెప్పగానే నవ్వుతూ పలకరించారు అని చెప్పింది.
బ్రో సినిమాలో మార్క్ (సాయిధరమ్ తేజ్) గర్ల్‌ఫ్రెండ్‌గా నటిస్తున్నాను. మార్క్‌తో రిలేషన్‌షిప్, పర్సనల్ బాండింగ్‌తో నా రోల్ ఉంటుంది. నాకు ఫెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న పాత్ర. రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్న సమయంలోనే ఈ సినిమా కోసం నన్ను అడిగారు. అప్పటికే వైష్ణవ్ తేజ్‌తో నటిస్తుండగానే.. సాయిధరమ్ తేజ్‌తో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపించింది అని కేతిక శర్మ తెలిపింది.
నా క్యారెక్టర్ కోసం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కలుగలేదు. సముద్రఖని గారికి ఈ రోల్ గురించి చాలా అవగాహన ఉంది. ఆయన చెప్పినట్టు నేను చేశాను. త్రివిక్రమ్ సార్ రాసిన డైలాగ్స్ చాలా రోల్‌ను ఇంప్రూవ్ చేశాయి. దాంతో నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం కనిపించలేదు. స్క్రిప్టు చాలా టైట్‌గా ఉంది. సముద్రఖని సార్ చాలా షార్ప్‌గా ఉన్నారు అని కేతిక శర్మ చెప్పింది.

బ్రో సినిమాలో నేను స్టైలిష్‌గా కనిపిస్తాను. జానవులే పాటలో లుక్ అందర్ని ఆకట్టుకొన్నది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ టాప్ డిజైనర్ నీతా లూలా నాకు స్టైలింగ్ చేశారు. ఈ సినిమాకు కోసం ఆమె పనిచేశారు. పవన్ కల్యాణ్‌కు కూడా ఆమె స్టైలింగ్ చేశారు. అందుకే జానవులే పాటలో నేను అందంగా కనిపించారు. ఆ పాటను ఆస్ట్రియాలో షూట్ చేశారు. తొలిసారి నేను పాటలో డ్యాన్స్ చేసే అవకాశం లభించింది అని కేతిక శర్మ తెలిపింది.
బ్రో మంచి సందేశాన్ని ప్రేక్షకులకు చెప్పే సినిమా. అలాంటి సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశ రావడం నిజంగా అదృష్టమే. నా కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చే సినిమా. అయితే ఈ సినిమా గురించి నేను చెప్పడానికి అనుమతి లేదు. పక్కా కమర్షియల్ సినిమా అని మాత్రం చెప్పగలను అని కేతిక శర్మ తెలిపింది.


Click it and Unblock the Notifications











