Ravanasura ట్విస్టులు, థ్రిలింగ్స్‌తో షాకింగ్‌గా రావణాసుర.. రవితేజను అలా చూసి నెర్వస్: మేఘా ఆకాష్ (ఇంటర్వ్యూ)

యువ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం రావణాసుర. మాస్ మహారాజా రవితేజ, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్, మెఘ ఆకాశ్ నటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో మేఘ ఆకాశ్ కనిపిస్తారు. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మేఘ ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ..

కథకు నా పాత్ర మరింత బలంగా: రావణాసుర సినిమా చాలా ట్విస్టులు, షాకింగ్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో సాగుతుంది. కాబట్టి నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. కాబట్టి నా క్యారెక్టర్ గురించి చెప్పలేను. సినిమా రిలీజ్ రోజు మీరు చూస్తే మీకే అర్ధం అవుతుంది. కాకపోతే నా పాత్ర చాలా కథకు బలమైన అంశంగా ఉంది. ఈ సినిమాలో నేను వర్కింగ్ గర్ల్‌గా, చాలా రిచ్‌గా, క్లాస్‌ అమ్మాయిగా నటించాను. రావణాసుర జర్నీ చాలా ఈజీగా జరిగింది. నా పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించాయి అని మేఘా ఆకాశ్ చెప్పారు.

Heroine Megha Akash Interview about Ravanasura

రవితేజను చూసి చాలా నేర్చుకొన్నా : రవితేజ లాంటి పెద్ద స్టార్. నేను రజనీకాంత్‌తో కూడా నటించాను. కానీ రవితేజ చాలా స్పెషల్ పర్సన్. ఏదైనా సీన్‌లో కష్టమైనప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి హీరోతో నటించాననే ఫీలింగ్ కలిగింది. బ్రేక్ సమయంలో రవితేజ చెప్పిన విషయాలు సెన్సిబుల్‌గా ఉన్నాయి. జీవితంలో ఎలా ఉండాలనే విషయాన్నిఆయన నుంచి నేను చాలా నేర్చుకొన్నాను. కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు ఉన్నాయి అని మేఘా ఆకాశ్ తెలిపారు.

సక్సెస్, ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా : రావణాసుర సినిమా షూటింగ్‌లో నేను చాలా నేర్చుకొన్నాను. నటనపరంగా, డైలాగ్స్ చెప్పడం పరంగా రవితేజ నాకు మంచి సహకారం అందించారు. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ.. దానిని పట్టించుకోకుండా చాలా సాధారణమైన వ్యక్తిగా బిహేవ్ చేస్తుంటారు. ఆ విషయం నాకు బాగా నచ్చింది. సక్సెస్, ఫెయిల్యూర్స్ మనుషులు మారుతారు. కానీ రవితేజలో అలాంటి మార్పు కనిపించదు. జీవితాన్ని ఆయన ఆస్వాదించే తీరు నాకు బాగా నచ్చింది అని మేఘ ఆకాశ్ అన్నారు.

Heroine Megha Akash Interview about Ravanasura

హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ : రావణాసుర సినిమా కథ విన్నప్పుడు లైన్ బాగా నచ్చింది. పెద్ద హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో నాకు మిగితా పాత్రల గురించి నాకు తెలియదు. నా పాత్ర వరకు మాత్రమే తెలుసు. ఈ సినిమాలో నా పాత్ర పేరు హారిక. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనే లైన్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కోసం నేను 20 రోజులు వర్క్ చేశాను. నాకు ఫరియా, పూజితతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అని మేఘా ఆకాశ్ చెప్పారు.

రవితేజను చూసి డైలాగ్స్ రాలేదు.: దర్శకుడు సుధీర్ వర్మను చూస్తే చాలా సిగ్గుపడినట్టు కనిపిస్తారు. కానీ డైరెక్టర్‌గా సెట్‌లో చాలాకాన్ఫిడెన్స్‌తో కనిపిస్తారు. తొలి రోజు రవితేజతో కాంబినేషన్ సీన్ షూట్ చేస్తున్నారు. ఆ సీన్‌లో కామెడీ సీన్లు ఉన్నాయి. రవితేజ కామెడీ టైమింగ్ స్పీడ్‌గా ఉంటుంది. ఆయనను చూసి నాకు డైలాగ్స్ రాలేదు. నేను చాలా నెర్వస్ అయ్యాను. ఆ సమయంలో సుధీర్ వర్మ నాతో చాలా కూల్‌గా వ్యవహరించి.. నన్ను మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేయడం నన్ను బాగా ఆకట్టుకొన్నది అని మేఘ ఆకాశ్ తెలిపారు.

Heroine Megha Akash Interview about Ravanasura

స్టార్ డమ్‌పై ఆశలేదు అంటూ : రావణసుర సినిమాతో పాటు నేను ఒక తమిళ సినిమా పూర్తి చేశాను. విజయ్ ఆంటోనితో మరో సినిమా చేస్తున్నాను. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మా మదర్ ప్రజెంట్ చేసిన ఓ సినిమా రిలీజ్‌కు ఉంది. నేను పరుగులు పెట్టి సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. తక్కువ సినిమాలు చేస్తూ ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకొంటున్నాను. నాకు పెద్ద హీరోయిన్ కావాలనే, స్టార్ డమ్ ఉండాలనే ఆశ లేదు అని మేఘా ఆకాశ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X