సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు ముందు.. ఆ తర్వాత అలా.. సుకుమార్ అలా చెప్పడం.. సంయుక్త మీనన్ (ఇంటర్వ్యూ)

విరూపాక్ష ఫాంటసీ చిత్రం. రుద్రవనం అనే పర్వత ప్రాంతంలో జరిగిన స్టోరి ఈ సినిమా కథ. నా పాత్ర పేరు నందిని. పట్టుదల, పొగరు, యాటిట్యూడ్‌తో కూడిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. నా పాత్రకు ఎంత పొగరు ఉంటుందంటే.. సూర్య (సాయిధరమ్ తేజ్) మా ఊరికి వస్తే.. ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకు ఏం పని అని నిలదీసే క్యారెక్టర్ ఉంది. అలాంటి యాటిట్యూడ్ ఉన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. మాట్లాడే విధానంలో, నడక తీరులో యాటిట్యూడ్ ఉండాలని డైరెక్టర్ కార్తీక్ స్పష్టంగా చెప్పారు అని సంయుక్త మీనన్ చెప్పారు.

నా గురించి సుకుమార్ అలా : రింగులు తిరిగిన జుట్టు, లంగా, ఓణిలో గ్రామీణ ప్రాంతపు అమ్మాయిలా కనిపిస్తాను. కానీ నేనెప్పుడు నా లుక్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను కేవలం యాక్టింగ్ పార్ట్ మీదే దృష్టిపెట్టాను. సుకుమార్‌ గారిని నేను సినిమా షూట్‌లో కలువలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే కలిశాను. నా గురించి సుకుమార్ మంచిగా చెప్పడం చాలా ఆనందం కలిగింది. నాతో మాట్లాడుతూ.. బాగా చేశావని ప్రశంసించారు. అందుకు యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని సంయుక్త మీనన్ అన్నారు.

 Heroine Samyuktha Menon

నందినీ పాత్ర కోసం : నేను గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగాను. నందిని క్యారెక్టర్ కూడా గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయే. కాబట్టి ఈ పాత్రకు నేను పెద్దగా కష్టపడలేదు. ఈ పాత్ర కోసం నేను ఏపీలోని చాలా ప్రాంతాలు తిరిగి.. కొంత పాత్ర గురించి స్టడీ చేశాను. ఈ సినిమాపై నాకు మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. ఫెర్ఫార్మెన్స్ పరంగా ఇంకా బెటర్ కావాలని కోరుకొంటాను. ఈ సినిమా చూసిన కెమెరామెన్ నాకు కాల్ చేసి.. అద్బుతంగా చేశావని చెబితే.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. రిలీజ్‌కు ముందు అలాంటి కాల్ రావడం చాలా హ్యాపీగా ఉంది అని సంయుక్త మీనన్ చెప్పారు.

విరూపాక్ష ఎలాంటి సినిమా అంటే? : మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందిన విరూపాక్ష సినిమా షూటింగ్ చాలా అడ్వెంచరస్‌గా సాగింది. రకరకాల యాక్సిడెంట్స్ అయ్యాయి. ఈ సినిమా కోసం చాలా రిస్క్ తీసుకొన్నాం. చాలా కష్టతరమైన జర్నీ. ఓసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇందంతా ఆలోచించుకొంటే.. సినిమా చేసినందుకు వర్త్ ఉందనిపిస్తుంది. దర్శకుడు కార్తీక్ బాగా డీల్ చేశాడు. చాలా జంతువులతో షూట్ చేశాం. సినిమా షూటింగ్ అంతా కష్టతరంగా సాగింది అని సంయుక్త మీనన్ తెలిపారు.

 Heroine Samyuktha Menon

అందుకే తెలుగు నేర్చుకొన్నాను అంటూ : తెలుగులో నేను ఒప్పుకొన్న సినిమా బింబిసార. తొలిసినిమా ఒప్పుుకొన్న రెండువారాల తర్వాత విరూపాక్ష సినిమా ఆఫర్‌ను ఒప్పుకొన్నాను. ఈ సినిమా ప్రారంభానికి ముందు చాలా వర్క్‌షాప్ చేశాం. షూటింగ్‌కు ముందు చాలా డైలాగ్ పేపర్లు ఇచ్చారు. అప్పుడు నాకు తెలుగు గురించి అసలే తెలియదు. అప్పుడు నేను తెలుగు నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ట్యూటర్‌ను పెట్టించుకొని తెలుగు పాఠాలు నేర్చుకొన్నాను అని సంయుక్త మీనన్ చెప్పారు.

సుమా క్యారెక్టర్ గురించి : 90వ దశకంలో సాగే పిరియాడిక్ సినిమా విరూపాక్ష. ఈ సినిమాలో నందిని పాత్ర ఎలా ఉంటుందో అర్ధం చేసుకొన్నాను. అంతేగానీ నేను ప్రత్యేకంగా ఎలాంటి కేర్ తీసుకోలేదు. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ లింక్ అయి ఉంటుంది. సుమ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో జంతువులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెర మీద మీకు మంచి అనుభూతి కలిగిస్తుంది అని సంయుక్త మీనన్ చెప్పారు.

 Heroine Samyuktha Menon

యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ : సాయిధరమ్ తేజ్‌తో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. అతడిని యాక్సిడెంట్‌కు ముందు చూశాను. యాక్సిడెంట్ తర్వాత కూడా చూశాను. అతడు కష్టపడే విధానం నాకు బాగా నచ్చుతుంది. ఆయన కెరీర్‌లో చాలాముందుకు వెళ్లాలి. జీవితంలో అలాంటి ప్రమాదం తర్వాత కూడా సాయిధరమ్ తేజ్ తిరిగి వచ్చి షూటింగులో పాల్గొన్న తీరు ఇన్సిపిరేషన్‌గా ఉంటుంది. సాయిధరమ్ ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్లో అందరితో బాగా మాట్లాడుతారు. నాకు నా జీవితంలో గురువు లేరు. నేను పుస్తకాలు చదివి నేను అన్నీ నేర్చుకొంటాను అని సంయుక్త మీనన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X