Sreeleela ప్రతీ రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొంటా.. రవితేజతో అలాంటి టెన్షన్.. శ్రీలీల ఇంటర్వ్యూ

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న చిత్రం ధమాకా. యువ హీరోయిన్ శ్రీలీల, మాస్ మహారాజాతో కలిసి జంటగా నటిస్తున్నది. రవితేజ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో శ్రీలీల ధమాకా సినిమాకు సంబంధించిన తన అనుభవాలను మీడియాతో పంచుకొన్నది. శ్రీలీల చెప్పిన విషయాలు ఏమిటంటే?

పెళ్లి సందD సమయంలో ధమాకా కథ

పెళ్లి సందD సమయంలో ధమాకా కథ

హలో గురు ప్రేమకోసమే సినిమాలో ఓ పాత్ర కోసం దర్శకుడు త్రినాథరావు నక్కిన నన్ను అడిగారు. అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల చేయడం వీలుపడలేదు. అయితే నేను పెళ్లి సందD చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ధమాకా సినిమా కథ చెప్పారు. ఆ కథలోని నా పాత్ర నచ్చడంతో సినిమా చేస్తానని కన్ఫర్మ్ చేశాను. ధమాకా చిత్రం వినోద ప్రధానంగా సాగే సినిమా. కామెడీ సన్నివేశాలు హిలేరిస్‌గా అని శ్రీలీల చెప్పింది.

దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొంటా

దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొంటా

ధమాకా చిత్రంలో ప్రణవి అనే పాత్రలో నటిస్తున్నాను. సినిమా రంగంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో స్టార్ హీరో రవితేజ గారితో నటించే అవకాశం లభించడం చాలా హ్యాపీగాను, లక్కీగాను ఫీలవుతున్నాను. ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు రోజు దేవుడికి దండం పెట్టుకోవడమే కాకుండా థ్యాంక్స్ చెప్పుకొంటాను. మొదటి సినిమా కొత్తవారితో చేశాను. రెండో సినిమా రవితేజతో నటించడమనే విషయం తెలిసినప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. సెట్లో మొదట్లో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆయనతో పనిచేస్తుంటే.. కాన్ఫిడెన్స్ వచ్చింది అని శ్రీలీల చెప్పింది.

విక్రమార్కుడు రేంజ్‌లో

విక్రమార్కుడు రేంజ్‌లో

రవితేజకు నేను పెద్ద ఫ్యాన్స్. ఆయన నటించిన కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఫస్ట్‌టైమ్ సెట్‌లో చూసినప్పడు ఫ్యాన్ మూమెంట్. ఒకరకమైన సర్ప్రైజ్ కలిగింది. రవితేజ చాలా మోటివేట్ చేస్తారు. పాత్రలో వేరియేషన్స్‌ను చాలా సులభంగా చూపించగలరు. విక్రమార్కుడులో డ్యూయల్ రోల్‌ను ఎలా అవుట్‌స్టాండింగ్‌గా చేశారో.. అంతే అద్భుతంగా ధమాకాలో రెండు పాత్రలను చేశారు అని శ్రీలీల తెలిపింది.

జింతాక సినిమా షూట్ సందర్భంగా

జింతాక సినిమా షూట్ సందర్భంగా


ధమాకా సినిమా కోసం జింతాక్ పాటను స్పెయిన్‌లో షూట్ చేశారు. షూటింగుకు ముందు రోజు నా డ్రెస్సుల బ్యాగ్ పోవడంతో చాలా టెన్షన్ పడ్డా. అయితే మా సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ స్పెయిన్ నుంచి మూడు గంటలు ప్రయాణించి అక్కడ నా కోసం షాపింగ్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి అనుభూతిని కలిగించే విషయం అని శ్రీలీల వెల్లడించింది.

బాలకృష్ణ, రామ్ పోతినేనితో మూవీస్

బాలకృష్ణ, రామ్ పోతినేనితో మూవీస్

ధమాకా చిత్రం తర్వాత బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. అలాగే బోయపాటి శ్రీను, రామ్ సినిమా కూడా చేస్తున్నా. వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే వారాహి ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నా. నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని శ్రీలీల చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X