For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాహుబలి తీసినంత అనుభవం వచ్చింది.. హుషారు డైరెక్టర్ హర్ష

  |

  యూత్ ఫుల్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన హుషారు సినిమా డిసెంబర్ 7న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సినిమా పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు. రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని తొలి చిత్ర దర్శకుడిగా దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. శ్రీహర్ష చెప్పిన విషయాలు ఏమిటంటే..

  చదువు మీద కంటే సినిమాలపైనే

  చదువు మీద కంటే సినిమాలపైనే

  నాకు చదువు మీద కంటే సినిమాలపైనే ఆసక్తి కలిగి ఉండేది. అయినా చదువులో అన్ని ఉత్తమ ర్యాంకులే వచ్చాయి. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అనే రొటీన్ కాన్సెప్ట్‌లో జీవితాన్ని లీడ్ చేయడం నాకు ఇష్టం లేకపోయేది. కానీ ఇంట్లో ఒత్తిడి వల్ల నాకు ఇష్టం లేనిది చేయాల్సి వచ్చేది.

  హుషారు ఆడియోకు 5 మిలియన్ల వ్యూస్.. ట్రెండింగ్‌గా ఉండిపోరాదే..

  యూకే‌లో మాస్టర్స్ చదువుడానికి

  యూకే‌లో మాస్టర్స్ చదువుడానికి

  ఇంట్లో వాళ్ల ఒత్తిడి మేరకు యూకే‌లో మాస్టర్స్ చదువుడానికి వెళ్లాను. అప్పుడు ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాను. ఇక్కడి వచ్చిన తర్వాత ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండటంతో సివిల్స్ ప్రిపేర్స్ కోసం ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు. అక్కడ చేరాను కానీ నా ధ్యాస అంతా సినిమాపైనే. చాలా రోజులు చివరి బెంచీలో కూర్చొని హుషారు కథ రాశాను.

  ఇంటర్నెట్‌లో ప్రొడక్షన్ గురించి

  ఇంటర్నెట్‌లో ప్రొడక్షన్ గురించి

  ఓసారి ఇంటర్నెట్‌లో పాపులర్ ఫిల్మ్ ప్రొడక్షన్ అని సర్చ్ చేస్తే లక్కీ మీడియా అని వచ్చింది. ఫిల్మ్ నగర్‌లో లక్కీ మీడియా ఆఫీస్‌ను వెతుక్కొంటూ వచ్చి బెక్కెం వేణుగోపాల్‌ను కలిశాను. వన్డే క్రికెట్ మ్యాచ్ చూస్తూ బెక్కెం వేణుగోపాల్ ఏదో అన్నట్టు కథ విన్నాడు. కానీ నేను చెప్పిన పాయింట్ నచ్చడంతో మళ్లీ అడిగి కథను చెప్పించుకొని సినిమాను ఓకే చేశాడు.

  హుషారు సినిమా చేసేటప్పుడే

  హుషారు సినిమా చేసేటప్పుడే

  హుషారు సినిమా చేసేటప్పుడే నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నాకు ఓ మాట చెప్పారు. సినిమా పూర్తయ్యేంత లోపు నీకు బాహుబలి తీస్తే ఎంత అనుభవం వస్తుందో. లక్కీ మీడియా బ్యానర్లో చేస్తే అంత వస్తుందని సరదాగా అన్నారు. ఎలాంటి అనుభవం లేని నాకు నిజంగానే బాహుబలి తీస్తే వచ్చే అనుభవం వచ్చిందనిపించింది.

  సినిమా తీయాలంటే అనుభవం

  సినిమా తీయాలంటే అనుభవం

  సినిమా తీయాలంటే అనుభవం అవసరం లేదు. స్క్రిప్టు పక్కాగా రాసుకొంటే సినిమా మేకింగ్ గురించి తెలిసిన ఎవరైనా తీయవచ్చు. సినిమా తీయాలంటే మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అది సినిమా.. సినిమా.. సినిమా మాత్రమే. నేను రాసుకొన్న కథ కచ్చితంగా ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని హర్ష అన్నారు.

   రధాన్ మ్యూజిక్ మంచి రెస్పాన్స్

  రధాన్ మ్యూజిక్ మంచి రెస్పాన్స్

  ఇక ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేం రధాన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఆడియోకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తున్నది. సింగర్ సిద్ శ్రీరాం పాడిన ఉండిపోరా అనే పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించింది. రాహుల్ రామకృష్ణపై చిత్రీకరించిన పాట కూడా బ్రహ్మండమైన ఫీడ్ బ్యాక్ వస్తున్నది. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ కెమెరామెన్‌ తోట రాజు అందించిన విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయి అని హర్ష వెల్లడించారు.

  English summary
  Hushaaru Produced by Bekkem Venu Gopal (Gopi) and Directed by Sree Harsha Konuganti, Under the Banner of Lucky Media. Starring Tejus Kancherla, Tej Kurapati, Dinesh Tej, Abhinav Medishetti, Daksha Nagarkar, Priya Vadlamani, Hemal Ingle, Ramya Pasupuleti, Rahul Rama Krishna. Music Composed by Radhan. This movie set to release on December 7th. In this occassion, a friendship song of the movie released by Vijay Deverakonda.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X