twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐ లవ్ విజయ్ దేవరకొండ.. అతనంటే అమ్మాయిలకు పిచ్చి!

    |

    Recommended Video

    Actress Hemal Ingle Have Crush On Vijay Devarakonda

    టాలీవుడ్‌లో చాలా ఏళ్ల తర్వాత ఫ్రెండ్‌షిప్, రొమాంటిక్ అంశాలు కలబోసిన హుషారు చిత్రం ప్రేక్షకలు ముందుకు వస్తున్నది. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి సాగించే జర్నీయే ఈ సినిమా కథ. ఈ చిత్రంలో హేమల్ ఇంగే అమ్మాయి హీరోయిన్‌గా హేమల్ ఇంగే టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నది. హుషారు మూవీ డిసెంబర్ 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హేమల్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

    హుషారు నాకు ఫస్ట్ మూవీ

    హుషారు నాకు ఫస్ట్ మూవీ

    హుషారు మూవీ నాకు మొదటి సినిమా. బేసిగ్గా మరాఠీ అమ్మాయిని. హుషారు తర్వాత రెండు మరాఠీ సినిమాల్లో నటించాను. వచ్చే ఏడాది ఆ సినిమాలు రిలీజ్ కానున్నాయి. హుషారు సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. యూత్‌కే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది.

     గ్లామర్‌కు, ఫెర్ఫార్మెన్స్‌కు

    గ్లామర్‌కు, ఫెర్ఫార్మెన్స్‌కు

    హుషారు మూవీలో నేను ముంబైకి చెందిన సౌమ్య అనే యువతి పాత్రను పోషిస్తున్నాను. చాలా అల్లరి అమ్మాయి క్యారెక్టర్. గ్లామర్‌కు, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర. ధ్రువ్ అనే పాత్రతో నాకు రిలేషన్‌షిప్ ఉంటుంది. నా కెరీర్‌కు చాలా ఉపయోగపడే పాత్ర. లక్కీ మీడియా రూపొందించిన సినిమాలో అవకాశం దక్కడం అదృష్టం.

    బీరు సొంతంగా తయారు చేసుకోవాలని ఉందా?.. అయితే హుషారు చూడాలట!బీరు సొంతంగా తయారు చేసుకోవాలని ఉందా?.. అయితే హుషారు చూడాలట!

    ఆ పాట విని ఫిదా అయ్యాను

    ఆ పాట విని ఫిదా అయ్యాను

    నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు హర్ష చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆడిషియన్‌కు వచ్చినప్పుడు ఓ పాట వినిపించారు. అప్పుడే నేను ఈ సినిమాపై ఫిదా అయ్యాను. ఈ చిత్రంలో బంటీ అనే క్యారెక్టర్ బాగా నచ్చింది. సినిమా కథలో నలుగురు యువకులు పడిన మానసిక సంఘర్షణ భావోగ్వేగంగా ఉంటుంది. ఆ పాత్రల నుంచి వచ్చే ఫన్ చాలా ఆకట్టుకొంటుంది.

    ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రస్టేషన్

    ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రస్టేషన్

    ప్రతీ ఒక్కరు జీవితంలో ప్రస్టేట్ అవుతారు. అవకాశాలు రాకుంటే నేను కూడా చాలా ప్రస్టేషన్‌కు గురయ్యాను. ప్రతీ జీవితంలో ప్రతీ ఒక్కరికి ఏదో సమయంలో అలాంటి ఫేజ్‌ ఎదురవుతుంది. ఈ సినిమా ఆద్యంతం వినోదంతో సాగుతుంది. ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది.

    హుషారు ఆడియోకు అనూహ్య స్పందన

    హుషారు ఆడియోకు అనూహ్య స్పందన

    హుషారు చిత్రానికి సంబంధించిన ఆడియో అనూహ్యమైన స్పందన లభించింది. ఉండిపోరా, నానా, రాహుల్ రామకృష్ణపై తీసిన పాటలు యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నాకు ఉండిపోరా అనే పాట బాగా నచ్చింది. మేము ప్రమోషన్‌లో భాగంగా పలు జిల్లాలో పర్యటించాం. అప్పుడ కాలేజీ స్టూడెంట్ష్ రెస్పాన్స్ బాగా ఉంది. వాళ్లు పాటల పడటం చూసి ఆశ్చర్యపోయాను.

     విజయ్ దేవరకొండ అంటే

    విజయ్ దేవరకొండ అంటే

    టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. నేను వారిలాగానే ఐ లవ్ విజయ్ దేవరకొండ. అతడి యాటిట్యూడ్, స్టయిల్ నాకు నచ్చుతుంది. అవకాశం వస్తే విజయ్‌తో నటించాలని ఉంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. తాప్సీ పొన్ను అంటే ఇష్టం. ఆమె ఎంపిక చేసుకొనే పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆమె నటించిన సినిమాల్లోని పాత్రల్లో ఇంటెన్సిటీ బాగా ఇష్టం.

    English summary
    Hushaaru Produced by Bekkem Venu Gopal (Gopi) and Directed by Sree Harsha Konuganti, Under the Banner of Lucky Media. Starring Tejus Kancherla, Tej Kurapati, Dinesh Tej, Abhinav Medishetti, Daksha Nagarkar, Priya Vadlamani, Hemal Ingle, Ramya Pasupuleti, Rahul Rama Krishna. Music Composed by Radhan. This movie set to release on December 14th. In this occassion, Hemal Ingle speak to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X