హీరోతో డేటింగ్‌లో ఉన్నాను.. రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై రష్మిక మందన్న రియాక్షన్!
గీత గోవింద చిత్రం రిలీజ్‌కు ముందు రష్మిక, రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిందంటూ రూమర్లు మీడియాలో చెలరేగాయి. అయితే వాటిపై రష్మిక పెద్దగా స్పందించలేదు. కానీ రక్షిత్, రష్మిక తరఫు వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. వారి మధ్య గాఢమైన బంధం ఉంది. ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అంటూ వచ్చిన వార్తలో వాస్తవం లేదు అని వారు వివరణ ఇచ్చారు. తాజాగా గీత గోవిందం చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో రష్మిక తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రష్మిక తన ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై ఆమె ఏమన్నారంటే..

ఎంగేజ్‌మెంట్ బ్రేకప్‌పై రష్మిక
రక్షిత్ శెట్టితో నా ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిందనే విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ వార్తను చూసి నవ్వుకున్నాను. ఎందుకంటే మా మధ్య బలమైన బంధం ఉంది. అందుకే నేను ఆ వార్తను చూసి లైట్ తీసుకొన్నాను.
Recommended Video


అబద్దపు ప్రచారాన్ని పట్టించుకోను
నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అబద్దపు ప్రచారాలను పట్టించుకోకు. నీవు ఇక్కడ ప్రేక్షకులకు నీ నటన ద్వారా మంచి అనుభూతిని కలిగించేందుకు వచ్చావు. ఆ పనిపైనే దృష్టి పెట్టు. మిగితా చెత్త విషయాలను పట్టించుకోవద్దు అని నాకు నేను సర్ధిచెప్పుకొన్నాను అని రష్మిక చెప్పింది.

పెళ్లికి ఇంకా సమయం ఉంది
రక్షిత్‌తో నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. కెరీర్‌పరంగా మేమిద్దరం చాలా బిజీగా ఉన్నాం. ఎంగేజ్‌మెంట్ సమయంలోనే రెండేళ్లపాటు డేటింగ్ చేయాలని అనుకొన్నాం. పెళ్లికి ముందు ఒకరికొకరం తెలుసుకోవాలనుకొంటున్నాం. మా మధ్య బంధం ఇంకా బలంగా మారేందుకు ఇద్దరం అవగాహనను పెంచుకొంటున్నాం అని రష్మిక చెప్పారు.

నేను ఇంకా పసిపాపను
సినిమా పరిశ్రమ అనిశ్చితమైంది. చాలా అసౌకర్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను పరిశ్రమలో రెండు మూడు సినిమాల వయసు ఉన్న చిన్న పిల్లను. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నాకు సరిగా తెలియదు. మరో ఐదేళ్లు అయితే ఎలా ఎదుర్కొన్నానో నేను తప్పుకుండా చెబుతాను.

రూమర్లను తేలికగా తీసుకొంటాను
నాపై వచ్చే కొన్ని విషయాలను మాత్రమే క్షుణ్ణంగా ఆలోచిస్తాను. పనికి రాని విషయాలను చాలా తేలికగా తీసుకొంటాను. సినిమా తారలపై రూమర్లు రావడం చాలా సహజం. ట్రోల్స్ చేయడం సాధారణం. నా ఒక్కరికే ఎదురుకావడం లేదు. చాలా మందికి ఈ సమస్య ఎదురవుతున్నది. ఏ వార్తలో నిజం లేకపోతే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని రష్మిక వివరించింది.


Click it and Unblock the Notifications











