త్రివిక్రమ్‌ను ముందే ప్రశ్నించాను.. అజ్ఞాతవాసి ఫ్లాప్ గురించి అను ఇమ్మాన్యుయేల్..
Recommended Video

భారీ సక్సెస్ చేజిక్కించుకొని టాలీవుడ్‌లో పాగా వేయడానికి కోసం పరితపిస్తున్న అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో అను పాలుపంచుకొన్నది. సినిమా, చిత్రంలోని పాత్ర, అలాగే వ్యక్తిగతమైన విషయాలను తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది.

అజ్ఞాతవాసి గురించి
అజ్ఞాతవాసి చిత్రంలో పాత్ర ఎలా వచ్చిదనే విషయాన్ని వెల్లడిస్తూ ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు కథను చెప్పాడు. అయితే ఆ సందర్భంగా ఈ సినిమాలో నా పాత్ర అతిథి పాత్రలా ఉంటుందా అని ఆయనకు నేను ఓ ప్రశ్న వేశాను.

ప్రణీత పాత్రలా ఉంటుందా?
అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత పాత్ర నాకు గుర్తొచ్చింది. ప్రణీత పాత్ర మాదిరిగా ఉంటుందా అని అడిగాను. సెకండ్ హీరోయిన్ పాత్ర అయితే నేను నటించను అని చెప్పాను. అందుకు లేదు సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కాదని చెప్పారు.

ఏ సినిమా ఆడుతుందో చెప్పలేం
అజ్ఞాతవాసి ఫ్లాప్ గురించి స్పందిస్తూ.. ఎప్పుడు ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో తెలియదు. ప్రతీ శుక్రవారం సినిమా పరిశ్రమకు ఓ అగ్ని పరీక్షలా ఉంటుంది. పవన్, త్రివిక్రమ్ లాంటి టీమ్ ఉన్న సినిమాను ప్రేక్షకులు నిరాకరించడం షాక్ గురిచేసింది.

అన్నీ చూసుకొంటాను
ఓ సినిమాను అంగీకరించేటప్పుడు దర్శకుడు, హీరో, కథ, బ్యానర్ అన్నీ విషయాలను పట్టించుకొంటాను. మేనేజర్ల సలహాలను పాటించను. మేనేజర్లు కేవలం ఇలా ఓ సినిమా ఆఫర్ ఉంది అని చెబితే కథ వింటాను. కథ, మిగితా విషయాలు నచ్చితే సినిమాను ఒప్పుకొంటాను అని అను ఇమ్మాన్యుయేల్ చెప్పింది.

భాషతోనే సమస్య
టాలీవుడ్‌లో తనకు ప్రధానమైన సమస్య భాష. దానిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఉత్తరాది నుంచి వచ్చిన వారికి కనీసం హిందీపై పట్టు ఉంటుంది. తాను ఉత్తరాది నుంచి రాకపోవడం వల్ల అటు హిందీ రాక, తెలుగు తెలియక ఇబ్బంది పడుతున్నాను. అను ఇమ్మాన్యుయేల్ అమెరికాలో పుట్టిన పెరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











