twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేల టికెట్ లోనే చూసాను. ఎందుకంటే.. నవ్వుతారు, భాధ పడతారు: రవితేజ

    |

    'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా 'నేల టిక్కెట్టు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 25)న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంధర్భంగా మాస్ మహారాజ రవితేజతో ఇంటర్వ్యూ..

    Recommended Video

    Ravi Teja & Director Kalyan Krishna Interview
    సరదా సరదాగా

    సరదా సరదాగా

    నేలటిక్కెట్టు అనే పదం మాస్‌ పదంలా అనిపించవచ్చు కానీ ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చే అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరో చాలా సరదా సరదాగా కనిపిస్తాడు. అందరికి నచ్చే విధంగా ఉంటాడు.

    సినిమా చూడాల్సిందే

    సినిమా చూడాల్సిందే

    నేను చిన్నప్పుడు చాలా సినిమాలను నేల టికెట్ లోనే చూసాను. ఎందుకంటే.. ఒక్క బాల్కాని టికెట్ తో నాలుగు నేల టికెట్ సినిమాలు చూడొచ్చు కావున. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ అని అందరు అంటారు.

    మాస్, క్లాస్ అనే తేడా లేకుండా

    మాస్, క్లాస్ అనే తేడా లేకుండా

    నేల టికెట్ అనే టైటిట్‌ మాత్రమే మాస్‌గా అనిపిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీసిన 'సొగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయి. ఆ తరువాత తీసిన రారండోయ్ వేడుక చూద్దాం బాగా క్లాస్ గా ఉంటుంది. ఈ సినిమా విషయానికి వచ్చే సరికి మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇది హండ్రెడ్‌ పర్సెంట్‌ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీ.

     చుట్టూ జనం మధ్యలో మనం

    చుట్టూ జనం మధ్యలో మనం

    నేల టికెట్ సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. చుట్టూ జనం, మధ్యలో మనం అనే కాన్సెప్ట్ తో సినిమా ఉంటుంది. జనం కోసం తపించే పాత్రలో నేను చెయ్యడం జరిగింది. కళ్యాణ్ కృష్ణ ఈ కథ ఎలా రాసుకున్నాడో అలాగే తియ్యడం జరిగింది.

    కొన్ని సీన్స్‌కు నవ్వుతారు

    కొన్ని సీన్స్‌కు నవ్వుతారు

    ఈ సినిమాలో రెండు రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేక్షకులు సినిమాను చూసినప్పుడు కొన్ని సీన్స్‌కు నవ్వుతారు మరికొన్ని కొన్ని సీన్స్‌కు భాద పడతారు. సినిమా ఎంటర్టైనర్ గా సాగుతూనే ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

    కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది

    కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది

    దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. కళ్యాణ్ కృష్ణ నాకు ఏదైతే చెప్పాడో దాన్ని అంతకంటే బాగా తెరకెక్కించడం జరిగింది. సినిమా విడుదల తరువాత మీకే తెలుస్తుంది.

     పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు

    పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు

    మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ మంచి పాటలు ఇచ్చాడు. అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నమస్తే పాట నాకు నచ్చింది. భవిషత్తులో ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. శక్తీకాంత్ సంగీతం అందించిన ఫిధా పాటలు నచ్చి ఈ సినిమాకు అవకాశం ఇవ్వడం జరిగింది.

    ఆల్రేడీ ఆయన డబ్బు సంపాధించారు

    ఆల్రేడీ ఆయన డబ్బు సంపాధించారు

    మా చిత్ర రామ్‌ తాళ్లూరిగారు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన్ను చూస్తే కొత్త ప్రొడ్యూసర్‌ అని ఎవరూ అనుకోరు. ఆల్రేడీ ఆయన డబ్బు సంపాధించారు. కేవలం సినిమా మీద ప్రేమతో మూవీస్ నిర్మిస్తున్నారు. భవిషత్తులో ఆయనతో మరిన్ని సినిమాలు చేస్తాను.

    చూడ్డానికి బాగుంది

    చూడ్డానికి బాగుంది

    మాళవిక శర్మ ఈ సినిమాతో పరిచయం కానుంది. చూడ్డానికి బాగుంది, మంచి నటన తో నేల టికెట్ సినిమాతో ఆకట్టుకోబోతోంది.

    త్వరలో ఆ వివరాలు

    త్వరలో ఆ వివరాలు

    ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో, సంతోష్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు సినిమాలతో పాటు వి.ఐ.ఆనంద్ సినిమా ఒకటి చెయ్యబోతున్నాను. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ఆ వివరాలు తెలుపుతాను.

    English summary
    Mass Maharaja Ravi Teja’s next film release would be Nela Ticket. This friday movie coming theaters. The teaser of this entertainer has been released and it proves that the film will be a complete package for every Ravi Teja fan. Raviteja about the film nela ticket.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X