twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ఇంటర్వ్యూ: ‘సాహో’ వర్కౌట్ అయితే నెక్ట్స్ ప్లాన్ ఏమిటంటే...

    |

    కొన్ని సార్లు విజయాలు మనిషి ప్రవర్తనలో మార్పును తెస్తాయి. తాము ఎవరూ సాధించని భారీ విజయం నమోదు చేసినపుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటివి కొందరిలో పెరిగిపోతుంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం విజయాన్ని తలకెక్కించుకోలేదు. బాహుబలి ముందు ప్రభాస్ ఎలా ఉన్నాడో... బాహుబలి తర్వాత కూడా ఆయన అదే విధంగా కనిపించారు.

    'సాహో' సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ ఫిల్మీబీట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫిల్మీ బీట్ బాలీవుడ్ ప్రతినిధి ఆయన నుంచి ఆసక్తికర ప్రశ్నలు రాబట్టారు. 'సాహో' బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయితే తన తర్వాతి ప్లాన్ ఏమిటి? బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తారా? అనే అంశాలపై ఆయన స్పందించారు.

    ‘సాహో' తర్వాత మీరు మరిన్ని హిందీ చిత్రాలను చేస్తారని భావించవచ్చా?

    ‘సాహో' తర్వాత మీరు మరిన్ని హిందీ చిత్రాలను చేస్తారని భావించవచ్చా?

    Q. మీరు నటించిన చివరి రెండు చిత్రాలు ఇక్కడ భారీ విజయం సాధించడం వల్ల చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ‘సాహో' తర్వాత మీరు మరిన్ని హిందీ చిత్రాలను చేస్తారని భావించవచ్చా?

    A. ‘సాహో' చిత్రం మంచి విజయం సాధిస్తే మరిన్ని ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తాను. నాకు బాలీవుడ్, తమిళం నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ‘సాహో' ఫలితాన్ని బట్టి తర్వాత నేను ఎలాంటి సినిమాలు చేయాలి అనేది నిర్ణయించబడుతుంది.

    మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ప్రతి సినిమాకు హార్డ్ వర్క్ చేయాలి

    మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ప్రతి సినిమాకు హార్డ్ వర్క్ చేయాలి

    Q: బాహుబలి ప్రమోషన్స్ సమయంలో మీరు ఇండస్ట్రీకి కొత్త, కానీ బాహుబలి తర్వాత ఇక్కడి ప్రేక్షకులు మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. బాలీవుడ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిందని భావిస్తున్నారా? లేదా ఇప్పటికీ ఔట్ సైడర్‌లా ఫీలవుతున్నారా?

    A. (నవ్వుతూ) తెలుగు సినిమా పరిశ్రమలో కూడా చాలా కష్టపడి పని చేయాలి. ప్రతి సినిమాకు నన్ను నేను నిరూపించుకోవాలంటే మరింత హార్డ్ వర్క్ చేయాలి. మేము మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు, హిందీ ప్రేక్షకులు ‘బాహుబలి'ని అంగీకరిస్తారో లేదో మాకు తెలియదు. వారు దానిని అద్భుతంగా స్వీకరించారు రెండవ భాగం మరింత గొప్పగా ఆదరించారు. ఇంటర్వ్యూలలో నేను అంతబాగా మాట్లాడలేను. మొదటిసారి బాలీవుడ్‌కు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూల్లో పాల్గొనడం అంత సులభం అనిపించలేదు. అంతకు ముందు నాకు ఇవన్నీ అలవాటు లేదు. కానీ, ఇక్కడి మీడియా నన్ను సాదరంగా ఆహ్వానించింది. ఇక్కడి స్టార్లు నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో ఏదో చిత్రం షూటింగ్‌లో ఉన్న అజయ్ దేవ్‌గన్ సర్ నన్ను తన గదికి పిలిచి మాట్లాడారు. రణబీర్ కపూర్ కూడా నాకు మెసేజ్ చేశారు. నాకు ఇక్కడ ఆత్మీయ స్వాగతం లభించింది.

    నేను కూడా సంవత్సరానికి కనీసం ఒక సినిమా చేయాలనుకుంటున్నాను

    నేను కూడా సంవత్సరానికి కనీసం ఒక సినిమా చేయాలనుకుంటున్నాను

    Q. ప్రభాస్, మీరు ఇపుడు ఇండియా హార్ట్‌రోబ్. మీ నుంచి మరిన్ని సినిమాలు ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, మీరు ఒక్కో సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నారు. కొందరు స్టార్స్ సంవత్సరంలో చాలా సినిమాలు చేస్తున్నారు. మీరు దాన్ని ఎలా చూస్తారు?

    A. నేను కూడా సంవత్సరానికి కనీసం ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. 'బాహుబలి' తరువాత నేను ఎలాంటి సినిమా చేసినా దాపిపై కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకు తగిన విధంగా సినిమా చేయాలి. ‘సాహో' భారీ యాక్షన్ మూవీ కాబట్టి మరింత సమయం పట్టింది.

    ప్రతి వారం మారే ప్రేక్షకుల పల్స్ ను మీరు అర్థం చేసుకోవాలి

    ప్రతి వారం మారే ప్రేక్షకుల పల్స్ ను మీరు అర్థం చేసుకోవాలి

    Q. సౌత్ ఇండస్ట్రీల కూడా మీరు ఎక్కువగా తెలుగు చిత్రాలపై దృష్టి పెడతారు. ఇతర దక్షిణాది భాషల్లో సినిమాలు తీయకుండా దూరంగా ఉండటానికి కారణం ఏమైనా ఉందా?

    A. నేను సినిమాలు చేయడం మొదలు పెట్టిన కొన్నాళ్ల తర్వాత తమిళంలో సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను తమిళనాడులో పుట్టాను. నాకు భాష కూడా తెలుసు. అయితే నాకు తెలుగులో స్థిరపడటానికి కొంత సమయం పట్టింది. అదృష్టవశాత్తూ, నాకు 'బాహుబలి' వచ్చింది, రాజమౌలి నన్ను జపాన్ వరకు తీసుకువెళ్లారు.(నవ్వుతూ)

    భారతీయ సినిమాల్లో ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోతున్నాయి

    భారతీయ సినిమాల్లో ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోతున్నాయి

    Q. గత రెండేళ్లలో భారతీయ సినిమాల్లో ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోతున్నాయి. శ్రద్ధా కపూర్ మీతో 'సాహో' చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ‘సైరా నరసింహా రెడ్డి' చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కూడా '2.0' లో నటించారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు?

    A. ఇది చాలా మంచి పరిణామం. మనకు దాదాపు 100 భాషలు ఉన్నాయి. పంజాబీ, తమిళం, తెలుగు. హిందీ సినిమాకు పెద్ద మార్కెట్ ఉంది. కాబట్టి, మనం ఒక ప్రపంచ స్థాయి పెద్ద చిత్రం చేస్తున్నపుడు మనం ఎందుకు ఇలా చేయకూడదు? కన్నడ చిత్రం 'కేజీఎఫ్' అన్ని భాషల్లో చాలా బాగా ఆడింది. ఎవరి తెలుసు... రేపు పంజాబ్ నుంచి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రం వస్తుందేమో? మనం ఒక దేశంలో భాగమైనందున మనం కలిసి పనిచేయాలి.

    నన్ను నేను నిరూపించుకోవడానికి తెలుగులో కూడా కష్టపడాలి

    నన్ను నేను నిరూపించుకోవడానికి తెలుగులో కూడా కష్టపడాలి

    Q. 'బాహుబలి' మీకు హిందీ సినిమాల్లో ప్రయోగాలు చేయగలమనే విశ్వాసం ఇచ్చిందా?

    A. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, నన్ను నేను నిరూపించుకోవడానికి తెలుగులో కూడా కష్టపడాలి. ఇది అంత సులభం కాదు. ప్రేక్షకులు మారిపోతున్నారు. వారు 'అర్జున్ రెడ్డి'ని కూడా అన్ని భాషల్లో చూస్తున్నారు. కాబట్టి, ప్రతి వారం మారుతున్న వారి పల్స్‌ను అర్థం చేసుకోవాలి. దానికి తగిన విధంగా పని చేస్తూ ముందుకు వెళ్లాలి. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న అంశం.

    నాకు సిగ్గు ఎప్పుడూ ఉంటుంది

    నాకు సిగ్గు ఎప్పుడూ ఉంటుంది

    Q. మిమ్మల్ని మీరు సిగ్గుపడే వ్యక్తిగా చెప్పుకుంటారు. అలాంటపుడు మీరు అన్ని ప్రాంతాల మహిళల అటెన్షన్ ఎలా హ్యాండిల్ చేయగలరు?

    A.నా పాఠశాల రోజుల్లో నేను ఎప్పుడూ అమ్మాయిలతో మాట్లేవాడిని కాదు. వారు వచ్చి నాతో మాట్లాడితే కంఫర్టబుల్‌గా ఫీలయ్యేవాడిని. నాలో సిగ్గు ఎప్పుడూ ఉంటుంది. అలాంటి నేను ఈ పరిశ్రమలో ఎలా ఉన్నానో నాకే అర్థం కాదు.(నవ్వుతూ)

    అపజయం పొందడం చాలా సులభం

    అపజయం పొందడం చాలా సులభం

    Q. అపజయం పొందడం చాలా సులభం. కానీ మీరు భారీ విజయాన్ని సాధించినప్పుడు, మీ భవిష్యత్ పనిని ఎలా ప్లాన్ చేస్తారు... ఎందుకంటే ప్రతిసారీ ఎవరూ ఆ స్థాయికి వెళ్ళలేరు.

    A. మీరు ఇప్పటికే కోల్పోయినందున ఫ్లాప్‌లతో వ్యవహరించడం సులభం. ఆ తర్వాత మీరు సంపాదించే ఎదుగుదల ఏదైనా అందంగా ఉంటుంది. ఇప్పుడు, ఎస్.ఎస్.రాజమౌళి నాకు 'బాహుబలి' ఇచ్చారు. ఇప్పుడు ఏమి చేయాలో నాకు తెలియదు. 'సాహో' కోసం మా శక్తిమేర కష్టపడ్డాం.

    'సాహో' కోసం నా వాయిస్ కావాలి కాబట్టి నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను

    'సాహో' కోసం నా వాయిస్ కావాలి కాబట్టి నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను

    Q. 'బాహుబలి' ఫ్రాంచైజీ హిందీ వెర్షన్ కోసం మీరు డబ్ చేయలేదు. కానీ 'సాహో' కోసం స్వంత స్వరాన్ని ఇచ్చారు. ఇది మీరు తీసుకున్న నిర్ణయమేనా?

    A. 'సాహో' కోసం నా వాయిస్ కావాలి కాబట్టి నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. 'బాహుబలి'లో నా పాత్ర కోసం శరద్ కేల్కర్ డబ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అతనది అద్భుతమైన, అందమైన స్వరం. 'బాహుబలి' కోసం నేను తమిళంలో కూడా డబ్ చేయలేదు. ఎందుకంటే ఈ చిత్రాలకు ప్రామాణికమైన, సాంప్రదాయకమైన స్వరం అవసరం. కానీ 'సాహో' కమర్షియల్ చిత్రం. దీన్ని మేనేజ్ చేయగలను అనుకున్నాను కాబట్టే చేశాను.

    'బాహుబలి 3 చేయడం అంత సులభం కాదు'

    'బాహుబలి 3 చేయడం అంత సులభం కాదు'

    Q. 'బాహుబలి' తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి మీతో సినిమా చేయకపోవడంతో నిరాశ చెందారా?

    A. 'బాహుబలి' బృందం రెండు చిత్రాల కోసం నాలుగేళ్లు పని చేసింది. అవి రెండు వినోదాత్మక ప్రాజెక్టులు, ఎంజాయ్ చేస్తూ చేశాం. ‘బాహుబలి 3' చేయడానికి ఎస్.ఎస్.రాజమౌళి కూడా ఎగ్జైటెడ్‌గా ఉండాలి. 'బాహుబలి' కి ముందు ఏడు స్క్రిప్ట్స్ విన్నాను. ఆయన రాసిన వాటిలో అరవై శాతం విన్నాను. కానీ వాటితో అతను సంతోషంగా లేడు. స్క్రిప్ట్‌ను ఖరారు చేయడానికి అతనికి ఐదేళ్లు పట్టింది. స్క్రిప్ట్ రెండు భాగాల వరకు మాత్రమే వ్రాయబడినందున 'బాహుబలి 3' తీయడం అంత సులభం కాదు. అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకు తగిన విధంగా స్క్రిప్ట్ ఉండాలి. అది చేయడానికి రాజమౌళి కూడా ఎగ్జైటెడ్‌గా ఉండాలి, మరొక బాహుబలి చేయాలంటే చాలా కష్టపడాలి. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా జరిగుతుందో చూద్దాం.

    పరిశ్రమ కూడా దీనికి అలవాటు పడాలి.

    పరిశ్రమ కూడా దీనికి అలవాటు పడాలి.

    Q. సౌత్ నటులు డిజిటల్ స్ట్రీమింగ్‌‌లోకి ఇంకా ప్రవేశించలేదు. దీనికి ఒక నిర్దిష్ట కారణం ఏమైనా ఉందా?

    A. ఇది ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ పెద్ద హిందీ షోలు చేస్తోంది. వారు దక్షిణాన ఇలాంటిదే చేస్తే, బహుశా అవకాశం ఉంది. ఇది పరిమాణం, స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కూడా దీనికి అలవాటు పడాలి. ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది. ఈ విషయంబాలీవుడ్ మరింత ముందు ఉంది, దక్షిణ పరిశ్రమ ఇప్పటికీ స్టార్స్ ఫేం మీద రన్ అవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు వచ్చిన తర్వాత అది జరగవచ్చు. యంగ్ జనరేషన్ ఈ విషయం ఉంది. మున్ముందు మరిన్ని మార్పులు జరుగుతాయి.

    ఒక నటుడని తెరపై వారు పోషించే పాత్రల ఆధారంగా జడ్జ్ చేయడం

    ఒక నటుడని తెరపై వారు పోషించే పాత్రల ఆధారంగా జడ్జ్ చేయడం

    Q. ఒక నటుడని తెరపై వారు పోషించే పాత్రల ఆధారంగా జడ్జ్ చేయడం న్యాయమని మీరు అనుకుంటున్నారా? తెరపై నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసిన వారు విమర్శలకు గురవ్వడం మీరు కూడా చూసే ఉంటారు.

    A. మీరు ఒక ఇమేజ్ పొందిపుడు మీరు దాన్ని బ్రేక్ చేయాలి. కానీ, స్క్రిప్ట్ చాలా బలంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన భాగం. ప్రేక్షకులు ఎలాంటి సినిమా అయినా చూస్తారనడంలో సందేహం లేదు. కానీ, మీరు అకస్మాత్తుగా సముద్రం నుండి ఇసుక వైపు వెళ్ళలేరు. ఉదాహరణకు, 'బాహుబలి' తీసుకోండి. మొదటి భాగంలో, ఒక మహిళ చనిపోతోంది, ఈ బిడ్డ జీవించాలని చేయి మాత్రమే సూచిస్తుంది. కాబట్టి, తెలుగు ప్రేక్షకులు తప్ప నా ముఖం ఎవరికీ తెలియదు. ప్రేక్షకులు ఇప్పటికే శిశువుపై ఆసక్తి కలిగి ఉన్నారు. అతను గిరిజన ప్రజలలో పెరుగుతాడు. అతను పెద్దయ్యాక, అతను పర్వతాలను అధిరోహించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎల్లప్పుడూ విఫలమవుతాడు. చివరగా, అతను ఎక్కడంలో విజయం సాధిస్తాడు కాని అక్కడ పెద్ద సమస్య ఉంది. ఒక తల్లి వేచి ఉంది. ఎక్కడైనా అది జరుగవచ్చు. అతను సూపర్ స్టార్ లేదా సాధారణ స్టార్ అయినా పర్వాలేదు. కాబట్టి, మీరు పాత్రను ఎలా నడిపించాలో చాలా ముఖ్యం, కేలం ముఖం కాదు.

    English summary
    Despite the phenomenal success of the 'Baahubali' franchise, Prabhas is still the same person. A man of few words whose simplicity and down-to-earth nature completely bowls you over! At one point during our conversation with him, the superstar candidly confides, 'I am not very good with interviews.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X