Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
త్రివిక్రమ్ సలహాతోనే అక్కడికి.. అప్పుడే నా దశ తిరిగింది.. ఇలియానా
టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగానే గోవా బ్యూటి ఇలియానా బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్లో తన తొలి సినిమా బర్ఫీ ఆఫర్ వెనుక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్లో ఇలియానాకు మంచి పేరు సంపాదించి పెట్టిన ఆ చిత్రాన్ని అంగీకరించడానికి ముందు చాలా ఇబ్బందులు పడ్డానని పేర్కొన్నారు. టాలీవుడ్‌కు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించింది. ఇలియానా వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
గర్భవతిని అని అన్నారు.. వారం రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు.. ఇలియానా!
టాలీవుడ్‌కు దూరంగా ఉండటం
టాలీవుడ్‌కు దూరంగా ఉండటం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. బాలీవుడ్ సినిమా బర్ఫీ ఆఫర్ వచ్చినప్పుడు నేను జులాయి సినిమా చేస్తున్నాను. ఆ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా తీసుకొన్నాను. నాకు కథ నచ్చింది. ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా. ఆ సమయంలో ఆ సినిమా చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను.
పాత్రల ఎంపికపై అవగాహన
నాకు ఎలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవాలనే విషయంలో సరిగా అవగాహనల లేదు. ఆయనకు సినిమాపై పూర్తిగా అవగాహన ఉన్నందున కథ చెప్పి నటించాలా లేదా అనే అభిప్రాయాన్ని తీసుకొన్నాను. దాంతో బాలీవుడ్లో బర్ఫీ సినిమాలో నటించాను. దాంతో టాలీవుడ్‌కు దూరం కావాల్సి వచ్చింది.
ఎలాంటి బాధ లేదు..
తెలుగు సినిమాకు దూరం కావడంలో ఎలాంటి బాధ లేదు. బాలీవుడ్లో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో మంచి కథలు నా ముందుకు రాలేదు. అందుచేతనే టాలీవుడ్‌కు దూరమయ్యాను. కానీ ఇప్పుడు అమర్ అక్బర్ ఆంథోని చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. కథల ఎంపికపైనే నా దృష్టి ఉంటుంది.
కథ నచ్చడం వల్లనే
టాలీవుడ్‌కు దూరమున్న సమయంలో శ్రీనువైట్ల చెప్పిన కథ నచ్చడం, నా ఫేవరేట్ హీరో రవితేజతో నటించడమనే అంశాలు అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించేలా చేశాయి. ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రాధాన్యమున్నది. పూర్తిగా నా పాత్ర గురించి చెప్పలేను. అమర్, అక్బర్, ఆంటోని మూడు పాత్రలతో బలమైన రిలేషన్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చెప్పలేను. నాది ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యమున్న పాత్ర.