పోకిరిని రిజెక్ట్ చేశా.. నటించొద్దనుకొన్నా.. ఆమె బలవంతం చేయడం వల్లే.. ఇలియానా
ప్రిన్స్ మహేష్ బాబు, అందాల భామ ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి చిత్రం టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. మహేష్, ఇలియానా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో తెర మీద సన్నివేశాలు బ్రహ్మండంగా పండాయి. కానీ పోకిరి చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. కానీ మనసు మార్చుకొని ఆ చిత్రంలో నటించడానికి ముందుకొచ్చిందట. ఈ విషయాన్ని అమర్ అక్బర్ ఆంథోని ప్రమోషన్‌లో భాగంగా వెల్లడించింది. పోకిరి సినిమా చేయడానికి కారణమేమైందంటే..

భారీగానే ఆఫర్లువచ్చాయి
బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లే వచ్చాయి. కానీ నా పాత్రకు సంబంధించి ప్రాధాన్యం లేకపోవడంతోనే ఒప్పుకోలేదు. ఓ భారీ నిర్మాత, హీరో సినిమాలో నటించమని కోరారు. కానీ నా పాత్ర చాలా తక్కువగా ఉండటంతో నేను ఒప్పుకోలేదు.

స్పెషల్స్ సాంగ్స్ రిజెక్ట్ చేశాను
టాలీవుడ్‌కు దూరంగా ఉన్న సమయంలో లెక్కలేని స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు. కారణమేమిటంటే ఆ పాటలకు సంబంధించిన నేపథ్యం బాగా లేకపోవడం, నాకు గొప్పగా పేరు తెచ్చే అవకాశం లేకపోవడం వల్ల వాటిని తిరస్కరించాను. అమర్ అక్బర్ ఆంథోనికి ముందు కథ నచ్చకపోవడం వల్ల చాలా సినిమాలను రిజెక్ట్ చేశాను.

పోకిరిని కూడా వద్దనుకొన్నాను
ఓ దశలో నేను పోకిరి సినిమా కూడా చేయకూడదని అనుకొన్నాను. ఆ సమయంలో చాలా ఓ రకమైన ఆందోళనలో ఉన్నాను. అందుకే పోకిరి చేయకూడదని అనుకొన్నాను. కానీ మహేష్‌బాబు సోదరి మంజుల ఫోన్ చేసింది. చాలా మంచి కథ అని చెప్పి ఆ సినిమాను చేయమని అడిగింది. దాంతో పోకిరి చేశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. పోకిరి నా కెరీర్‌ను మలుపుతిప్పింది.

గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌కు ఓటు
గ్లామర్, ఫెర్ఫార్మెన్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొంటూ నా రోల్స్ ఎంపిక చేసుకొంటాను. కేవలం నేను గ్లామర్ పాత్రలకో, ఫెర్ఫార్మెన్స్ పాత్రలకే పరిమితం కాలేను. మగధీర లాంటి రాజమౌళి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది.

టాలీవుడ్‌కు దూరంగా ఉండటం
టాలీవుడ్‌కు దూరంగా ఉండటం లాభంగానో, నష్టంగానో భావించలేను. కానీ ఎక్కువగా గ్యాప్ ఉండొద్దని అనుకొన్నాను. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చేస్తూ బ్యాలెన్స్ చేయాలని అనుకొన్నాను. కానీ కుదర్లేదు. సమయం, అదృష్టాన్ని నమ్ముతాను. ఇప్పుడు సమయం, తెలుగులో నటించే అవకాశం లభించింది. అయితే నాకు ఇష్టమైన హైదరాబాద్‌లో ఉండలేకపోవడం కష్టంగా అనిపించింది. ఇక్కడ రెస్టారెంట్లు, స్ట్రీట్లు తిరగలేకపోయాను.


Click it and Unblock the Notifications











