నేను లైంగిక వేధింపులకు గురయ్యా.. సమయం చూసి బయటపెడుతా.. ఇలియానా
భారతీయ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ టూ ఉద్యమం సాగుతున్నది. వేధింపులకు గురైన హీరోయిన్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి, బాలీవుడ్‌లో తను శ్రీ దత్తా లాంటి వాళ్లు లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమంపై అభిప్రాయాన్ని కోరగా అందాల భామ ఇలియానా ఈ విధంగా స్పందించింది. లైంగిక వేధింపులుపై ఇలియానా చెప్పిన విషయాలు మీ కోసం..

వాటిని వింటేనే భయంగా ఉంది..
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు విషయాలు బయటకు రావడం చాలా భయమేస్తున్నది. చాలా బాధగా కూడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో వారు బయటకు వస్తున్నారో తలచుకొంటే భయంగా ఉంది. వారు ఎలాంటి వ్యధకు గురయ్యారో చూస్తే గుండె తరుక్కుపోతున్నది. ఇలాంటి వేధింపులు అనిచోట్లా ఉన్నాయి.

ఎవరూ మాట్లాడినా స్వాగతిస్తా
లైంగిక వేధింపుల గురించి ఎవరు మాట్లాడినా స్వాగతిస్తాను. బాధకు గురైన ప్రతీ ఒక్కరు మాట్లాడిల్సిందే. సిగ్గు పడకుండా ముందకొచ్చి అలాంటి విషయాలను బయటపెట్టాలి. లైంగిక వేధింపులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. బాలీవుడ్ నిర్మాతల మండలి తగు చర్యలు తీసుకొంటున్నది.

నేను ఇప్పుడు మాట్లాడలేను
నేను వ్యక్తిగతంగా లైంగిక వేధింపులకు గురయ్యానా అనే విషయంపై ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతాను. ప్రస్తుతం పరిస్థితుల్లో మాట్లాడటం బాగుండదు. చాలా క్లిష్టమైన సమస్య గురించి ఇప్పుడు మాట్లాడలేను.

సంచలనాల కోసం
ఏ అంశాలను లైంగిక వేధింపుల కిందకు తీసుకోవాలి? లేదా తీసుకోకూడదు అనే విషయాలపై ఆలోచిస్తున్నాను. ఓ డైరెక్టరో, హీరోపైనే అలా ఆరోపణలు చేసి సంచలనాలు సృష్టించడం మంచిది కాదు. కేవలం సంచలనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదు. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తాను. అలా అని ఎవరైనా నటించడానికి వస్తే వారిని వేధించడం సరికాదు. సిని పరిశ్రమలోనే కాదు ఏ రంగంలో కూడా ఇలాంటివి ఉండకూడదు అని ఇలియానా పేర్కొన్నది.

హోదాలు నాకు నచ్చవు
సూపర్‌స్టార్, సెలబ్రిటీ అనే హోదాలు నాకు నచ్చదు. విభిన్నమైన పాత్రల్లో నటించడం ఇష్టం. షూటింగ్, లేదా సెట్లో నటిస్తాను. ఆ పని ముగిసిన వెంటనే సాధారణమైన అమ్మాయిగా మారిపోతాను. ఇంటి, వంట పనులను స్వయంగా చేసుకొంటాను. బయటి ప్రపంచంలో సాధారణమైన అమ్మాయిగా ఉండాలనుకొంటాను.

ఆఫర్లు రావడం లక్కీ
నాకు 18 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. తక్కువ వయసులోనే చాలా సినిమాలు చేశాను. అప్పటో అవకాశాలు వచ్చినపుడు చాలా వినోదం కోసం పనిచేశాను. నాకు గొప్ప అవకాశాలు రావడం నిజంగా అదృష్టం. ఎందరో టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నా వారికి అవకాశాలు దక్కడం లేదు. నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ మంచి కథలున్న సినిమాలనే చేస్తున్నాను.


Click it and Unblock the Notifications











