ChauryaPaatam చాలా మంది డైరెక్టర్లు రిజెక్ట్ చేశారు..టాప్ హీరోలు ఉన్నా నాకే ఆఫర్ ఎందుకంటే?ఇంద్రరామ్ (ఇంటర్వ్యూ

కంటెంట్ ప్రధానంగా సాగే చిత్రాలను ఇటీవల కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ తరహాలో వస్తున్న చిత్రం చౌర్య పాఠం. ఈ సినిమా కంటెంట్ చూసి ఇంప్రెస్ అయిన ప్రముఖ దర్శకులు త్రినాథ రావు నక్కి, కార్తీక్ ఘట్టంనేని లాంటి వాళ్లు నిర్మాతలుగా మారారు. అయితే ఈ సినిమా ద్వారా కొత్త యువకుడు, ప్రతిభావంతుడైన ఇంద్రరామ్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అయితే ఈ సినిమాలో కొత్త హీరోను పరిచయం చేయడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయానికి వస్తే..

నాకు చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి అంటే నాకు చాలా ఇస్టం. నేను ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చి యాక్టింగ్ కోర్సులో చేరాను. ఆ తర్వాత వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగగాను. చాలా మంది దర్శకులను కలిశాను. చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారు. కానీ చౌరపాఠం సినిమాతో మంచి అవకాశం దక్కింది. త్రినాథ రావు, కార్తీక్ ఘట్టంనేనికి జీవితాంతం రుణపడి ఉంటాను అని ఇంద్రరామ్ చెప్పాడు.

Indhra Ram Chaurya Paatam is Worth Waiting for my career Thrinadha Rao Nakkina Karthik Gattamneni

కార్తీక్ ఘట్టంనేని రాసిన కథ విన్న తర్వాత త్రినాథరావు నిర్మాతగా మారడానికి ముందుకు వచ్చాడు. అయితే తమ చేతిలో ప్రముఖ హీరోల డేట్స్ ఉన్నప్పటికీ.. నాకు ఈ సినిమా ఆఫర్ ఇచ్చారు.. అందుకు కారణం ఆ కథలోని పాత్రకు అనేక మందిని ఆడిషన్ చేసిన తర్వాత నేను పర్‌ఫెక్ట్ అని భావించారు అని యువ హీరో ఇంద్రరామ్ తెలిపింది.

Indhra Ram Chaurya Paatam is Worth Waiting for my career Thrinadha Rao Nakkina Karthik Gattamneni

ఇక చౌర్య పాఠం సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెండేళ్లు వెయిట్ చేశాం. నా కెరీర్‌కు మంచి ఫౌండేషన్ వేసే సినిమా కోసం నేను వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యాను.ఈ రెండేళ్ల కాలంలో సినిమా గురించి, చిత్ర యూనిట్ గురించి చాలా తెలుసుకొన్నాను. నేర్చుకొన్నాను. త్రినాథ రావు, కార్తీక్ ఘట్టంనేని, నిఖిల్ గొల్లమారి, దర్శకుడు నాగేంద్ర తంగల్ల నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీ టెక్నికల్‌గా, కంటెంట్ పరంగా హై ఉంటుంది. ఈ సినిమా చేసిన తర్వాత 4, లేదా 5 సినిమాలు చేసిన అనుభవం లభించింది అని ఇంద్రరామ్ తెలిపాడు.

Indhra Ram Chaurya Paatam is Worth Waiting for my career Thrinadha Rao Nakkina Karthik Gattamneni

చౌర్య పాఠం సినిమాకు కథే హీరో. మా నుంచి ఆడియెన్స్ కొత్తగా ఆశిస్తారు.అలాంటి వారికి అంచనాలు మంచి ఈ మూవీ ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ ఆడియెన్స్ కొత్త అనుభూతిని పంచుతుంది. నేను నటించే చిత్రాల్లో పక్కింటి కుర్రాడు అనే ఫీలింగ్ కల్పించే పాత్రలను ఎంచుకొంటున్నాను. చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను ఆచితూచీ సినిమాలు ఎంచుకొంటున్నాను. ఆఫర్లు వచ్చాయని నేను వాటి వెనుక పరుగులు పెట్టడం లేదు అని ఇంద్రరామ్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X