లిప్‌లాక్స్‌తో అసౌకర్యంగా ఫీలయ్యా.. వర్మ ఎలాంటి వాడంటే.. భైరవగీత హీరోయిన్‌ ఇరా

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పిస్తున్న భైరవ గీత మూవీ ద్వారా టాలీవుడ్‌కు మరో హీరోయిన్‌ పరిచయం అవుతున్నది. ఉత్తరాదికి చెందిన ఇరా మోర్ భైరవగీత చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఇరా మోర్ ప్రభావవంతమైన పాత్రలో నటించింది. ఆమె నటించిన గీత పాత్ర టీజర్లు, ట్రైలర్లలో మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. భైరవగీత చిత్రం నవంబర్ 30న రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో ఇరా మోర్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. ఇరా మోర్ వెల్లడించిన అంశాలు ఏమిటంటే..

ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను

ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను

భైరవగీత సినిమా నాకు తొలిచిత్రం. రిలీజ్‌కు ముందే మంచి బజ్ రావడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. తొలి సినిమాలోనే రాంగోపాల్ వర్మ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. తప్పకుండా నా పాత్రకు మంచి పేరు వస్తుందని అనుకొంటున్నాను.

నా పాత్ర ఎలా ఉంటుందంటే

నా పాత్ర ఎలా ఉంటుందంటే

భైరవగీత చిత్రంలో గీత పాత్రలో నటించాను. లండన్‌లో చదువుకొని గ్రామానికి వచ్చిన యువతి పాత్ర. ప్రాంతం, కులం లాంటి విషయలను పట్టించుకోని రోల్ నాది. తొలి సినిమాలోనే నాకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ పాత్ర దొరికింది. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను.

ముద్దులతోనే ఇబ్బంది

ముద్దులతోనే ఇబ్బంది

భైరవగీత సినిమా షూట్ చాలా కష్టంతో కూడుకొన్నది. చాలా వరకు పరుగెత్తే సీన్లు ఉన్నాయి. 20 అడుగుల ఎత్తైన కొండపైన షూట్ చేయాల్సి వచ్చింది. మొదటి సినిమాలోనే చాలా ముద్దు సీన్లు చేయాల్సి వచ్చింది. వాటికి నేను ప్రిపేర్ కాలేదు. మొదట్లో కొంత నెర్వస్‌గా ఉండేది. కానీ క్రమేణ అలవాటైపోయింది. సినిమా వాతావరణం చాలా కొత్త. కానీ నాకు ఫ్యామిలీ నుంచి బలమైన సపోర్ట్ ఉంది.

 రాంగోపాల్ వర్మ ఎలాంటి వాడంటే

రాంగోపాల్ వర్మ ఎలాంటి వాడంటే

రాంగోపాల్ వర్మ లాంటి క్రేజీ డైరెక్టర్ మూవీలో నటించడం ద్వారా నాకో గుర్తింపు వచ్చింది. ముక్కుసూటి వ్యక్తిత్వం. ఎదుటివాళ్లను గౌరవిస్తాడు. ఒక్కమాటలో సింపుల్‌గా అర్ధమయ్యేలా చెబుతాడు. వర్మ సినిమా అంటే భయపడలేదు. హీరోయిన్లను అసభ్యంగా చూపుతారనే నేను అనుకోను. పాత్ర పరిధి మేరకే క్యారెక్టర్ ఉంటుంది.

భైరవగీత గురించి చాలా ఆలోచించాను

భైరవగీత గురించి చాలా ఆలోచించాను

భైరవగీత సినిమాను ఒప్పుకొనే ముందు చాలా ఆలోచించాను. నేను సంప్రదాయ జాట్ కుటుంబం నుంచి వచ్చాను. అప్పుడు ఈ సినిమా నా కుటుంబంపై, కెరీర్‌పై ప్రభావం పడుతుందా అని ఆలోచించాను. ఆ తర్వాత నేను స్క్రిప్టును పలుమార్లు చూశాను. నేను పాత్రలో ఉండే ఇంటెన్సిటీనే చూశాను. అందుకే నేను ఈ సినిమాను ఒప్పుకొన్నాను.

మహేష్ బాబు, రవితేజ అంటే

మహేష్ బాబు, రవితేజ అంటే

టాలీవుడ్‌లో నేను చాలా సినిమాలే చూశాను. మహేష్ బాబు, రవితేజ సినిమాలు ఎక్కువగా చూశాను. మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మూడు నాలుగు సార్లు చూశాను. భవిష్యత్తులో బాగా కథను చెప్పే దర్శకులతో నటించాలనుకొంటున్నాను. నా కెరీర్‌కు హెల్ప్ అయ్యే పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను అని ఇరా మోర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X