HanuMan: మూవీపై వివక్ష కొనసాగుతుందా? హనుమాన్ ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అవుతుందంటే?’
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజా సజ్జా నటించిన చిత్రం హనుమాన్. డిస్టిబ్యూటర్ కే నిరంజన్ రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేసిన సమయంలో స్క్రీన్లు కేటాయింపు వివాదంగా మారింది. పెద్ద సినిమాల పేరుతో హనుమాన్ సినిమాకు స్క్రీన్లు కేటాయించడంలో వివక్ష జరుగుతుందనే నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలుగు ఫిలింబీట్‌తో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..
Recommended Video

మేము హనుమాన్ సినిమా ప్రారంభించినప్పుడు మా దృక్పథం వేరు. ఆయన సూపర్ హీరో. యూనివర్సల్ సూపర్ హీరో. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్లు. దేశంలో 130 కోట్ల మందికి ఆరాధ్యుడు. మీరు సినిమాకు వెళ్తే మీరు ఎలా చూడాలనుకొంటారో అలానే ఉంటుంది అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

ప్రశాంత్ వర్మ విజన్ చాలా పెద్దది. హనుమాన్ సినిమా అనంతరం మరో పెద్ద సినిమా చేద్దామని అంటే.. తెలుగులోనే చేద్దాం అని చెప్పారు. హనుమాన్ సినిమా స్క్రిప్టు ఇంప్రూవైజ్ చేసినప్పుడు యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా అనిపించింది. దాంతో ఒక సూపర్ హీరో ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని అనుకొన్నాం.
అంజనేయ స్వామి నమ్మకంతోనే భారీగా రూపొందించాం. బిజినెస్ కూడా భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇది మాకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ ప్రాజెక్ట్ మాకు అన్ని రకాలుగా వర్కువుట్ అయింది. ఈ సినిమా రెండు, మూడు రోజులు ఆడే సినిమా కాదు. ఏడు వారాలు ఆడే సినిమా అనే నమ్మకాన్ని నిరంజన్ రెడ్డి వ్యక్తం చేశారు.

హనుమాన్ సినిమాను కర్ణాటకలో హోంబలే ఫిలింస్ రిలీజ్ చేస్తున్నది. కేరళలో గోపాలన్ శ్రీనివాసన్, తమిళనాడు శక్తి ఫిలిం ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే కమిషన్, ఔట్ రైట్ మోడల్‌లో మిక్స్‌డ్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్క్రీన్లు లభిస్తున్నాయి అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
అమెరికాలో 300 లోకేషన్లలో రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ డేట్ వరకు 500 లొకేషన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నార్త్ అమెరికాలో భారీగానే మా సినిమాకు తగినంతగా స్క్రీన్లు లభించాయి. తమిళ, కేరళ, కన్నడ, హిందీ ప్రాంతాల్లో కూడా స్క్రీన్లు భారీగా లభించాయి. హెల్తీగా స్క్రీన్లు కేటాయిస్తే.. సినిమా రేంజ్ అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











