Samantha Ruth Prabhu మ్యారేజ్ లైఫ్ ఆధారంగా ఖుషి మూవీ.. డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పినదేమిటంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు జంటగా నటించిన చిత్రం ఖుషి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ..

సమంత మూవీ చూడలేదు.. :ఖుషి మూవీ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. ఓవర్సీస్‌కు కంటెంట్ పంపించాం. అందరూ హ్యాపీగా ఉన్న తర్వాత ఈ సినిమా విషయంలో మరో ఆలోచన నాకు కూడా రాలేదు. మంచి కంటెంట్‌తో ఉన్న ఈ మూవీని అందరికి నచ్చేలా చేశాం. విజయ్ దేవరకొండ ఈ సినిమా చాలా సార్లు చూశాడు. డబ్బింగ్ చెబుతున్న సమయంలోనే సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యాడు. సమంత ఈ సినిమా చూడలేదు. ఆమె విదేశాల్లో ఉండటం వల్ల సినిమా చూడలేకపోయారు అని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.

Is Kushi movie story releated to Samantha Ruth Prabhu marriage life? Here is Shiva Nirvana clarity

డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో :నిన్ను కోరి, మజిలీ సినిమాల తర్వాత డిఫరెంట్ కథలతో వద్దామని అనుకొన్నాను. ఆ సమయంలోనే అంటే.. డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో విజయ్ దేవరకొండకు కథ చెప్పాను. ఆ సమయంలో లైగర్ సినిమా షూట్‌లో విజయ్ బిజీగా ఉన్నారు. నేను కథ చెప్పిన తర్వాత ఏడాదిన్నరకు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత ఇద్దరి మధ్య సమస్యల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే దాంపత్య జీవితంలోని సమస్యలను చాలా వినోదాత్మకంగా చెప్పాలని ఖుషి మూవీని రెడీ చేశాం అని శివ నిర్మాణ చెప్పారు.

Is Kushi movie story releated to Samantha Ruth Prabhu marriage life? Here is Shiva Nirvana clarity

వేలకుపైగా ప్రేమకథలు.. కానీ ఖుషి వేరు..:ఇప్పటికీ వేలకుపైగా ప్రేమకథలు సినిమా పరిశ్రమలో వచ్చాయి. మరో ప్రేమ కథ వస్తుందంటే.. ఏదో కొత్త పాయింట్ ఉండాలని అనుకొన్నాం. విజయ్ దేవరకొండకు పాయింట్ చెబితే.. కొత్తగా ఉందని అన్నారు. అలాంటి ప్రేమకథకు విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు లాంటి పాపులర్ ఆర్టిస్టులు ఉంటే బాగుంటుందని అనుకొన్నాం. మేము అనుకొన్న పాయింట్ ఎక్కువగా మందికి రీచ్ అయ్యాలనే ప్రయత్నంతో డిఫరెంట్‌గా కథ చెప్పాం. సఖి లాంటి సినిమాలు గుర్తుకు రావడం తప్పనిసరి. పెళ్లి అంటే తాళి, పెద్దలు ఉండాలి. డిఫరెంట్‌గా ఉండాలని పెళ్లితంతును మార్చలేం కదా శివ నిర్వాణ తెలిపారు.

Is Kushi movie story releated to Samantha Ruth Prabhu marriage life? Here is Shiva Nirvana clarity

సమంత మ్యారేజ్ లైఫ్ గురించిన కథ?:ఖుషి సినిమా కథ సమంత లైఫ్ గురించిన స్టోరి కాదు. మీడియాలో వచ్చిన వార్తలు కరెక్ట్ కాదు. సమంత కాకుండా వేరే హీరోయిన్ ఉంటే.. ఇలాంటి ప్రశ్న అడిగే వారు కాదు. నేను ఈ సినిమా కథను సమంతకు ఎప్పడో చెప్పాను. ఈ కథను మూడు సంవత్సరాల క్రితమే రాశాను. సమంత మ్యారేజ్ లైఫ్‌లో జరిగిన విషయాలు ఈ సినిమాకు సంబంధం లేదు. ఒకవేళ ఈ సినిమాలో రష్మిక మందన్న ఉంటే ఈ ప్రశ్న మీరు అడిగేవారా? అని శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

Is Kushi movie story releated to Samantha Ruth Prabhu marriage life? Here is Shiva Nirvana clarity

రియల్ లైఫ్ సంఘటనలతో.. :ఖుషి సినిమా రియల్ లైఫ్ నుంచి పుట్టినదే. నా ప్రతి సినిమాలో నా రియల్ లైఫ్ సంఘటనలు కొన్ని ఉంటాయి. ఖుషి సినిమా సరదాగా సాగే సినిమా. ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకొన్నాం. కానీ పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఖుషి టైటిల్ పెడితే బాగుంటుందని అనుకొన్నాం. ఖుషి అంటే తమిళ, మలయాళ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుంది. అందుకే ఖుషి అనే టైటిల్ పెట్టాం అని శివ నిర్వాణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X