మృణాల్ కు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడా? బయటపెట్టిన ప్రముఖ దర్శకుడు

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులతో మంచి బంధాన్ని ఏర్పర్చుకుంది. ఈ ముద్దుగుమ్మ నటనకు ఆడియెన్స్ కూడా ఎంతగానో ఫిదా అయ్యారు. ఆ తర్వాత నుంచి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. భారీ చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ పై దర్శకుడు గీతా కృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..

అక్కినేని హీరోతో మృణాల్ ఠాకూర్ డేటింగ్..
మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నార్త్, సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీతారామం చిత్రం తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. ఇదే సమయంలో మృణాల్ ఠాకూర్ ఠాకూర్ అక్కినేని హీరోతో ప్రేమలో పడిందంటూ పుకార్లు నెట్టింట ఆ మధ్య షికార్లు చేశాయి. ఓ ఫొటో కూడా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై ఇటు మృణాల్ ఠాకూర్ కానీ, అటు అక్కినేని హీరో గానీ స్పందించలేదు. దాంతో ఆ రూమర్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఇక తాజాగా వారిద్దరిపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Is Nagarjuna Waring to Actress Mrunal Thakur

నాగార్జున ప్రమేయం లేదు..
ఎవరితోనైతే మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉందంటూ ప్రచారం జరిగిందో వాస్తవం ఎంత అనేది చూడాలి. కానీ వారి ఇద్దరు మేడ్ ఫర్ ఈచెదర్ లా ఉంటారు. ఆ అమ్మాయి కూడా మంచింది. ఆమె థైస్ పై చాలా ఇబ్బందికరంగా కామెంట్స్ చేశారు. దాని కూడా మృణాల్ ఠాకూర్ ధీటుగా సమాధానం చెప్పింది. ఇక మృణాల్ ఠాకూర్ ను చిన్నచిన్న బట్టలు వేసుకోకని అక్కినేని నాగార్జున వార్నింగ్ ఇచ్చారంటూ కొందరు ప్రచారం చేశారు. అసలు అక్కినేని నాగార్జున వచ్చి వారికేమైనా వివరించారా? అని ప్రశ్నించాడు. అలా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

టాలీవుడ్ లోనే మృణాల్ ఠాకూర్..
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువ నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తెలుగు చిత్రాల్లో ఎలాంటి పాత్ర వచ్చినా నటించేందుకు రెడీగా ఉంటోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు జోడీగా నటించేందుకు ప్రయత్నిస్తోంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో పాటు కల్కి 2898 ఏడీలోనూ క్యామియో అప్పియరెన్స్ తో ఆకట్టుకుంది.

మృణాల్ ఠాకూర్ రాబోయే చిత్రాలు..
2014 నుంచి మృణాల్ ఠాకూర్ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. తొలుత ఈ ముద్దుగుమ్మ మరాఠి చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. ఆ తర్వాత హిందీలో సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక సీతారామం తర్వాత తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నెక్ట్స్ సన్నాఫ్ సర్దార్ 2, డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ, హై జవానీ థో ఇష్క్ హోనా హై, తుమ్ హో థో, పూజా మేరీ జాన్, AA26xA6 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X