Jailer మూవీలో బాలకృష్ణకు ఆఫర్.. మాఫియా డాన్ కాదట.. ఎలాంటి పవర్‌ఫుల్ రోల్ అంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తున్నది. విడుదలైన తర్వాత తొలి ఆట నుంచే ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్‌తో భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. తొలి రోజు ఈ చిత్రం 90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు నెల్సన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. రజనీకాంత్‌తోపాటు ఈ సినిమాలో బాలకృష్ణను కూడా తీసుకోవాలని పాత్ర రాసినట్టు చెప్పారు. అయితే బాలకృష్ణను ఎందుకు తీసుకోలేదనే విషయాన్ని అత్యంత క్లారిటీతో వివరణ ఇచ్చారు. నెల్సన్ చెప్పిన విషయాల్లోకి వెళితే..
ఆంధ్ర ప్రదేశ్‌లో అక్రమ విగ్రహాల తరలింపు, మంగళగిరిలోని ఆలయంలోని విగ్రహం చుట్టూ తిరిగే కథతోపాటు యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో జైలర్ రూపొందింది. ఈ చిత్రంలో రజనీకాంత్ జైలర్, రిటైర్డ్ జైలర్‌గా నటించారు. అయితే ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకా ఈ చిత్రంలో తమన్నా ఓ ప్రధాన పాత్రలో గ్లామర్ మెరుపులు మెరిపించింది.

జైలర్ చిత్రంలో రజనీకాంత్ స్టైల్స్‌తోపాటు శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్ పాత్రలను కూడా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ఈ ముగ్గురు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాలో తొలుత తెలుగు నుంచి బాలకృష్ణను కూడా తీసుకోవాలని, అందుకోసం ఓ పాత్రను కూడా రాసినట్టు దర్శకుడు నెల్సన్ తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాంతో ఎలాంటి పాత్ర అనే విషయంపై ఆసక్తిగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
జైలర్ సినిమా కోసం నందమూరి బాలకృష్ణను తీసుకోవాలని అనుకొన్నాం. ఆ క్రమంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను కూడా రాశాం. శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ పాత్రలకు ఏ మాత్రం తీసిపోకుండా రోల్ చేయాలనుకొన్నాం. కానీ ఆ పాత్ర ఓపెనింగ్, క్లోజింగ్ విషయంలో కొన్ని సందేహాలు ఉండేవి. ఆ పాత్ర బాలకృష్ణ రేంజ్‌కు తగినట్టు లేదనే ఫీలింగ్ కలిగింది. అందుకే ఆ పాత్ర విషయంలో వెనుక ముందు ఆలోచించాం అని దర్శకుడు నెల్సన్ చెప్పారు.

అయితే జైలర్ సినిమాలో బాలకృష్ణకు ఆఫర్ చేయాలనుకొన్న పాత్ర ఏమిటనే ప్రశ్నకు నెల్సన్ దిలీప్ కుమార్ స్పందించారు. జైలర్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను బాలకృష్ణ కోసం రాశాను. మీడియాలో వస్తున్నట్టు మాఫియా డాన్ క్యారెక్టర్ కాదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే జైలర్‌లో బాలకృష్ణ ఆఫర్ తృటిలో చేజారినప్పటికీ.. త్వరలోనే నెల్సన్‌తో సినిమా వస్తుందని బాలయ్య ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.


Click it and Unblock the Notifications











