Rajinikanth 100 శాతం నిజాలే మాట్లాడుతాడు.. ‘బాణం’ గట్టిగా తగులుతుంది.. జగపతిబాబు (ఇంటర్వ్యూ)

టాలీవుడ్‌లో సినీయర్ యాక్టర్ జగపతి బాబు నటించిన తాజా చిత్రం రామబాణం. మాచో స్టార్ గోపిచంద్‌తో, డైరెక్టర్ శ్రీవాసు కాంబినేషన్‌లో మరోసారి నటించారు. డింపుల్ హయతి, కుష్బూ సుందరం తదితరులు నటించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మే 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం గురించి హీరో జగపతి బాబు మాట్లాడుతూ..

అన్నదమ్ముల కథతో రామబాణం: తెలుగులో ఫ్యామిలీ డ్రామా నేపథ్యంగా సినిమాలు వచ్చి చాలా కాలమైంది. గోపిచంద్‌తో కాంబినేషన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అన్నదమ్ముల మధ్య వచ్చే కథలను ప్రేక్షకులు హిట్ చేస్తూనే ఉన్నారు.ఆ కాన్సెప్ట్ తెలుగు సినిమాలో వర్కవుట్ అవుతుంది. నేను శివరామరాజు సినిమా చేసినప్పుడు కరీంనగర్ జిల్లాలో విడిపోయిన 24 ఫ్యామిలీలు కలిశాయి. ఫ్యామిలీ రిలేషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు అని జగపతి బాబు చెప్పారు.

Jagapathi babu Interview about Rajinikanth controversy and Rama Baanam movie

గోపిచంద్ అలా చెప్పడం: నా కెరీర్‌లో ఇప్పటి వరకు 70 సినిమాల వరకు చేసి ఉంటాను. కానీ చెప్పుకోవాలంటే.. పది కంటే ఎక్కువ మంచి పాత్రలు లేవు. కానీ రామబాణం సినిమాలో క్యారెక్టర్ విషయానికి వస్తే.. గోపిచంద్ చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. అన్నయ్య క్యారెక్టర్ బాగా ఉంటేనే.. సినిమాకు బలం. జగపతిబాబు చేసే పాత్ర బలంగా ఉండాలని చెప్పాడు. ఈ సినిమాలో అన్నదమ్ముల పాత్రలు మరోసారి ఆకట్టుకొంటాయి అని జగపతి బాబు చెప్పారు.

Jagapathi babu Interview about Rajinikanth controversy and Rama Baanam movie

నెగిటివ్ పరిస్థితుల మధ్య పాజిటివ్: నేను యాక్టర్‌ను. డైరెక్టర్ ఏది చెబితే అది చేసే యాక్టర్‌ను. అంతే గానీ.. నేను హీరోనా? విలనా అనే విషయాన్ని పట్టించుకోను. మనం చేసే పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌ కళ్లలో కనిపిస్తుంది. ఆది కనిపించినప్పుుడే పాత్రలు బలంగా తెరపైన పండుతాయి. ప్రస్తుతం సమాజంలో మనుషుల మధ్య సెంటిమెంట్ తగ్గిపోయింది. ఎక్కువగా నెగిటివిటి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పాజిటివ్‌గా చెప్పడానికే రామబాణం సినిమా కథ. ఈ బాణం గట్టిగా తగులుతుంది అని జగపతి బాబు అన్నారు.

కుష్బూతో చిన్నప్పటి నుంచి స్నేహం: కుష్బూకు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సినిమా చేయడానికి కుదర్లేదు. కానీ మేము ఎప్పటికీ ఫ్రెండ్స్‌మే. మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్. కోపరేటివ్ ఆర్టిస్ట్. నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. ఆమె పాలిటిక్స్‌లోకి రావడం కూడా మంచిదే. వాస్తవానికి చాలా ధైర్యవంతురాలు. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలి అని జగపతి బాబు తెలిపారు.

Jagapathi babu Interview about Rajinikanth controversy and Rama Baanam movie

రజనీకాంత్ నిజాలే మాట్లాడుతూ: చంద్రబాబు గురించి రజనీకాంత్ ఏం మాట్లాడారో నాకు తెలియదు. వైసీపీ వాళ్లు ఏమంటున్నారో నాకు తెలియదు. రజనీకాంత్ మాట్లాడే విధానం చక్కగా ఉంటుంది. ఆయన చక్కగా మాట్లాడుతాడు. యూనివర్సల్‌గా మాట్లాడుతాడు. ప్రధానంగా నిజాలు మాట్లాడుతాడు. రజనీకాంత్ 100 శాతం నిజాలే మాట్లాడుతాడు. రజనీకాంత్ గురించి అనే వాళ్లు ఏదో అంటూనే ఉంటారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని జగపతి బాబు అన్నారు.

Jagapathi babu Interview about Rajinikanth controversy and Rama Baanam movie

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల తెలివైన బిజినెస్ మ్యాన్స్. బిజినెస్ బిజినేసే. ఏది ఏమైనా నాకు ఇది కావాల్సిందే అనే కొందరు చాలా నీచమైన బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. మీకు ఏం కావాలి.. మాకు ఏం కావాలి అనే విషయంపై క్లారిటీ ఉన్న నిర్మాతలు. మాకు ఏం కావాలో ఇచ్చి.. వాళ్లకు ఏం కావాలో తీసుకొంటారు అని జగపతి బాబు అన్నారు.

Jagapathi babu Interview about Rajinikanth controversy and Rama Baanam movie

రామబాణం గురించి: మంచి సినిమా చూడాలనుకొనే వారికి రామబాణం కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ రామబాణం మనసులో గుచ్చుకుపోతుంది. అన్నదమ్ములు సెంటిమెంట్‌తోపాటు ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న సినిమా. ఆర్గానిక్ ఫుడ్ గురించి చర్చించే సినిమా. ఈ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుంది. సినిమాకు వచ్చిన ప్రతీ ఒక్కరికి సంతృప్తిని అందిస్తుంది అని జగపతి బాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X