Jani Master Video: 6 ఏళ్ల జర్నీ తర్వాత రేప్ కేసు పెట్టడమా? జానీ మాస్టర్‌పై మహిళ ఆరోపణల వెనుక అదృశ్య శక్తి ఎవరు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన బాధితురాలిపై ఓ పక్క సానుభూతి, మరో పక్క ఆమె చేసిన ఆరోపణలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్‌తో బాధితురాలి ప్రయాణం ఆరేళ్లకుపైగానే.. గతంలో అనేక ఇంటర్వ్యూలో తన ఉన్నతికి కారణం మీరే అంటూ మాస్టర్‌పై ప్రశంసలు కురిపించింది. అయితే ఆల్ ఆఫ్ సడెన్ ఆయనపై కేసు నమోదు చేయడం వెనుక ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్కక్తం చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ గురించి దర్శకుడు చిట్టిబాబు, జనసేన నేత అరుణ వ్యక్తం చేసిన అనుమానాల్లోకి వెళితే..
జానీ మాస్టర్‌తో బాధితురాలికి సుదీర్గమైన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో ఎన్నడూ విమర్శలు, ఆరోపణలు చేయడంపై విస్మయం కలిగిస్తున్నాయి. జానీ మాస్టర్ తాను సంపాదించే సొమ్ములో సమాజం కోసం ఖర్చు చేస్తారు. బాధిత మహిళకు ఆయన అన్యాయం చేశారా? లేదా కావాలనే ఉద్వేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కాకుండా ఇప్పుడే ఆమె ఎందుకు ఆరోపణలు చేసిందనే విషయం తేల్చవలసి ఉంది అని అరుణ రాయపాటి అన్నారు.

దర్శక, నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎవరిని తప్పు పట్టలేం. ఇక్కడ మగవాళ్లు ధుర్యోధనులు కాదు. ఆడవాళ్లు సతి అనసూయలు కాదు. ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు? అనేది మనం తేల్చలేం. విచారణ, దర్యాప్తు తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. బాధితురాలు ఆయనపై చేసిన ఆరోపణలు రుజువు చేసే వరకు ఎవరిని అనుమానించలేం. నిందించడం కూడా తగదు అని అన్నారు.


Click it and Unblock the Notifications











