Record Break ‘జయసుధ గారికి చెప్పకుండానే డిసిషన్ తీసుకొన్నా.. ఇప్పుడు టెన్షన్‌గా ఉంది’

సినీ పరిశ్రమలో వారసులు కొనసాగడం సర్వసాధారణమే. నాలుగు దశాబ్దాలకుపైగా సహజ నటిగా పేరున్న జయసుధ తనదైన నటనతో ఇంకా ఆకట్టుకొంటున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రముఖ నటి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహిర్ కపూర్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా రికార్డు బ్రేక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

రికార్డు బ్రేక్ చిత్రం దేశ పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం. ఎన్నో భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన సినిమా. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ముందు నేను ఆయన నిర్మించిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాలో నటించాను. ఆ సమయంలో నాకు ఈ కథ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను అని అన్నారు.

Jayasudha Son Nihir Kapoor about Record Break Movie and Producer Chadalavada Srinivasa Rao

రికార్డు బ్రేక్ చిత్రం పక్కా కమర్షియల్ సినిమా. సామాజిక సమస్యలతోపాటు ఎమోషనల్‌గా సాగే స్పోర్ట్స్ డ్రామా. పక్కా గ్రామీణ వాతావరణంలో ఉండే ఇద్దరు అనాథలు అంతర్జాతీయ కుస్తీ పోటీలకు వెళ్లడమనేది స్పూర్తిదాయకమైన అంశం. మానవ సంబంధాలు, మదర్ సెంటిమెంట్‌తో రూపొందింది. అన్ని అంశాలు అందర్నీ ఆకట్టుకొనేలా ఉంటాయి అని నిహిర్ కపూర్ చెప్పారు.

రికార్డు బ్రేక్ చిత్రంలో WW (World Wrestling) వరల్డ్ రెజ్లింగ్ పోటీలు హైలెట్. ఇలాంటి కుస్తీ పోటీలు ఉత్తరాది భారతంలో జరుగుతుంటాయి. కాబట్టి ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా మార్చాం. ఈ సినిమాలో దేశంలో ప్రస్తుతం భారీ చర్చ జరుగుతున్న రైతుల అంశాన్ని చక్కగా చూపించబోతున్నాం అని నిహిర్ కపూర్ తెలిపారు.

Jayasudha Son Nihir Kapoor about Record Break Movie and Producer Chadalavada Srinivasa Rao

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా రికార్డు బ్రేక్ సినిమాను హై స్టాండర్డ్స్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా స్పోర్స్‌కు సంబంధించిన ఫైట్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఫైటర్ మాస్టర్ జాషువా ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఓ రేంజ్‌లో షూట్ చేశారు అని నిహిర్ కపూర్ అన్నారు.

రికార్డు బ్రేక్ సినిమా కథ విన్న సమయంలో మా అమ్మ (జయసుధ)కు చెప్పాలని అనుకొన్నాను. కానీ ఆ సమయంలో ఆమె చాలా బిజీగా ఉన్నారు. అయితే నిర్మాత పేరు చెప్పి.. సినిమా చేస్తున్నానని చెబితే మంచి ప్రాజెక్ట్ అవుతుందని అన్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆమెకు బాగా నచ్చింది. కొంత సినిమా కూడా చూశారు. పూర్తి సినిమా చూసిన తర్వాత ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తుందనే విషయం ఆలోచిస్తే టెన్షన్‌గా ఉంది అని నిహిర్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X