ఆ స్టార్ హీరోయిన్‌కు 36-24-36 కొలతలు.. ఎలాగైనా ఆ కోరిక తీర్చవా.. రాంగోపాల్ వర్మకు జేడీ చక్రవర్తి మొర

ఝాన్సీ సీజన్ 2, డెడ్ పిక్సెల్, సేవ్ ది టైగర్స్ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్‌ మరో విభిన్నమైన కంటెంట్‌తో దయా అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ వెబ్ సిరీస్‌లో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబేస్సాన్ తదితరులు నటించారు. ఎస్‌వీఎస్ బ్యానర్‌పై మహేంద్ర సోని, శ్రీకాంత్ మెహతా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు జేడీ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ..

దయ వెబ్ సిరీస్ కోసం హాట్ స్టార్ వాళ్లు నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ నాకు తెలుగు వెబ్ సిరీస్‌లో నటించడం ఇష్టం లేకపోవడం వల్ల కుంటి సాకులు చెప్పి వారిని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో హాట్ స్టార్ నిర్వాహకులు నాకు కాల్ చేస్తే.. డిసెంబర్ వరకు నేను బిజీ అని చెప్పాను. దాంతో మేము జనవరిలో ప్లాన్ చేస్తున్నాం. కథ వినండి అనడంతో నేను తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది అని జేడీ చక్రవర్తి చెప్పారు.

JD Chakravarthy

డిస్నీ+హాట్ స్టార్ వారిలో మాట్లాడిన తర్వాత దర్శకుడు పవన్ సాదినేని నాకు ఫోన్‌లో కథ చెప్పాడు. పది నిమిషాల్లోనే కథలో ఉన్న విషయం ఏమిటో అర్ధమైంది. ఆయన ఫుల్ స్టోరి నేరేట్ చేయడానికి నా వద్దకు రాగానే నాకు కథ నచ్చింది. దయ సినిమా చేస్తానని నేను చెప్పడంతో పవన్ సాదినేని కొంత డీలా పడ్డారు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు కథలో బలమేమిటో నాకు స్పస్టంగా తెలిసింది అని జేడీ చక్రవర్తి అన్నారు.

కంటెంట్ ఈజ్ కింగ్ అనేది నేను నమ్మను. కంటెంట్ ఈజ్ ప్రిన్స్, డైరెక్టర్ కింగ్ అని నమ్ముతాను. దర్శకుడు పవన్ సాదినేని చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా చెప్పిన కథ కారణంగానే దయా వెబ్ సిరీస్‌లో నటించడానికి ఒప్పుకొన్నాను. కథ ఎలాంటి కట్టడం లేని ప్రదేశం అనుకొంటే.. దర్శకత్వం అనేది మనం నిర్మించుకొనే అందమైన ఇల్లు లాంటింది. దర్శకుడి ప్రతిభ వల్లే మంచి అందమైన కట్టడం సాధ్యమవుతుందని నేను నమ్ముతాను అని జేడీ చక్రవర్తి చెప్పారు.

రాంగోపాల్ వర్మ, నేను రెగ్యులర్‌గా కలుసుకొంటూ ఉంటాం. రాం గోపాల్ వర్మ నాకు గురువు. నాకు ఉన్న ఒకే ఒక గురువు చెప్పుకొంటే.. ఒకరు ఈ మధ్య మెసేజ్ చేసి.. వర్మ ఒక్కరే గురువు అని ఎలా చెబుతావు. స్కూల్, కాలేజీలో గురువులు లేరా? అని అన్నారు. అయితే ఆయన నాకు యాక్టింగ్ గురువురా అని చెప్పాల్సి వచ్చింది. రాము గారు నాకు అంత ఇష్టం అని జేడీ చక్రవర్తి అన్నారు.

JD Chakravarthy request Director Ram Gopal Varma

రాంగోపాల్ వర్మ ఎవరికి ఛాన్సులు ఇవ్వరు. ఆయన ఛాన్సులు తీసుకొంటారు. ఎందుకంటే.. శివకు ముందు నేను ఎవరో ఆయన తెలియదు. ఆయన చుట్టం కాదు. ఆయన ప్రాంతానికి సంబంధించిన వాడిని కాదు. ఆయనతో ఎలాంటి రిలేషన్ లేదు. కానీ ఆయన నా టాలెంట్‌ను నమ్మాడు. ఆ నమ్మకంతోనే నాతో 34 సినిమాలు తీశాడు. అంతకంటే ఇంకా నాకు జీవితంలో ఏం కావాల్సింది ఏమిటి అని జేడీ చక్రవర్తి చెప్పారు.

రాం గోపాల్ వర్మతో నాకు మధ్య కొంత బ్రేక్ వచ్చింది. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాలు రాకపోడంపై మొన్ననే నేను అడిగాను. నీకు శ్రీదేవి అంటే ఇష్టం కదా. ఆమె 36-24-36 కొలతలు నీకు ఇష్టం కదా. నాతో 34 సినిమాలు తీశావు. ఇంకా రెండు సినిమాలు కూడా తీసి 36 సంఖ్యను పూర్తి చేయి. శ్రీదేవి నీకు నిజంగా ఇష్టమైతే ఆ రెండు సినిమాలను తీసి నీకు నీవు శ్రీదేవి ఫ్యాన్ అని నిజం చేయి. అలా నా కోరిక కూడా తీరినట్టు అవుతుందని కోరాను అని జేడీ చక్రవర్తి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X